కేసీఆర్ వ్యూహమేంటి..?
== కెసిఆర్ ప్రత్యామ్నాయ రాజకీయాలపై సందిగ్ధత..?
== ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై సర్వత్రా ఆసక్తి..?
== మరింత దూకుడు పెంచనున్న తెలంగాణ బిజెపి నేతలు..?
(హైదరాబాద్-విజయంన్యూస్):-
ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి మళ్లీ అధికారంలోకి రావడంతో తెలంగాణపై ఆ ఫలితాల ప్రభావం చూపుతాయని బిజెపి భావిస్తోంది. మోదీ, అమిత్‌షా ద్వయం తెలంగాణపై దృష్టి పెడతారన్న ప్రచారం అప్పుడే మొదలయ్యింది. కేంద్రంపై కెసిఆర్ దాడి మొదలు పెట్టడంతో ఇక అనివార్యంగా బిజెపి దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు పావులు కదపడం కూడా రాష్ట్రంలో బీజేపీకి కలిసి రానుందని అంటున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండడం, తెలంగాణలో ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్న నేపథ్యంలో యూపీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావంతో జాతీయ స్థాయిలో ఫ్రంట్ ప్రయత్నాలను కేసీఆర్ ఆపేస్తారా.. లేక బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ శక్తులను ఏకం చేస్తారా.. అన్నది చూడాలి.
also read;-కమలం నెక్స్ట్ టార్గెట్ ‘తెలంగాణ’
== కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఏకపక్ష ఫలితాల ఫలితంగా సీఎం కేసీఆర్ ప్లాన్.. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలేంటన్న విషయంపై సర్వత్ర చర్చ జరుగుతోంది.. జాతీయ రాజకీయాలపై పదును పెడతారా..? దానికి త్వరలోనే స్పష్టత రానుంది. ఇక తెలంగాణలోనూ బీజేపీ దూకుడు పెంచనుంది. దాంతో ప్రత్యామ్నాయ రేసులో మరికాస్త ముందుకు వెళ్లే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దుబ్బాక, హూజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ రెండు స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్ గెలిచేందుకు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రజలు బీజేపీకే పట్టం కట్టడంతో టీఆర్‌ఎస్‌కు నిరాశ తప్పలేదు. అంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ నాలుగు ఎంపి సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఎవరూ ఊహించని విధంగా భారీగా సీట్లను సాధించింది. టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీని ఇచ్చింది.
also read;-పంజాబ్‌లో ఓడిన సోనూసూద్ సోదరి
ఇలా కొంతకాలంగా తెలంగాణలో మిగతా ప్రతిపక్ష పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ ప్రభావం కొంత ఎక్కువగానే ఉంది. అటు కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో మరి దారుణంగా ఉంది. గ్రూపు రాజకీయాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో తెలంగాణలో బీజేపీ ఎంతోకొంత ప్రభావం చూపడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ సర్కారుతో రాజీపడొద్దంటూ.. ప్రజా సమస్యలపై పోరాడాలంటూ ఇప్పటికే అమిత్ షా పలుమార్లు సూచనలు చేశారు కూడా. తమ తర్వాతి టార్గెట్ తెలంగాణయేనీ.. అక్కడ వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలన్న పంతంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కేసీఆర్ కూడా ఢల్లీి బాట పడుతూ ఉండటం.. జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాట్లను చేస్తూ ఉండటాన్ని ఢల్లీి బీజేపీ పెద్దలు నిశితంగా గమనిస్తున్నారు. బీజేపీతో పెట్టుకుంటే ఏపీలో టీడీపీకి ఏర్పడిన పరిస్థితినే టీఆర్‌ఎస్‌కు ఎదురవుతుందన్న సంగతిని తెలియజేయాలన్న పంతంతో ఉన్నట్టు బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.