Telugu News

వడ్ల కొనుగోళ్లను పక్కనబెట్టి కెసిఆర్ చౌకబారు రాజకీయాలు …

వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలి ...

0

వడ్ల కొనుగోళ్లను పక్కనబెట్టి కెసిఆర్ చౌకబారు రాజకీయాలు …

* వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలి …

*తాలు, తరుగు, తేమ, రంగు మారడం పేరుతో కోతలు విధించకుండా ప్రతి చివరి గింజ కొనుగోలు చేయాలి..

బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి …

ఒక దిక్కు వడ్లు అమ్ముకునేందుకు రైతులు తిప్పలు పడుతుంటే, కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, వడ్ల అమ్మకాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి కెసిఆర్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు సమస్యలపైగురువారం కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి కెసిఆర్ ఫక్తు పాలిటిక్స్ ప్రారంభించారని ఆయన విమర్శించారు. రైతు పండించిన ప్రతి పంటను చివరి గింజను కొనుగోలు చేస్తామన్నా మాటలను కెసిఆర్ పక్కనపెట్టి రాజకీయ డ్రామాలకు శ్రీకారం చుట్టడం సిగ్గుచేటన్నారు. రైతులు పంట కొనుగోళ్లకు కేంద్రం సిద్ధంగా ఉన్నా, నేటికీ అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేని దుస్థితిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యం అన్నారు. కేంద్రం తెలంగాణ ప్రాంతం నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని లెటర్ పంపిందని, అంతకన్నా ఎక్కువ పంట ఉన్న ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించిన, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లను సక్రమంగా చేపట్టకుండా రైతులను తప్పుదారి పట్టించి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకో వచ్చి పడిగాపులు పడుతున్నారని, పండినపంటను కాపాడుకోవడానికి అక్కడే పడిగాపులు కాసి నరకయాతన అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తున్న రాష్ట్రంలో ఐకెపి కేంద్రాలను ఎందుకు ప్రారంభించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉప్పుడు బియ్యం ఇవ్వమని ఎఫ్సీఐ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది వాస్తవం కాదో స్పష్టం చేయాలన్నారు. సాధారణ బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా ఉప్పుడు బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టు పడుతుందో స్పష్టంగా వివరించాలన్నారు. మిల్లులను అప్గ్రేడ్ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ కోసం ఎందుకు ప్రోత్సాహకాలు అందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వడ్ల కొనుగోళ్ల కోసం84,700 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వివరించారు. వానకాలం పంట అంతా రోడ్లపైన, కళ్ళల్లో ఉంటే కెసిఆర్ రైతుల ఉసురు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. జిల్లావ్యాప్తంగా వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంట మొత్తం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పొలాలను కౌలుకు తీసుకొని పంటలు పండించిన పంట కొనుగోళ్ల విషయంలో అధికారులు కొర్రీలు పెట్టడం సరికాదన్నారు . కౌలు రైతుల పంట కొనుగోళ్లపై ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం చూడాలని , అందుకు తగిన విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పంట కొనుగోలు సక్రమంగా చేపట్టక రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తే బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో లో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మర్రి సతీష్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు దురిశెట్టి సంపత్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బండారి గాయత్రి, బోయినపల్లి ప్రవీణ్ రావు, గడ్డం నాగరాజు, బిజెపి జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, గాజె రమేష్, జానపట్ల స్వామి, మాడుగుల ప్రవీణ్ కుమార్, వై ద రామానుజం, పిట్టల మధు నాంపల్లి శ్రీనివాస్, మడుగూరి సమ్మిరెడ్డి, ఆకుల రాజేందర్, వీరమల్ల రవీందర్, కార్పొరేటర్ అనూప్, పుప్పాల రఘు, జాడీ బాల్రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, అవుదుర్తి శ్రీనివాస్, పాదం శివరాజ్, సొల్లు అజయ్ వర్మ, నేలకొండ ప్రసన్న, సత్యనారాయణ, జీడి మల్లేష్, రాపాక ప్రవీణ్, ముత్యాల జగన్ రెడ్డి, కెంచ శేఖర్, కడారుల రతన్, మాడిశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు

also read:- పక్కింటి ఆంటీ నాకు పడేలా చూడు దేవుడా.. అమ్మవారి హుండీలో వింత లేఖలు.