Telugu News

నేడు ఖమ్మం లో కేసీఆర్ బస్సుయాత్ర 

రెండు రోజులపాటు జిల్లాలో విస్తృతంగా పర్యటన..

0

నేడు ఖమ్మం లో కేసీఆర్ బస్సుయాత్ర 

== రెండు రోజులపాటు జిల్లాలో విస్తృతంగా పర్యటన..

== రాత్రి ఖమ్మంలో బస

== భారీగా జనసమీకరణ చేస్తున్న బీఆర్ఎస్ 

== కేసీఆర్ బస్సు యాత్రను విజయవంతం చేయండి: ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు 

ఖమ్మo, ఏప్రిల్ 28(విజయం న్యూస్):

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర సోమవారం ఖమ్మం జిల్లాకు చేరుకోనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా చేపట్టిన ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రెడ్డిరావు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు. ముందుగా ఈ నెల 24నుంచి ఈ బస్సుయాత్ర మిర్యాలగూడ నుంచి ప్రారంభం కాగా నేడు కోదాడ మీదగా ఖమ్మం కు చేరుకోనుంది.

ఇది కూడా చదవండి:- క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలి: నామా

29,30 తేదీలలో ఖమ్మం, కొత్తగూడెం,జిల్లాలలో పర్యటిస్తారని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 29వతేదీ వరంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం ఖమ్మం చేరుకుంటారని,కాల్వొడ్డు, మయూరి సెంటర్,వైరా రోడ్డు మీదుగా జేడ్పీ చౌరస్తా వరకు బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించి ప్రసంగిస్తారని తెలిపారు.అటు తర్వాత ఖమ్మంలో రాత్రి బస చేసి 30తేదీ సాయంత్రం తల్లాడ, జూలూరుపాడుల మీదుగా కొత్తగూడెం చేరుకుని రోడ్ షో నిర్వహించి,ఆ రాత్రి అక్కడ బస చేసి, తెల్లారి ఇల్లందు మీదుగా మహబూబాబాద్ వెళతారని వివరించారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర సక్సెస్ కోసం భారీగా జనసమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం నగరానికి దగ్గరగా ఉన్న పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:- నేను పక్కా లోకల్: నామా నాగేశ్వరరావు 

== బస్సు యాత్రను జయప్రదం చేయండి: నామా

14 ఏళ్లు ఏకధాటిగా తెలంగాణా మహోద్యమాన్ని నడిపించి ప్రజల చిరకాల వాంఛ స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహానేత జిల్లాలో చేపట్టిన కేసీఆర్ బస్సు యాత్రను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కార్యకర్తలకు విజ్ణప్తి చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్ల పాటు సుపరిపాలన అందించి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిపిన పాలనాదక్షులని అన్నారు..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పాలకులు నెరవేర్చకపోవడం, తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నందున ప్రజలకు అండగా నిలిచేందుకు గాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారని వివరించారు.

 

తన యాత్రలో భాగంగా మహనీయులు కేసీఆర్ ఈనెల 29,30 తేదీలలో ఖమ్మం, కొత్తగూడెం,జిల్లాలలో పర్యటిస్తారని ఎంపీ పేర్కొన్నారు.ఈనెల 29వతేదీ వరంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం ఖమ్మం చేరుకుంటారని,కాల్వొడ్డు, మయూరి సెంటర్,వైరా రోడ్డు మీదుగా జేడ్పీ చౌరస్తా వరకు బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించి ప్రసంగిస్తారని తెలిపారు.అటు తర్వాత ఖమ్మంలో రాత్రి బస చేసి 30తేదీ సాయంత్రం తల్లాడ, జూలూరుపాడుల మీదుగా కొత్తగూడెం చేరుకుని రోడ్ షో నిర్వహించి,ఆ రాత్రి అక్కడ బస చేసి, తెల్లారి ఇల్లందు మీదుగా మహబూబాబాద్ వెళతారని వివరించారు.పదేళ్ల పాటు రాష్ట్రానికి సుపరిపాలన అందించిన దార్శనికులు కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలకు పెద్ద సంఖ్యలో హాజరై దిగ్విజయం చేయాల్సిందిగా గులాబీ శ్రేణులు,అన్ని వర్గాల ప్రజలకు నామ విజ్ఞప్తి చేశారు.