Telugu News

కారేపల్లిలో బండి సంజయ్ దిష్టిబొమ్మకు చెప్పుల దండా

బీజేపీ పై భగ్గుమన్న కారేపల్లి బిఆర్ఎస్ పార్టీ

0

*బీజేపీ పై భగ్గుమన్న కారేపల్లి బిఆర్ఎస్ పార్టీ..*

*-బండి సంజయ్ దిష్టిబొమ్మకు చెప్పుల దండా వేసి, దగ్ధం చేసి నిరసన.*

(కారేపల్లి-విజయం న్యూస్)

ఈరోజు కారేపల్లి మండల మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనిచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బండి సంజయ్ దిష్టిబొమ్మ ను దగ్ధం చేస్తూ పెద్ద ఎత్తున ఆగ్రహజ్వాలతో నిరసన తెలిపిన మహిళా సోదరీమణులు..

Allso read-16న ఈడీ ముందుకు కవిత

👉 వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పిలుపుతో కారేపల్లి మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మకు చెప్పుల దండా, చీపురు కట్ట మెడలో వేసి, దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…..
ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉండి బండి సంజయ్ ఒక ఉన్నతమైన పదవిలో కొనసాగుతూ తెలంగాణ కీర్తిని ప్రపంచ నలుమూలలో చాటిన మహిళపై చేసిన అనిచిత వ్యాఖ్యలతో బిజెపి పార్టీకి, మహిళా లపై ఉన్న గౌరవం ఏమిటో అర్థం అవుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళలపై అత్యధికంగా ఎందుకు దాడులు జరుగుతున్నాయో బండి సంజయ్ వ్యాఖ్యలతో అర్థమవుతుందని తెలిపారు.

Allso read:- మహిళ బిల్లు సంగతేంటి..?

బండి సంజయ్ చేసిన ఈ వాక్యాలను మహిళా లోకమంతా తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని తెలుపుతూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళసై ఒక మహిళగా స్పందించి చర్యలు తీసుకోవాలని, ఒక పార్టీకి అధ్యక్షుడు హోదాలో బండి సంజయ్ కొనసాగే అర్హత లేదంటూ డిమాండ్ చేస్తూ వెంటనే బండి సంజయ్ ని అరెస్టు చేయాలని కారేపల్లి మండల మహిళా సోదరీమణులు కోరారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ మహిళ ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాల మహిళ సోదరీమణులు, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ ధరవత మంగీలాల్, సంత చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, సొసైటీ డైరెక్టర్ మర్శకట్ల రోశయ్య, తోటకూరి రాంబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాంకుడోత్ నరేష్, నాయకులు అజ్మీర వీరన్న, బత్తుల శ్రీనివాస్, తొటకూరి రాంబాబు, అడపా పుల్లారావు, మండల మహిళ అధ్యక్షరాలు బాణోత్ పద్మావతి,

Allso read:- నేలకొండపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

మహిళల నాయకురాలు తోటకూరి శోభ, యూత్ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘు, షాదిఖాన చైర్మన్ షేక్ షఫీ, మండల మీడియా కన్వీనర్ భూక్య రాంకిషోర్ నాయక్, యూత్ ప్రధాన కార్యదర్శి బాణోత్ కోటి, మైనార్టీ నాయకులు షేక్ గౌస్ పాషా, బిసి సెల్ అధ్యక్షుడు పిల్లి వెంకటేశ్వర్లు, గ్రామశాఖ నాయకులు బాణోత్ వీరన్న చక్రం, అదేర్ల రామారావు, అంగోత్ ఠాగూర్, చెవుల చందు, జూపల్లి రాము, చందర్, కార్యాలయం ఇంచార్జి తోగరు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.