Telugu News

కేసిఆర్ మానస పుత్రిక గృహ లక్ష్మి పథకం: మంత్రి

పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసిఆర్ ఆశయం.

0

కేసిఆర్ మానస పుత్రిక గృహ లక్ష్మి పథకం: మంత్రి

== పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసిఆర్ ఆశయం.

== గృహ లక్ష్మి పథకం పేదలకు అందిస్తున్న వరం లాంటిది.

== సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు 3లక్షల ఆర్ధిక సాయం.

== ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు.

== మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

== మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపిన మంత్రి పువ్వాడ.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రధాన ఆశయమని, గృహ లక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని, ఆ పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గృహలక్ష్మి పథకం అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ జి.ఓ విడుదల చేసిన సందర్బంగా సీఎం కేసిఆర్ కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గృహ లక్ష్మి పథకం కేసిఆర్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వరం లాంటిదన్నారు. కేసిఆర్  మానస పుత్రిక గృహ లక్ష్మి పథకమని పేర్కొన్నారు. సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు 3లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు చొప్పున మొత్తం 4లక్షల ఇండ్లు నిర్మాణానికి రూ.7,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: దేవుని పై జీవిత సత్యం చెప్పిన మంత్రి

నిత్యం పేదల సంక్షేమం కోసమే ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ కి పేదల పక్షాన మంత్రి తన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో ఎంతో మంది నిరుపేదలకు గూడు కల్పించిన చరిత్ర సీఎం కేసీఆరదని మంత్రి కొనియాడారు. డబుల్ బెడ్ రూమ్  ఇండ్లు ప్రభుత్వం ఒక్క పైసా లబ్ధిదారుడుకు ఖర్చు లేకుండా నిర్మాణం చేయించడం జరిగిందని తెలిపారు. గృహ లక్ష్మి పథకం ద్వారా ప్రజలకు, నిరుపేదలు ఎవరైనా ఎక్కడైన ఖాళీ జాగా ఉంటే వారు స్వంత ఇంటిని నిర్మాణం తమకు ఇష్టమైనట్లుగా నిర్మాణం చేసుకోవచ్చాన్నారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి కచ్చితంగా గృహ లక్ష్మి పథకం కిందా ఇంటిని మంజూరు చేస్తామన్నారు. నిరుపేదలందరు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి: అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది: మంత్రి పువ్వాడ