Telugu News

త్వరలో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ హైవే పనులు షురూ..

కేంద్ర రోడ్లు, రవాణా శాఖ ప్రాంతీయ అధికారి కుష్వాహాతో బండి సంజయ్ భేటీ

0

త్వరలో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ హైవే పనులు షురూ..

• కేంద్ర రోడ్లు, రవాణా శాఖ ప్రాంతీయ అధికారి కుష్వాహాతో బండి సంజయ్ భేటీ

• ఎన్ హెచ్ -765 పనుల శంకుస్థాపన ఏర్పాట్లపైనా చర్చ

• ఎన్ హెచ్-563 పనుల కోసం రూ. కోట్ల మంజూరు

• 30.99 కి.మీల మేర జగిత్యాల, గంగాధర, వెదిరె, కరీంనగర్ బైపాస్ ల నిర్మాణం

• ముగిసిన టెండర్ల ప్రక్రియ

• కొనసాగుతున్న భూసేకరణ

• అతి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కేంద్రం సన్నహాలు

(కరీంనగర్ -విజయం న్యూస్)
• జగిత్యాల-కరీంనగర్-వరంగల్ హైవే (‌ NH -563) విస్తరణ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 12న (శనివారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్కతుర్తి- సిద్దిపేట – మెదక్ (NH-765DG) జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ ప్రాంతీయ అధికారి కుష్వాహతో సమావేశమయ్యారు.

ఇది కూడా చదవండి: గవర్నర్ హక్కులను హరిస్తున్న కేసీఆర్: గోనే ప్రకాష్

• ఈ సందర్భంగా ఎల్కతుర్తి- సిద్దిపేట – మెదక్ (NH-765DG) జాతీయ రహదారి విస్తరణ పనుల శంకుస్థాపన ఏర్పాట్లతోపాటు జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (‌ NH -563) విస్తరణ పనుల ప్రారంభం, భూ సేకరణ వంటి అంశాలపైనా సుధీర్ఘంగా చర్చించారు.

• ఎన్ హెచ్-563 4 లేన్ విస్తరణ పనులకు సంబంధించి జగిత్యాల నుండి కరీంనగర్ వరకు మొత్తం 58.86 కి.మీల మేరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ. 2,151 కోట్ల 63 లక్షల అంచనా వ్యయం కానుందని ఈ సందర్భంగా అధికారులు బండి సంజయ్ కు తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఇది కూడా చదవండి:- ప్రపంచకప్ నుంచి భారత్ ఔట్

• అట్లాగే కరీంనగర్ నుండి వరంగల్ వరకు మొత్తం 68 కి.మీల మేరకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని, ఇందుకోసం రూ.2,148 కోట్ల 86 లక్షల వ్యయం కానుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఈ రహదారి విస్తరణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ముగిసిందని వెల్లడించిన అధికారులు అతిత్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు.

• ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 12న ఎల్కతుర్తి- సిద్దిపేట – మెదక్ (NH-765DG)తోపాటు బోధన్ – బాసర- బైంసా, సిరోంచ – మహదేవ్ పూర్ శంకుస్థాపన పనులను కూడా రామగుండం నుండి ఏకకాలంలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా జాతీయ రహదారుల విస్తరణ పనుల శంకుస్థాపన ఏర్పాట్ల తీరుతెన్నులను సైతం బండి సంజయ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి:- బి జె పి వి అసత్యపు ప్రచారం- మంత్రి గంగుల ధ్వజం

• ముఖ్యంగా తన క్రుషితో రూ.1461 కోట్ల వ్యయంతో మంజూరైన ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్ జాతీయ రహదారుల జాతీయ రహదారి విస్తరణ పనుల శంకుస్థాపన ఏర్పాట్లపైనా అధికారులతో ఆయన ప్రత్యేకంగా చర్చించారు. ప్రధాని రాక నేపథ్యంలో రహదారుల విస్తరణ పనుల శంకుస్థాపన విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను కోరారు.