Telugu News

కూరగాయలతో కేసీఆర్ చిత్రపటం

** అట్టహాసంగా కొనసాగుతున్న రైతుబంధు సంబురాలు

0

కూరగాయలతో కేసీఆర్ చిత్రపటం

** అట్టహాసంగా కొనసాగుతున్న రైతుబంధు సంబురాలు

** నేడు పాల్గొననున్న మంత్రులు పువ్వాడ, సింగిరెడ్డి

(ఖమ్మం-విజయం న్యూస్);-

రైతుబంధు సాయం రూ.50వేల కోట్ల మైలురాయిని దాటుతున్న నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనలతో రైతు బంధు సంబురాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఊరూరా పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి అభిమానాన్ని చాటుతున్నారు పలుచోట్ల రైతులు పొలాల వద్దనే సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేం చేసి తమకు సాయపడుతున్న సందర్భాన్ని మననం చేసుకుంటున్నారు.

also read :-వనమా రాఘవ రిమాండ్

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కూరగాయల టోకు మార్కెట్ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ డౌలే లక్ష్మిప్రసన్న – సాయికిరణ్ అధ్వర్యంలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు రకాల కూరగాయలతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని తీర్చిదిద్దారు. సోమవారం ఉదయం జరగనున్న రైతు బంధు ఉత్సవాలలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొననున్నారు.