కేసీఆర్ ను గద్దే దింపే.. దమ్మున్నోళ్లా..?: మంత్రి
రూ.22.77 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్ రేగ..
కేసీఆర్ ను గద్దే దింపే.. దమ్మున్నోళ్లా..?: మంత్రి
== ఏం చూసి ఎగిరిపడుతున్నారు..?
== మీరు రంకెలేస్తే.. ప్రజలే కళ్లెం వేస్తారు..
== పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మాది అనేక
== ప్రతిపక్ష నేతలపై మండిపడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
== పినపాక నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన..
== రూ.22.77 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్ రేగ..
(ఖమ్మంప్రతినిధి, మణుగూరు-విజయంన్యూస్)
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ని గద్దె దింపుతాం… బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేస్తాం అంటూ రంకెలేస్తున్న వారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చురకలంటించారు. సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దే దింపే దమ్మునోళ్లా మీరు..? రంకేలేస్తున్నారు..? ప్రజలే కళ్లెం వేస్తారని, అది గ్రహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రతిపక్ష నాయకులకు చురకలు అంటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. సోమవారం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ రెగా కాంతారావుతో కలిసి రూ.22.77 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఇది కూడా చదవండి: కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం అభివద్ది: మంత్రి
== బూర్గంపహాడ్ మండలం లక్ష్మిపురం గ్రామం నుండి టేకుల చెరువు వరకు రూ.3.87 కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.
▪️అశ్వాపురం మండలం నెల్లిపాక నుండి మణుగూరు వెళ్ళే దారిలో రూ.1.80 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
▪️అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామంలో అశ్వాపురం నుండి మొండికుంట వెళ్ళే దారిపై రూ.5 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
▪️ఆశ్వాపురం మండలం గొండిగుడెం గ్రామంలో ఇసుక వాగు మీదగా రూ.7 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
▪️మణుగూరు మండలం గట్టుమల్లారం గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న నూతన RTO కార్యాలయ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
▪️మణుగూరు పట్టణ కేంద్రంలో అంబేడ్కర్ సెంటర్ నుండి కోడిపుంజుల వాగు వరకు రూ.2.60 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణ మరియు సైడ్ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
▪️మణుగూరు పట్టణ కేంద్రంలో మణుగూరు నుండి వయా చిన్నవారిగూడెం మీదగా నెల్లిపాక వరకు రూ.2 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆశ్వాపురం మండలం గొండిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.
ఇది కూడా చదవంండి: భద్రాద్రి రామయ్య భూములను కాపాడుతాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి*
తెలంగాణ సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఅర్ ని గద్దె దింపుతామని.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొలగిస్తామని విర్రవీగుతున్న వారికి చురకలు అంటించారు. ఏం చూసుకుని ఎగిరి పడుతున్నవు… అభివృద్ది నిరొదకుడివి నీలాంటి వారికి ప్రజలే సరైన సమయంలో బుద్ది చెబుతారని హెచ్చరించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ది చేసుకోవడం పట్ల రెగాను అభినందించారు. హైద్రాబాద్ లో 24 గంటల కరెంట్ ఉంటది.. మారు మూల ప్రాంతాల్లో కూడా 24గంటల కరెంట్ ఉంటుందన్నారు.
మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి కేసీఅర్ అని, తెలంగాణ సమాజం అభివృద్ది చెందాలనే ఆకాంక్ష తో నే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కోట్ల రూపాయల్లో నిధులు మంజూరు చేస్తున్నారు అన్నారు. సమైక్య పరిపాలనలో సాధ్యం కాని చిన్న చిన్న పనులు కూడా నేడు స్వరాష్ట్రంలో సాధ్యమైంది న్నారు. మన పక్కనే ఉన్న గోదావరి వోరుసుకుంటుపోయి వేల టిఎంసి లు సముద్రంలో కలుస్తున్న తరుణంలో మన ముఖ్యమంత్రి కేసీఅర్ ముందు చూపుతో ఆయా జలాలు నిరుపయోగం కావద్దు అని తలంచి గోదావరి నీరు నేడు 30 నుండి 40 టిఎంసి లు నిత్యం ఉండే విధంగా ప్రణాళికలు చేశారని, సీతారాం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా రైతాంగానికి సాగు నీరు అందించి ఉభయ జిల్లాలను సస్యాశామలం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు.
ఇది కూడా చదవండి: అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలు – మంత్రి పువ్వాడ
విద్యుత్ ఎప్పుడూ ఉంటుందో.. ఎప్పుడూ పోతుందో తెలియని పరిస్థితుల నుండి నేడు రెప్ప పాటున కూడా విద్యుత్ పోకుండా అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 9సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్ వాడి సెంటర్ లో గర్భిణీలకు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడుతూ వారి మొహాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ది పనులు చేపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ప్రజలు నిలబడాలని కోరారు.
గత ఏడాది వచ్చిన గోదావరి వరదల సమయంలో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ప్రత్యేక చొరవ చూపిన దరిమిలా ముంపు బాధితులను ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వం అని, వారం రోజుల పాటు భద్రాచలంలో తాను స్వయంగా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సహాయ సౌకర్యాలు అందిస్తూ బాధితులకు అండగా నిలిచి వారిని కాపాడుకున్నామని స్పష్టం చేశారు. దేశాన్ని వణికించిన కరోనా క్లిష్ట సమయంలో ఎక్కడికి పోయారు మీరంతా..? ఎక్కడ దాక్కున్నారు..? ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతాల్లో దాచుకున్నారని ద్వజమెత్తారు. ఆసుపత్రిలో, కోవిడ్ బాధితులకు అండగా ఉన్నామని, వారికి మెరుగైన నాణ్యమైన వైద్యం, నిత్యావసర సరుకులు, ఆసుపత్రిలో సదుపాయాలు ఇలా అనేక సేవలు అందించింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.
ఇది కూడా చదవండి: రైతులు ఆదైర్యపడోద్దు..? ప్రతి గింజను కొంటాం: మంత్రి