Telugu News

కేసీఆర్‌ మాటల వెనుక పెద్ద కుట్ర

ఆయనపై బీజేపీ నేతలు కేసులెందుకు పెట్టలేదు?: రేవంత్‌ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ దీక్ష విరమణ 

0

కేసీఆర్‌ మాటల వెనుక పెద్ద కుట్ర

?ఆయనపై బీజేపీ నేతలు కేసులెందుకు పెట్టలేదు?: రేవంత్‌ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ దీక్ష విరమణ 

హైదరాబాద్‌,–రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో సూత్రధారి ప్రధాని మోదీ అయితే.. కేసీఆర్‌ పాత్రదారి అన్నారు. రాజ్యాంగంపై ఇంకోసారి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తామని, ప్రగతి భవన్‌లో ఇటుక ఇటుకా పీకేస్తామని హెచ్చరించారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో గురువారం ప్రారంభమైన 48 గంటల దీక్ష శుక్రవారం సాయంత్రం ముగిసింది. రేవంత్‌, ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ రాజీవ్‌ లిలోతియాలు ఎస్సీ సెల్‌ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.

also read :-మోదీకి ఆయ‌న క‌ల‌లో వ‌చ్చి ఉప‌దేశం చేస్తార‌ని కోరుకుంటున్నా : మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీకి రష్యా, చైనాల అధ్యక్షులు పుతిన్‌, జిన్‌పింగ్‌లు ఆదర్శమైతే.. కేసీఆర్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆదర్శమని వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. ఆ దేశ రాజ్యాంగానికి సవరణ చేసి తనను తాను శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకున్నారని, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా ఆ దేశానికి తాను 2036 వరకూ అధ్యక్షునిగా కొనసాగేలా రాజ్యాంగానికి సవరణ చేసుకున్నారని పేర్కొన్నారు. ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను ప్రశ్నించడం కోసం ఆ దేశంలో వేరే పార్టీనే ఉండదన్నారు.

also read:-కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై

కానీ అంబేడ్కర్‌ రాసిన భారత రాdజ్యాంగంలో ప్రతీ ఒక్కరి ఓటు విలువా ఒక్కటేనని, తామంతా ప్రజా సేవకులం మాత్రమేనన్నారు. కడియం శ్రీహరి, కేశవరావు లాంటి వాళ్లు పదవుల కోసం కేసీఆర్‌ కాళ్ల దగ్గర ఇంకా నిలబడాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. ఢిల్లీలో అంబేడ్కర్‌ సాక్షిగా దీక్ష చేశామని చెబుతున్న బీజేపీ తెలంగాణ ఎంపీలు బండి సంజయ్‌, అరవింద్‌లు.. ఈ విషయంలో కేసీఆర్‌పైన ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. పార్లమెంటులో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.  నేడు కేసీఆర్‌పై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్లలో శనివారం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలపైనా ఫిర్యాదులు చేయాలంటూ కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్‌ పిలుపునిచ్చారు.

also read:-కూసుమంచిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం..

ఆదివారం అన్ని ప్రాంతాల్లోని అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూజలు చేయాలని మహిళా కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, ఎమ్మెల్యే సీతక్కల నాయకత్వంలో ట్యాంక్‌ బండ్‌ వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహానికి తాము పాలాభిషేకం చేస్తామన్నారు. సోనియా, రాహుల్‌తో మాట్లాడి పార్లమెంటు బయట సోమవారం తాను, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిసి దీక్షలో కూర్చుంటామన్నారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలతో ఆయన ఆలోచనా విధానం స్పష్టమైందని, ఎన్నికలకు, పాలన చేయడానికి ఆయన అనర్హుడని అన్నారు. భారత రాజ్యాంగం పనికి రాదని చెప్పిన సీఎం కేసీఆర్‌ను తొలగిస్తే తప్ప రాజ్యాంగానికి గౌరవం దక్కదని పేర్కొన్నారు.