Telugu News

ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం: భట్టి

ప్రభుత్వ వైఫల్యం వల్లనే ప్రజలకు ఈ సమస్యలు

0

ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం: భట్టి

== ప్రభుత్వ వైఫల్యం వల్లనే ప్రజలకు ఈ సమస్యలు

== కేసీఆర్ ప్రభుత్వం పాలనను పూర్తిగా మర్చిపోయింది

== మున్నేరు బాధితులను పరామర్శించిన సీఎల్ప నేత భట్టి విక్రమార్క

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

వాతావరణ శాఖ అధికారులు పదేపదే భారీ వర్షాలపై సూచనలు చేసినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క విమ్మర్శించారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని మున్నేరు బాధితులను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్ట నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మాటల్లోనే..   ప్రభుత్వ వైఫల్యం వల్లనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం పాలనను పూర్తిగా మర్చిపోయింది. పరిపాలనకు సంబంధించిన అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు వద్దనున్న వెంగలరావు కాలనీలోని ప్రజలు పడుతున్న భాధ నేను కళ్లారా చూసాను.

ఇది కూడా చదవండి: ప్రజల ఆశీర్వదమే పాదయాత్ర సక్సెస్: భట్టి

ఇప్పటివరకు అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేయలేదు. కనీసం ముంపు భాదితులను కలసి వారికీ భరోసా కూడా కల్పించకపోవడం అత్యంత దురదృష్టకరం. అధికార యంత్రాంగాన్ని ప్రజల కోసం పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హితవు పలికారు. అధికార యంత్రాంగాన్ని బీఆర్ఎస్ పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పని చేసేలా చూడాలని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ముంపుకు గురైన అన్ని ప్రాంతాల్లో అధికారులు పర్యటించి నష్టాన్ని అంచనా వేయడంతో వాటు.. వారికి పరిహారాన్ని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నగర కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గప్రసాద్, ఎండీ జావిద్, కాంగ్రెస్ నాయకులు పుచ్చకాయల వీరభధ్రం, రాయల నాగేశ్వరరావు, రాందాసునాయక్, దొబ్బల సౌజన్యం, వడ్డె నారాయణరావు, బాలాజీ నాయక్, బొడ్డు బొందయ్య, మొక్కా శేఖర్ గౌడ్ తదితరులు హాజరైయ్యారు.