Telugu News

కేసీఆర్ సర్కార్ కి పాలన చేతకాక పతనానికి చావు డప్పు కొట్టుకుంది.!

* పంటలపై దేశంలో ఎక్కడా లేని పంచాయతీ తెలంగాణలో ఎందుకు...?

0

కేసీఆర్ సర్కార్ కి పాలన చేతకాక పతనానికి చావు డప్పు కొట్టుకుంది.!

* పంటలపై దేశంలో ఎక్కడా లేని పంచాయతీ తెలంగాణలో ఎందుకు…?

*దేశ ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం టిఆర్ఎస్ సంస్కృతి కి నిదర్శనం..

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర…

కెసిఆర్ ప్రభుత్వానికి పాలన చేతకాక, హామీలను అమలు చేయలేక, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించి రాజకీయలబ్ధి పొందాలనుకోవడం మూర్ఖత్వమని, రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ చావుడప్పు ప్రోగ్రాంతో తన పతనానికి పునాదులు వేసుకుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర తెలిపారు. మంగళవారం కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు , దేశంలో ఏ రాష్ట్రాలలో లేని వడ్ల పంచాయితీ తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందో టిఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు .

టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల జీవితాలతోచెలగాటమాడుతోందని, స్వార్థ రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే లక్ష్యంతో పంట అంశంతో రైతులను పక్కదారి పట్టించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు . ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల కాలంలో తన వైఫల్యాలను ,అసమర్థ పరిపాలనను కప్పిపుచ్చుకోవడానికి , 8 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక, హుజురాబాద్ ఎన్నిక ఓటమి నైరాశ్యం తో , దళిత బంధు అమలు చేయలేక పాలనను గాలికి వదిలేసి , గందరగోళ పరిస్థితులు సృష్టించి బిజెపి లక్ష్యంగా విమర్శలు, రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు .

రాష్ట్రంలో ప్రజల దృష్టి మరల్చడానికి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి కెసిఆర్ పడరాని పాట్లు పడుతున్నారని , అందులో భాగంగానే ధర్నాలు శవయాత్రలు, చావు డప్పుల కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పతనానికి బీజం వేసుకున్నారని ఆయన విమర్శించారు.
కెసిఆర్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, యువత నిరుద్యోగులు ,ఉద్యోగ వర్గాల అందరూ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రాజకీయమే పరమావధిగా వ్యవహారాలు చేస్తోందన్నారు . కెసిఆర్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, పంట కొనుగోళ్ల పైన లేకుండా పోయిందని ఆయన దుయ్యబట్టారు. బిజెపిపై యుద్ధం చేయాలని, బిజెపి కార్యకర్తలపై తిరగబడండి , ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేయాలని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కెసిఆర్ ప్రకటనలు వ్యాఖ్యలు చేయడం ఆ ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ విధానానికి అద్దం పడుతోందన్నారు.

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం టిఆర్ఎస్ సర్కార్ సంస్కృతికి నిదర్శనమని, దేశభక్తులు , తెలంగాణ ప్రజలు దీన్ని ఖండించాలని ఆయన కోరారు . తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపీని ఎదుర్కోలేక , అసహనంతో పశ్చిమ బెంగాల్ సంస్కృతిని ఇక్కడ కొనసాగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, తెలంగాణ ప్రజా ఆశీస్సులతో ప్రధాని నరేంద్ర మోడీ ,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వం లో తెలంగాణ లో కాషాయ జెండా ఎగుర వేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు . అన్నం పెట్టే రైతు లతోనేకెసిఆర్ ప్రభుత్వం పెట్టుకుందని , చావు డప్పుకొట్టుకొని ప్రభుత్వ పతనానికి నాంది పలికిందని తెలిపారు.

also read ;-కేంద్రంపై సమరమే