Telugu News

జర్నలిస్టులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం: తాతామధు

టీయూడబ్ల్యూజే (టిజేఎఫ్) నగర మహాసభలో ఎమ్మెల్సీ తాతా మధు

0

జర్నలిస్టులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం
— జర్నలిస్టులతో విడదీయరానిబంధం
— సమస్యల పరిష్కారానికి కృషి
— టీయూడబ్ల్యూజే (టిజేఎఫ్) నగర మహాసభలో ఎమ్మెల్సీ తాతా మధు
— అట్టహాసంగా మూడు కమిటీల ఎన్నిక

ఖమ్మం, డిసెంబర్ 7(విజయంన్యూస్)

జర్నలిస్టులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని, జర్నలిస్టులతో కేసిఆర్ కు విడదీయరాని బంధం ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) ఖమ్మం నగర మహాసభ చిర్రా రవి అధ్యక్షతన బుధవారం టీఎన్జీవోస్ భవనంలో అట్టహాసంగా జరిగింది. ఈ సభలో ఎమ్మెల్సీ తాతా మధు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టులు గత ప్రభుత్వంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని కానీ కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులకు అనేక సంక్షేమ పథకాలు వర్తింపజేసి, 100 కోట్ల నిధులను కేటాయించారని తెలిపారు. కరోనా బారిన పడిన జర్నలిస్ట్ బాధితులకు అండగా నిలిచారని, చనిపోయిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తున్నారని అన్నారు. ప్రధానంగా ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్లు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వంటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

ఇది కూడా చదవండి: జర్నలిస్ట్ సమస్యలపై ఉద్యమిస్తా: మందకృష్ణ మాదిగ

ఈ విషయాలను రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే జర్నలిస్టులు మంచి శుభవార్త వింటారని ఆ విధంగా జర్నలిస్టులకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు నిరంతరం శ్రమిస్తున్నారని కానీ వారి జీవన స్థితిగతులు పరిశీలిస్తే బాధాకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం కేంద్రంగా జర్నలిస్టులు చేపట్టిన ఈ సభ స్ఫూర్తిదాయకంగా ఉందని, ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుందని, అందుకు తమ సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. మరో అతిధి ఆర్జెసి విద్యాసంస్థల అధినేత ఆర్జెసి కృష్ణ మాట్లాడుతూ… జర్నలిస్టులు ఈ సమాజానికి మూలస్తంభంగా ఉన్నారని, అటువంటి జర్నలిస్టుల కుటుంబ నేపథ్యం దయనీయంగా ఉందని అయినా కూడా ప్రజా సమస్యల పట్ల వారు స్పందించే తీరు అభినందనీయమని అన్నారు. ప్రధాన సమస్యలు ఇళ్ల స్థలాలు, దళిత జర్నలిస్టులకు దళిత బంధువంటి విషయంలో జిల్లా మంత్రి దృష్టికి తీసుకువెళ్లి తన వంతు సహాయం అందిస్తానన్నారు. జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ  టీజేఎఫ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సారధ్యంలో బలమైన శక్తిగా ఉందని, జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాడేది, సంక్షేమాభివృద్ధికి పాటుపడేది ఏకైక యూనియన్ తమ సంఘమేనని తెలిపారు. జర్నలిస్టు మిత్రులు ఇదే స్ఫూర్తిని, ఇదే వరవడిని కొనసాగించాలని ఈనెల 18న ఎస్ఆర్ గార్డెన్లో జరిగే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: హోంగార్డుల సేవలు అనిర్వచనీయం :పోలీస్ కమిషనర్

నగర మహాసభలో ఖమ్మం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ, నగర నూతన కమిటీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీలను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఖమ్మం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గుద్దేటి రమేష్ బాబు షేక్ జానీ పాషా, కోశాధికారిగా కొరకొప్పుల రాంబాబు, నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బాలబత్తుల రాఘవ, అమరవరపు కోటేశ్వరరావు, కోశాధికారిగా సరస్వతీభట్ల శ్రీధర్ శర్మ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా యలమందల జగదీష్, కరీష అశోక్, కోశాధికారిగా మందుల ఉపేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నేతలు సయ్యద్ ఇస్మాయిల్, వెన్న బోయిన సాంబశివరావు, బొల్లం శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రశాంత్ రెడ్డి, రజినీకాంత్, రామిశెట్టి విజేత, సంతోష్, ఉపేందర్, మందటి వెంకటరమణ, పిన్నెల్లి శ్రీనివాస్, రాజు, నాగరాజు, కె.వి, ఈశ్వరి, భాస్కర్, నాగయ్య రాజేంద్రప్రసాద్, జక్కుల వెంకటరమణ, సంతోష్, సాయి, సీనియర్ జర్నలిస్టులు ప్రసేన్, శనగపాటి మురళీకృష్ణ, ఎడమ సమ్మిరెడ్డి, టీఎన్జీవోస్ నేతలు సాగర్, నందగిరి శ్రీనివాస్, టిఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, డాక్టర్ కె.వి కృష్ణారావు, జర్నలిస్టు నేతలు టీఎస్ చక్రవర్తి, తిరుపతిరావు, కోటేశ్వరరావు, ఉత్కంఠం శ్రీనివాస్, గోపి, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.