Telugu News

ఖమ్మం లో కషాయ జెండా ఎగరడం ఖాయం: సుధాకర్ రెడ్డి

దేశంలో కాంగ్రెస్ పని ఖేల్ ఖతం దుకాణ్ బంద్

0

ఖమ్మం లో కషాయ జెండా ఎగరడం ఖాయం: సుధాకర్ రెడ్డి

== దేశంలో కాంగ్రెస్ పని ఖేల్ ఖతం దుకాణ్ బంద్

== దేశవ్యాప్తంగా మళ్ళీ బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారు

== ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందాలంటే వినోద్ రావును గెలిపించండి

== ఎన్నికల ప్రచారంలో జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి

(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కచ్చితంగా కషాయ జెండా ఎగరడం ఖాయమని, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మంచి మెజారిటీ తో గెలుస్తారని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కో ఇంచార్జ్  పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఖమ్మం రూరల్ తిరుమలాయ పాలెం మండలంలో జరిగిన బిజెపి పార్టీ రోడ్ షో లో  పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి  తాండ్ర వినోద్ రావు తో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరూ పొందుతున్నారు. అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేసుకొని ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా అందేందుకు అవకాశం ఉంటుందని పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలియజేశారు.

ఈ దేశంలో కాలం చెల్లిన కమ్యూనిస్టులకు, అస్తిత్వం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కి, అప్పులఊబిలోకి నెట్టిన బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని వారు కోరారు.

ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం నిరంతరం తపించి 24 గంటలు పని చేసే ఏకైక ప్రధాని కేవలం శ్రీ నరేంద్ర మోడీ మాత్రమే నని, కనుక నరేంద్ర మోడీ సైనికుడిగా మీ ముందుకు వచ్చిన శ్రీ తాండ్ర వినోద్ రావు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ పార్టీకి మద్దతుగా నిలవాలని స్థానిక ప్రజలను కోరారు.

ఇది కూడా చదవండి:- ఐఎన్ సీ అంటే.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్: బండి సంజయ్

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ సోదరులు మంద కృష్ణ మాదిగకి పొంగులేటి సుధాకర్ రెడ్డి  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ రోడ్ షో లో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు, తిరుమలాయ పాలెం మండల అధ్యక్షులు బొడ్డుపల్లి ప్రసాద్, పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్, శ్యామ్ రాథోడ్, చావా కిరణ్, తక్కెల్లపల్లీ నరేందర్, శాసనాల సాయిరాం మరియు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- గడీల వారసులు కావాలా?…. గరీబోళ్ల బిడ్డ కావాలా?: బండి సంజయ్