Telugu News

దూసుకపోతున్న కార్తికేయ-2

వందకోట్ల క్లబ్ లో నిఖిల్ సినిమా

0

దూసుకపోతున్న కార్తికేయ-2

== వందకోట్ల క్లబ్ లో నిఖిల్ సినిమా

== పెద్ద స్టార్ గా మారిపోయిన నిఖిల్

== కార్తీకేయకు భారీ నజరానా

(చిత్రవిభాగం-విజయంన్యూస్)

చాలా చిన్న హీరో.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో.. మంచి సినిమాలు తీసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తు వస్తున్న హీరో.. అలాంటి హీరో ఒక్క సినిమాతో పెద్ద స్టార్ ఇమేజిని సొంతం చేసుకున్నాడు. ఆయన తీసిన చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. అంతా ఇంతా కాదు.. వందకోట్ల క్లబ్ లో ఆ సినిమా చేరిందంటే ఎంత బిగెస్ట్ హిట్టో మనం అర్థం చేసుకోవాలి. ఊహించని విధంగా వసూళ్లను రాబడుతున్న ఆ సినిమా ఇప్పుడు యమక్రేజీ సినిమా గా మారింది. థియోటర్లకు వెళ్ళక పెద్దపెద్ద సినిమాలే బోర్లబొక్కల పడుతున్న తరుణంలో చిన్న సినిమాగా థియోటర్లలోకి వచ్చి కాసుల వర్షం కురిపించడం పట్ల సినిప్రపంచం అశ్ఛర్యం వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి: ‘గాడ్‌ఫాదర్‌’మ్యూజిక్‌ పై నెటిజన్ల ఫైర్

దీంతో ఆ సినిమా నిర్మాత ఆ హీరోకు భారీ నజరానా ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే చందు మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్‌ నటించిన కార్తికేయ-2 సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ముందుగా పరిమిత థియేటర్స్‌లో మాత్రమే రిలీజైన కార్తికేయ చిత్రం.. కేవలం ప్రజాల నిరాజనాలు, అభిమానుల నుంచి వచ్చిన మంచి అధరణ ఫలితం, మౌత్‌ టాక్‌ తో అనేక థియేటర్స్‌ ను సొంతం చేసుకుంది. ప్రతిచోటా హౌస్‌ ఫుల్స్‌ తో రన్‌ అవుతూ మంచి లాభాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌ లో చేరిపోయింది. ఈ సందర్బంగా ఈ చిత్ర యూనిట్‌ సెలెబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ దర్శకుడి మెండిటి, హీరో నిఖిల్‌, హీరోయిన్ అనుపమకు, అలానే డిస్టిబ్యూటర్స్‌ ను ప్రశంసల జల్లులో మురిపించేశారు. అందరికి చాలా పెద్ద థాంక్స్‌ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేమమ్‌, శతమానం భవతి సినిమాల తరువాత ఈ సినిమా తనకు మైల్‌ స్టోన్‌ అని నటి అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు. ఈ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ అవ్వడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: రాజమౌళి దర్శకత్వంపై ఆర్జీవీ సంచలన కామెంట్స్‌

అలాగే ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ మాత్రం తనకు చాలా విలువైందన్న అనుపమ..  మూవీ టీంకి కంగ్రాట్స్‌ చెప్పారు. ఇక కార్తికేయ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ లిస్ట్‌ లో చేరిన సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..  ఇలాంటి కథ సినిమా తీయడానికి తనకు విజ్ఞానాన్ని, వికాసాన్ని నేర్పించిన  తన తల్లిదండ్రులకి, కొడుకులా చూసుకున్న మా అన్నయ్యకు ధన్యవాదలు అంటూ ఎమోషనల్‌ కామెంట్‌ చేశారు. ఈరోజు నిఖిల్‌ గురించి బాలీవుడ్‌ లో కూడా మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ మూవీ సక్సెస్‌ కు ప్రధాన పాత్ర పోషించిన హీరో నిఖిల్‌ మాట్లాడుతూ….  రాజమౌళి , సుకుమార్‌ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారన్నారు. వాళ్ళు వేసిన రూట్స్‌ వలనే ఈ కార్తికేయ సినిమాను ఇలా తీసుకెళ్లగలిగామని చెప్పారు. ఈ రోజు 1200 స్క్రీన్‌ లలో కార్తికేయ ఆడుతుందంటే అది తెలుగు సినిమా గొప్పతనమని కొనియాడారు. నన్ను  ఒక ఫ్రెండ్‌ లా ఒక,  ఫ్యామిలీ మెంబెర్‌ లా ఫీలయి ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ నిఖిల్‌ ముగించారు. అయితే హీరో నిఖిల్ కు నిర్మాత భారీ నజరాన ఇచ్చినట్లు తెలుస్తోంది. నిఖిల్ ఊహించని నజరాన అందించి షాక్ కు గురి చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి హీరో నిఖిల్ బిగెస్ట్ స్టార్ లిస్ట్ లో చేరిపోయాడనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్ నిఖిల్ అండ్ టీమ్.

ఇది కూడా చదవండి: నేడు భారత్‌,పాక్‌ క్రికెట్ మ్యాచ్‌