Telugu News

కేసీఆర్… నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన బండి సంజయ్

0

కేసీఆర్…నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు: బండి సంజయ్

== ముస్లింలంతా ఒక్కటి కావాలంటావా?*

== హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా?*

== 20 శాతం ఓట్లు కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా?*

== హిందువులారా…. మీ సత్తా ఏందో కేసీఆర్ కు మళ్లీ రుచి చూపించండి*

== కేసీఆర్… నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా….*

== వినోద్ ఓడిపోతే… బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా?*

== నా వెనుక 80 శాతం హిందువులున్నారు….*

== బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కు బుద్ది చెప్పండి*

== కేటీఆర్ నోటి నుండి జై శ్రీరాం మాటే రాదు… *

== కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది*

== ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తవా?*

== కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు*

*కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరు*

*ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో 1400 మంది ప్రాణాలను బలిగొన్న రాక్షసుడివి నువ్వే*

*ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడివి కేసీఆరే*

*రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకునే మోసగాడు కేసీఆరే*

*ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకరిస్తున్న దగుల్బాజీ కేసీఆర్*

*తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిన చరిత్ర మోదీదే*

*కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?…. *

*చర్చకు సిద్ధమైతే… పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆధారాలు నిరూపిస్తాం*

*కేసీఆర్ తో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నం*

*ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయ్*

*ఓటుకు రూ.5 వేలు ఒకరు. రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నయ్*

*అయినా కరీంనగర్ ప్రజలంతా నావైపే ఉన్నారు..*

*సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా…*

*బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా?*

*విద్యుత్ బిల్లుల్లో, యార్న్ పై సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా?*

*రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది?*

*తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత మాది*

*కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసే బాధ్యత నాది*

*కేటీఆర్ సభలో ప్రశ్నించిన హిందుత్వ వాదుల అరెస్ట్ ను ఖండిస్తున్నా*

*కేటీఆర్… నీకు సిగ్గుంటే నీ అసలు పేరు పెట్టుకో*

*నీకు దమ్ముంటే… నీ పేరులోని రాముడి పేరును తీసేసి మాట్లాడు…*

*కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన బండి సంజయ్*

(కరీంనగర్ -విజయం న్యూస్)

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్ ను ఓడించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ చేసిన తీవ్రస్థాయిలో స్పందించారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను అవమానిస్తున్న కేసీఆర్ ను ఓడించి హిందువుల సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘‘హిందూ సమాజమంతా తన వెనుకుంది. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా… కరీంనగర్ లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు నువ్వు సిద్ధమా?’’అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘తెలంగాణకు రూ.10 లక్షల కోట్లదాకా నిధులిచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది. ఈ అంశంపై చర్చకొస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు వెల్లడించేందుకు సిద్ధం’’అని పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే మరొకరు లేరని చెప్పిన సంజయ్… ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో తెలంగాణ ఉద్యమంలో 1400 మంది బలి తీసుకున్న రాక్షసుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ అరాచకాలతోపాటు 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తుంటే.. ఆ రెండు పార్టీలు కలిసి తనను ఓడించేందుకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటుకు రూ.5 వేల చొప్పున, రూ.2 వేల చొప్పున మరొకరు ఓటర్లకు పంచుతున్నారని ఆరోపించారు. హిందువులారా… కేసీఆర్ వ్యాఖ్యలపై మీ సత్తా ఏందో చూపాలంటూ పిలుపునిచ్చారు.

ఈరోజు సిరిసల్లలోని లహరి ఫంక్షన్ హాలులో జరిగిన నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రతాప రామక్రిష్ణ, రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తోపాటు కాంగ్రెస్ నేతలపైనా నిప్పులు చెరిగారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…

*రేపటితో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి మోదీ కావాలని ప్రచారం చేశారు. దేశంలో సంక్షేమ పథకాలు ఎలా అమలవుతూన్నాయో ప్రచారంలో వివరించడం జరిగింది. మోదీ చేసిన అభివృద్ధి ఫలాలను ప్రజలకి తెలియజేసి పువ్వు గుర్తుకు ఓటేయాలని అభ్యర్ధించారు జరిగింది. బిఆర్ యస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేసే స్థితిలో లేవు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే పాదయాత్ర చేసి ఎంపిగా తీసుకొచ్చిన నిధులు, అభివృధి గురించి ప్రజలకు తెలియజేశా. బిఆర్ యస్, కాంగ్రెస్ లోపాయికరం ఒప్పందంతో డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని పన్నాగం పన్నుతున్నారు. కాంగ్రెస్, బిఆర్ ఎస్ పొలిటికల్ డ్రామా తో ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు.

