Telugu News

కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: పొంగులేటి

*** ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

0

***కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: పొంగులేటి
*** ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
***కల్లూరు నారాయణపురంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

కల్లూరు: కేసీఆర్ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం నారాయణపురంలో నరేంద్ర యూత్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి కేసీఆర్ జన్మదిన కేకు ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

రాబోయే ఎన్నికల్లోనూ తెరాస జెండా నే ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కేసీఆర్ జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, తెరాస జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కోట రాంబాబు, డిసిసిబి డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, యన్నం కోటేశ్వరరావు, శీలం వెంకట్రామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కటికల సీతారామిరెడ్డి, ఉ మామహేశ్వరరెడ్డి, యాసా వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ కుక్కా నాగమ్మ, ఏనుగు సత్యంబాబు, సాంభశివారెడ్డి, బత్తుల రాము, మట్టూరి జనార్ధనరావు, ఉబ్బన శ్రీనివాసరావు, వైకుంఠ శ్రీనివాసరావు, రాము, నోటి కృష్ణారెడ్డి, ఉస్మాన్, తూము నర్సింహారావు, బుర్రి వీరయ్య, మాడిశెట్టి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, కే వెంకట్, ప్రహల్లాద, నల్లగట్ల పుల్లయ్య, తురాబలి, కోటయ్య, నరేంద్ర, కాస్టాల నరేంద్ర, అభిలాష్, వేమిరెడ్డి వెంకట్ రెడ్డి, మచ్చా వెంకటేశ్వరరావు, ఆళ్లకుంట నర్సింహారావు, దామళ్ల సురేష్, బండి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

also read :-*రైతు వేదికలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.,……

పరామర్శలు-ఆశీర్వదాలు

వైరా : వైరా మండలంలోని అష్ణగుర్తి గ్రామంలో గురువారం తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇటీవల వివాహం చేసుకున్న బలగాని గోపీ దంపతులను, శ్రీరామనేని ప్రశాంత్ దంపతులను, వడ్డెపూడి మౌనిక దంపతులను ఆశీర్వాదించి నూతన వస్త్రాలను బహుకరించారు. అదేవిధంగా ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిన కాట్రాల నరసింహారావు కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వెంపటి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అష్ణగుర్తి సర్పంచ్ ఇటుకల మురళీ, వార్డు మెంబర్లు గుమ్మా వెంకటేశ్వరరావు, క్రాంతికుమార్, చిత్తారు నాగమ్మ, మైబు, నాయకులు వెంపటి వెంకటేశ్వరరావు, కొండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

also read :-ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు…..

వధూవరులను ఆశీర్వదించిన పొంగులేటి

ఖమ్మం: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు గురువారం ఖమ్మం నగరంలో జరిగిన పలు వివాహా వేడుకలకు హాజరయ్యారు. ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో గుత్తి కొండ జయరామిరెడ్డి కుమార్తె వివాహానికి, టీసీవీ పంక్షన్ హాల్లో నరశింగ్ లోకేశ్వరరావు కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొర్లగూడెం పీఏ సీఎస్ చైర్మన్ కీసర వెంకటేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ నగర నాయకులు కొడాలి గోవిందరావు, తోట ప్రసాద్, దుంపల రవికుమార్, షేక్ ఇమామ్, అజ్మీరా అశోక్, నరసింహారావు, పి. సారయ్య తదితరులు పాల్గొన్నారు.

also read ;-దేశానికే ఆదర్శం సీఎం కేసీఆర్: మంత్రి పువ్వాడ

దంపతులను ఆశీర్వదించిన పొంగులేటి

జూలూరుపాడు : తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు గురువారం జూలూరుపాడు మండలంలో జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఆర్ కే ఫంక్షన్ హాల్ లో జరిగిన కాకటి నగేష్ కుమారుని వివాహ వేడుకలో పాల్గొని దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. రాగం సత్యనారాయణ కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొని పెళ్లి దంపతులను దీవించారు. పొంగులేటి వెంట లేళ్ల వెంకట్ రెడ్డి, ఎంపీపీ లావుడ్య సోనీ, ఎంపీటీసీ మధుసూధనరావు, చౌడం నర్సింహారావు, గుగులోత్ రాంబాబు, రామిశెట్టి నరేందర్, లేళ్ల గోపాల్ రెడ్డి, భుక్యా జవహర్, దుద్దుకూరి నర్సింహారావు, శిరంశెట్టి భూపతిరావు, గుంటక నర్సింహ, దేవరకొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.