Telugu News

***దేశం కోసం గర్జిస్తున్న రాజనీతిజ్ఞుడు కేసిఆర్

***పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0

***దేశం కోసం గర్జిస్తున్న రాజనీతిజ్ఞుడు కేసిఆర్
***పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
***(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్):-
రాష్ట్రాన్ని అతి స్వల్ప కాలంలోనే తెరాస అధినేత, సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అగ్రభాగాన నిలిపి దేశం కోసం గర్జిస్తున్న రాజనీతిజ్ఞుడని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వాన్ని బలపరిచేందుకు జాతీయ నేతలు ముందు వస్తున్నారని మంత్రి అజయ్ తెలిపారు.సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం లో అంగరంగవైభవంగా జరిగిన జన్మదిన వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. తెరాస శ్రేణులు పండుగ వాతావరణంలో సీఎం జన్మదిన వేడుకలు జరుపుతున్నారని వారు నిర్వహించిన పలు కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు.

also read :-కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: పొంగులేటి

సీఎం కేసీఆర్ నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని, ఆయన నాయకత్వమే దేశానికి మార్గనిర్దేశనం అని అన్నారు. ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అదే సమయంలో వ్యవసాయం పండుగ లాంటిదని ప్రజలకు తెలియజేస్తూ రైతు సంక్షేమం కొరకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. బీజేపీ పాలనలో దేశ జి.డి.పి మైనస్‌కు పడిపోతే రాష్ట్ర జి.డి.పి మాత్రం రెండు అంకెలు చేరుకుందని, అది కేవలం సీఎం కేసీఆర్ కృషి ఫలితమేనని మంత్రి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ నీచమైన భాషను మార్చుకోవాలని అని హితవు పలికారు.గుక్కెడు నీళ్ల కోసం తపించిన నాటి తెలంగాణ నేడు సీఎం కేసీఆర్ పాలనలో సమృద్ధిగా సాగు జలాలతో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు.

also read :-దేశానికే ఆదర్శం సీఎం కేసీఆర్: మంత్రి పువ్వాడ

అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధి కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తుందన్నారు. ఏడేళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలపారన్నారు. ‘నై తెలంగాణ’ అన్న నోటితోనే ‘జై తెలంగాణ’ అనిపించిన కేసీఆర్‌ రాజకీయ చాణక్యం అద్వితీయమని తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించటమే నిషేధం అన్న స్థితి నుంచి తెలంగాణ నినాదమే జీవనపథంగా మార్చిన తీరు అపూర్వమన్నారు. ఈ క్రమంలో ప్రతి సభ, మీడియా సమావేశంలోనూ బీజేపీ కుటిల నీతిని ఎండగడుతూ చేస్తున్న ప్రసంగాలు దేశ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు.

ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా సరే ఎన్ని అడ్డంకులు సృష్టించినా నమ్ముకున్న ప్రజల కోసం వెనుతిరుగని ధీరోదాత్తుడు సీఎం కేసిఆర్ అని మంత్రి అజయ్ కొనియాడారు.పరిపాలనలో దేశానికి కొత్త అభివృద్ధి నమూనా నిర్మించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని, దేశంలో ఏ రాజకీయ నాయకునికి లేని వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానం, పోరాట పటిమ, పలు భాషలపై పట్టున సీఎం కేసిఆర్ సొంతమని ఇలాంటి నేత కోసం నేడు దేశం ఎదురుచూస్తున్నదని, తెలంగాణ పాలనానుభవం పునాదిగా దేశాన్ని నడిపించటానికి కేసీఆర్‌ సమాయత్తం కావాలని యావద్భారతం కోరుతున్నదని ఆ దిశగా అడుగులు ముందుకు సాగుతాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.