Telugu News

నేటి నుంచే కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు..!

లాంఛనంగా కిట్స్ పంపిణి ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ

0

నేటి నుంచే కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు..!

== కొత్తగూడెం జిల్లాలో అవసరమయ్యే 16వేల కిట్స్ ను సమకూర్చిన అధికారులు.

==  లాంఛనంగా కిట్స్ పంపిణి ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మరో అద్భుత పథకం ప్రవేశపెట్టింది. మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది.  రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లకు రూపకల్పన  చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈనెల 21 నుంచి 9 జిల్లాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.

ఇది కూడా చదవండి: సృజనాత్మకతకు అద్దం పట్టిన స్మార్ట్ కిడ్జ్ ఇన్ స్పైర్-2022

రూ. 50 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లోని గర్బిణులకు పంపిణీ చేసేందుకు సిద్దమైంది ప్రభుత్వం. గర్బిణులకు వరంగా మరో అద్భుతమైన పథకం ఇది. కామారెడ్డి నుంచి వర్చువల్గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు.  బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని ఉదయం 11.00 గంటలకు మాతా శిశు కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా కిట్స్ పంపిణి ప్రారంభించనున్నారు. అందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. జిల్లాకుఅవసరమయ్యే 16898 న్యూట్రిషన్ కిట్స్(ఏఎన్షీ)  అధికారులు సిద్దం చేశారు.

== న్యూట్రీషన్‌ కిట్లలో ఉండేవి..

  1. కిలో న్యూట్రీష‌న్ మిక్స్ పౌడ‌ర్.
  2. కిలో ఖ‌ర్జూర‌.
  3. ఐర‌న్ సిర‌ప్ 3 బాటిల్స్‌.
  4. 500 గ్రాముల నెయ్యి.
  5. ఆల్‌బెండ‌జోల్ టాబ్లెట్‌.
  6. కప్పు
  7. ప్లాస్టిక్ బాస్కెట్‌