సిరిసిల్ల కార్మికుల దినస్థితికి కారణం పదేళ్ల కేసిఆర్ పాలన. చేనేత కార్మికుల కు 50 శాతం విద్యుత్ రాయితీ ఇస్తామని మోసం చేసింది నువ్వా కదా కేసిఆర్. యాస, భాష తో మోసం చేసింది నువ్వా కాదా కేసిఆర్. చేనేత కార్మికులకు 270 కోట్ల బకాయిలు పడింది మీ ప్రభుత్వం కాదా కేసిఆర్. ప్రశ్నించే వ్యక్తి, అండగా ఉండే వ్యక్తి కావాలని సిరిసిల్ల ప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు పత్తా లేకుండా పోతారు. కేసిఆర్ కుటుంబం మాదిరి ఇక్కడి కాంగ్రెస్ నేతలు దోచుకొని ఉడాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్పుడే కేసిఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని గుగుల్ లో సెర్చ్ చేస్తే వచ్చే పేరు కేసిఆర్. 100 ఎలుకల తిన్నా పిల్లి మాదిరి కేసిఆర్ తెలంగాణను లూటీ చేసిండు. దేశంలో కేసిఆర్ కంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ఎవరు లేడు. 1400 మంది యువకులను బలిదానానికి కారకుడైన రాక్షసుడు కేసీఆర్.

పుల్వామ సర్జికల్ స్ట్రైక్ పై దమ్ముంటే మోగొడివి అయితే దేశ సరిహద్దులోకి వెళ్లి కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలు చేయ్. వీర జవాన్ల త్యాగాలను కూడా విస్మరిస్తున్నా వ్ అంటే కేసిఆర్ నువ్వు ఏ దేశమో చెప్పు. సిరిసిల్ల కలెక్టర్ చిన్న వాన తుంపర్లకే మునిగి పోతోంది. అవినీతికి అధిపతి కేసిఆర్. కాళేశ్వరం డిపిఆర్ గురించి విజ్ఞప్తి చేస్తే ఇవ్వకుండా జాతీయ హోదా రాకుండా కేంద్రంను బద్నాం చేసిన వ్యక్తి కేసిఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నవ్వుల పాలు అయ్యేలా చేసిన వ్యక్తి కేసిఆర్. ఫోన్ ట్యాపింగ్ పైసలను కాంగ్రెస్ కరీంనగర్ లో పంచుతుంది. అభివ్రుది పై చర్చకు సిద్ధమా.

కేసిఆర్ మూర్ఖత్వం, అరాచకం వల్ల తెలంగాణలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ, కొండగట్టు అభివృధి చేస్తామని కేంద్రం తరఫున లేఖ రాస్తే స్పందించని మూర్ఖుడు కేసిఆర్. కరీంనగర్ స్మార్ట్ సీటు నిధులపై ప్రమాణానికి సిద్ధమా కేసిఆర్. కరీంనగర్ లో ముస్లింలు అంతా ఒక్కటి కావాలని.. బండి సంజయ్ ను ఒడగోట్టాలని కేసిఆర్ పిలుపునిచ్చాడు. ఒకసారి కేసిఆర్ ఏమన్నాడో మీరు వినండి.. (కేసిఆర్ బైట్ వీడియో క్లిప్ ప్లే చేస్తూ…) కొడుకు ఏమో జై శ్రీరామ్ అనొద్దని అంటారు. తండ్రి ఏమో ముస్లింలు అంతా ఒక్కటి కావాలని అంటుండు. కరీంనగర్ అభివృద్ది పై నేను మాట్లాడుతుంటే.. కేసిఆర్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ముస్లిం మత పెద్దలతో కేసిఆర్ కుమ్మక్కేనాడు. 80 శాతం ఉన్న హిందువుల గురించి కేసిఆర్ మాట్లాడటం లేదు. కేసీఆర్ ను సవాల్ చేస్తున్నా… కరీంనగర్ లో వినోద్ రావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? కేటీఆర్ కు సిగ్గుంటే… ఆయన అసలు పేరు అజయ్ రావు అని పెట్టుకోవాలి. అద్దె పేరైన కేటీఆర్ లోని రాముడి పేరును తీసేసి మాట్లాడాలి…

హిందువుల గురించి హేళన చేస్తున్న కేసిఆర్ కు బుద్ది చెప్పాలి. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవశ్యకత ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. కేసిఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే బీజేపీని గెలిపించండి. బీఆర్ స్, కాంగ్రెస్ నేతల్లారా.. మీ పార్టీ నేతల వ్యాఖ్యలను ఒక్కసారి గమనించండి. నేను నా ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ వాదిని.అదే వాళ్లు మాట్లాడితే సెక్యులర్ వాదులు. హిందువులు తుమ్మితే మీ పార్టీ గాల్లో కొట్టుకొని పోతోంది. భైంసా లో హనుమాన్ భక్తులు కేటీఆర్ కి వ్యతిరేకంగా నిరసన చేస్తే వాళ్లను జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను చనిపోయారని కేసిఆర్ హేళన చేయడం బాధాకరం. హిందువులను హేళన చేయడం కేసిఆర్ కి పరిపాటిగా మారింది. కేసిఆర్ హిందూ సమాజానికి పక్కా క్షమాపణ చెప్పి తీరాలి. ఫామ్ హౌస్ లో పిరికి పందలెక్క పడుకుంటే.. పోలీస్ వలయాన్ని ఛేదించి చార్మినార్ భాగ్యలక్ష్మి సాక్షిగా సవాల్ చేసిన వ్యక్తిని నేను. పార్టీల జెండాలను పక్కన పెట్టండి. హిందువులంతా ఏకం కావాలి. ఓటు బ్యాంకుగా మారాలి. బీజేపీ గొడుగు కిందకు రండి.