నేడు శాకాంబరి రూపంలో దర్శనమివ్వనున్న కోట మైసమ్మతల్లి
== పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం
కారేపల్లి: సింగరేణి మండలం ఉసిరికాయల పల్లి పంచాయతీ పరిధిలోగల కోట మైసమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం అమ్మవారు శాకాంబరి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసం సందర్భంగా అలంకరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కొత్తలంక కైలాస శర్మ మాట్లాడుతూ అమ్మవారిని పలు రకాల కూరగాయలతో అలంకరిస్తూ ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు.
allso read- రోడ్డు మార్గంగానే భద్రాచలానికి సీఎం