ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభిషేక్ బోయినపల్లి అరెస్ట్..
== ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు
ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లిని సీబీఐ అరెస్టు చేసింది. ఆదివారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి డిల్లీకి తరలించారు. సీబీఐ కేంద్ర కార్యాలయం వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు. అభిషేక్ రావు స్టేట్‌మెంట్‌తో మరికొంత మందిపై సీబీఐ చర్యలు తీసుకోనుంది. అయితే ఈ విషయంలో సీఎం కేసీఆర్ తనయ కవితకు ఉచ్చుబిగిస్తున్నట్లే కనిపిస్తోంది. బోయినపల్లి అభిషేక్ తో వ్యాపార లావాదేవిలు కవితకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా బొయినపల్లి అభిషేక్ బందుత్వ సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
== అభిషేక్ బోయినపల్లి కంపెనీలు
అనూస్ ఒబేసిటీ అండ్ ఎలక్ట్రోలిసీస్, రాబిన్ డిస్టిలరీస్, అగస్టీ వెంచర్స్, ఎస్ఎస్ మైన్స్ అండ్ మినరల్స్, నియోవర్స్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, వాల్యూ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, జీనస్ నెట్వర్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అనూస్ హెల్త్ అండ్ వెల్నేస్
ఇది కూడా చదవండి : ఖమ్మం నగరంలో చాపల మార్కెట్ వద్ద ఉద్రిక్తత