Telugu News

తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ దే: పువ్వాడ

ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పువ్వాడ..

0

తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ దే: పువ్వాడ

== ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పువ్వాడ..

(ఖమ్మం -విజయం న్యూస్)

చిన్న చిన్న తండా లను గ్రామాలుగా మార్చి వారి గ్రామాలను వారే పాలించుకునే విధంగా వెసులుబాటు కల్పించిన ఘనత కేసీఆర్ దే అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఖమ్మం పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు  విజయాన్ని కాంక్షిస్తూ రఘునాదపాలెం మండలం చింతగుర్తి, కొర్లబోడు తండా, రాంక్య తండా, గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ప్రాంతాల్లో కూలీలను మాజి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి ఓట్లు అభ్యర్థించారు.

ఇది కూడా చదవండి:- నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు: నామ

ప్రతి గ్రామంలో గ్రామపంచాయతీ భవనాలు, హై-మాస్ట్ లైట్స్, పార్కులు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, సాగు, త్రాగునీరు, పెన్షన్ లు, రైతు బంధు ఇలా అనేక పథకాలు ఇచ్చి వారిని ఆదుకున్నామన్నారు.

రఘునాథపాలెం మండలంలో తండాలను గ్రామ పంచయతీలుగా మార్చి గ్రామాలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాలను బలోపేతం చేసింది BRS ప్రభుత్వం అని అన్నారు.

గ్రామాల్లో మల్లి ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయి, చెరువుల్లో, కుంటల్లో, ట్యాంక్ లలో నీళ్లు ఖాళీ అవుతున్నాయి.. కేసీఆర్ గారు కొంచం పక్కకు జరిగితే మళ్ళీ గ్రామాలు వెనుకబడే పరిస్థితికి వచ్చాయన్నారు.

కేసీఆర్ ఉన్నపుడు జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ వచ్చిన ఐదేళ్ళలోనే కరువు వచ్చిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదన్నారు.

రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల క్రింద పేదలకు కోట్ల రూపాయలు బాకీ ఉన్నారన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు గడచిన నాలుగేళ్లలో ప్రజలకు అందక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని పేర్కొన్నారు.

కళ్యాణ లక్ష్మి పథకం లో రూ.లక్ష తో పాటు తులం బంగారం ఇచ్చారా..? ఎవరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దాదాపు లక్ష పెళ్ళిళ్ళు అయ్యాయి అని, పేద ప్రజల ఆడబిడ్డ ఇంటికి లక్ష తులాల బంగారం బాకీ ఉందన్నారు.

ఇది కూడా చదవండి:- నా ప్రాణం ఉన్నంత వరకూ మీతోనే నేను: నామా

తులం బంగారం కాదు కదా గ్రాము ఇనుము కూడా ఇవ్వలేదు అన్నారు.

కేసీఆర్ గారు ఉన్న 9ఏళ్ళలో ప్రతి పేద ఆడబిడ్డ ఇంటికి రూ.లక్షా నూటపదహారు రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చారు అని అన్నారు.

ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పు మోసం చేసి అధికారంలోకి వచ్చారని, వచ్చిన వారు కనీసం ప్రజలకు అన్నా న్యాయం చేశారా అంటే అది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు అబద్ధాలు చెప్పడం ఎందుకన్నారు.

14సంవత్సరాలు నిర్విరామ పోరాటం చేసి సాధించిన తెలంగాణను మన కేసీఆర్ గారు ఒక్కో పని చేసుకుంటూ తెలంగాణ ను ఒక దరికి చేర్చారు అని అన్నారు.

కానీ మధ్యలో కేవలం అధికారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారం చేపట్టారు అని అన్నారు.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.. చేశారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మేడలు వంచి ఇచ్చిన హామీలు నేరవేర్చుకోవాలి అంటే మన BRS అభ్యర్ధి నామా నాగేశ్వరరావు గారికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

నామా నాగశ్వరరావు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.

BRS మండల అధ్యక్షుడు వీరునాయక్, మాజి AMC చైర్మన్ మద్దినేని వెంకటరమణ, మాజి సర్పంచ్ మెంటెం రామారావు, హమాలీ, మాజి ఎంపిపి శాంత, నాయకులు తాతా వెంకటేశ్వర్లు, తారా చంద్, సీతారాం, సురేష్, మధ్యా, పెంట్య, దేవా, మీటు నాయక్ తదితరులు ఉన్నారు.