Telugu News

కేసీఆర్ హ్యాట్రిక్ తథ్యం: నామ

కార్యకర్తలు సమరోత్సహాంతో పని చేయాలి

0
కేసీఆర్ హ్యాట్రిక్ తథ్యం: నామ

== కార్యకర్తలు సమరోత్సహాంతో పని చేయాలి

➡️ సమైక్యంగా సమన్వయంతో ముందుకు సాగాలి

➡️ వైరాలో బీఆర్ఎస్ బోణీ ఖాయం : వైరా ఎన్నికల పరిశీలకులు నల్లమల

➡️ ప్రజా క్షేత్రంలో సైనికుల్లా పని చేయాలి : మదన్ లాల్

➡️ ఆశీర్వదించండి!..అండగా ఉంటా.. : మదన్ లాల్

👉 ఏన్కూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వైరా  ఎన్నికల పరిశీలకులు నల్లమల, అభ్యర్థి మదన్ లాల్ స్పష్టీకరణ

వైరా, అక్టోబర్ 6 (విజయంన్యూస్):
 వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ గెలుపునకు పార్టీ కార్యకర్తలు సమరోత్సాహంతో సమిష్టిగా పని చేయాలని రైతు బంధు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షులు,  వైరా నియోజకవర్గ పార్టీ పరిశీలకులు నల్లమల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:- ఎన్నికలకు ముహూర్తం ఖరారైనా..?

శుక్రవారం ఖమ్మం కవిరాజ్ నగర్ లోని మదన్ లాల్ స్వగృహంలో జరిగిన పార్టీ ఏన్కూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో నల్లమల మాట్లాడారు. మదన్ లాల్ గెలుపును కాంక్షిస్తూ ఇప్పటి వరకు  వైరా, సింగరేణి, ఏన్కూరు మండలాలకు సంబంధించి బూత్ లెవల్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయిందని, మిగతా మండలాల బూత్ లెవల్ కమిటీలను ఒకటి రెండు రోజుల్లో  ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. బూత్ లెవల్ కమిటీకి  సంబంధించి ప్రతి వంద మందికి ఒకరు చొప్పున ఆరుగురికి తగ్గకుండా కమిటీ వేయడం జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి:-గ్యారంటీ…వారంటీ లేని వారి మాటలు నమ్మొద్దు:,నామ

వీరంతా సమైఖ్యoగా సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణలో ముందుకు సాగి మదన్ లాల్ విజయానికి శ్రమించాలని  పేర్కొన్నారు. ఈసారి తప్పనిసరిగా వైరాలో బీఆర్ఎస్ బోణీ చేసి, తీరుతుందని అన్నారు.  ఎన్నికైన బూత్ లెవల్ కమిటీలు గడప గడపకు తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి, ప్రజల్ని చైతన్య పర్చాలన్నారు. వందేళ్లలో సాధించలేని అద్భుత ప్రగతిని కేసీఆర్ కేవలం 9 ఏళ్లలోనే సాధించి, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా చేశారని, మళ్లీ మూడోసారి కేసీఆర్ సీఎం కావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి దూసుకుపోవాలన్నారు.  రానున్న ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించేందుకు ప్రజా క్షేత్రంలో సైనికుల్లా పని చేయాలన్నారు.వైరా అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ మాట్లాడుతూ బూత్ లెవల్ కమిటీ సభ్యులంతా నిత్యం ప్రజల మద్యే ప్రజలతోనే ఉంటూ పార్టీ గెలుపునకు శ్రమించాలన్నారు. ఎప్పటికప్పుడు తమ పనితీరును పునః పరిశీలించుకుంటూ ఎన్నికల క్షేత్రంలో ముందుకు పోవాలన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటించనున్న పార్టీ మేనిఫెస్టో అద్బుతరీతిలో ఉండబోతుందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మేనిఫెస్టో రూపకల్పన జరుగు తుందన్నారు.

ఇది కూడా చదవండి:- సకల జనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి

చేసుకున్న అభివృద్ధి కొనసాగాలన్నా, మరింత సంక్షేమం కావాలన్నా మళ్లీ మూడోసారి కేసీఆర్ సీఎం కావాల్సిందేనని అన్నారు.వైరా  నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనను ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ప్రజలు దీవిస్తే నియోజక వర్గానికి వన్నె తెచ్చే విదంగా మరింతగా  పని చేస్తానని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి శక్తియుక్తులను కూడగట్టుకొని అహర్నిశలు పని చేస్తానని, ఆశీర్వదించాలని మదన్ లాల్ కోరారు. ఎవరెన్ని మాట్లాడినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనని భారీ మెజారిటీతో ఆదరించాలని మదన్ లాల్ ప్రజల్ని కోరారు. నాయకులు, కార్యకర్తలు,బూత్ కమిటీలు పట్టుదలతో తన గెలువునకు ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైరా , సింగరేణి,ఏన్కూరు మండలాల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, బాణోత్ సురేష్ , వైరా, ఏన్కూరు సింగరేణి జెట్పీటీసీలు కనకదుర్గ, జగన్,బుజ్జీ, వైరా మున్సిపల్  వైస్ చైర్మన్ సీతారాములు, మాజీ జెట్పీటీసీ వీరేందర్, రావూరి శ్రీనివాసరావు, నర్సింగ్ శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు, మోరంపూడి ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు,మండల , గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.