Telugu News

తులిసియా తండా చెరువు వద్ద ఉద్రిక్తత.

మత్స్యకారులకు, తులిసియా తండా గ్రామస్థుల మధ్య ఘర్షణ

0

తులిసియా తండా చెరువు వద్ద ఉద్రిక్తత.

== కలెక్టర్ మాటలు భేకాతర్ చేసిన మత్స్యకారులు.

== మత్స్యకారులకు, తులిసియా తండా గ్రామస్థుల మధ్య ఘర్షణ

కారేపల్లి జూలై31 (విజయం న్యూస్):

కారేపల్లి మండలంలో ఇటీవల రెండు రోజుల క్రితం పర్యటించిన జిల్లా వి.పి కలెక్టర్ గౌతమ్ చెరువులు పర్యవేక్షించి చెరువుల హద్దులు నిర్ణయించే వరకు ఎవ్వరు పనులు చేయవద్దని, వారంలో సర్వే పూర్తి చేసి చెరువు హద్దులు వేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారి చేసిన విషయం విధితమే. కానీ కారేపల్లి కి చెందిన మత్స్యకారులు ఆదివారం ఉదయాన్నే చేప పిల్లలు చెరువులో వదలడానికి రావడంతో గిరిజనులు అయిన తులసియా తండా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. అప్పాయగూడెం గ్రామపంచాయతీకి హద్దులు కేటాయించి ,చెరువులో సభ్యత్వం ఇచ్చేంత వరకు చేప పిల్లలు చెరువులో వదిలిపెట్టేది లేదని, సంవత్సరాలుగా చెరువు శివారులో ఉంటున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం మత్స్యకారులకు, గ్రామస్తులకు ఘర్షణ కొనసాగుతుందని తెలుస్తుంది.

allso read- ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..? : సీతక్క