Telugu News

దేశంలో కేసీఆర్ ను మించిన రైతు నాయకుడు లేడు:నామ

రైతు బిడ్డను ...రైతు కష్టాలు దగ్గరగా చూశా...

0

దేశంలో కేసీఆర్ ను మించిన రైతు నాయకుడు లేడు:నామ

🔶 కేసీఆర్ ఆదేశాలతో పార్లమెంట్ లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అడ్డుకున్నాం

🔶 వ్యవసాయానికి మీటర్లు పెట్టాలని చూస్తే తిప్పికొట్టాము

🔶 రైతు బిడ్డను …రైతు కష్టాలు దగ్గరగా చూశా…

🔶మాయ మోసపు మాటలు నమ్మొద్దు… ఆలోచించాలి

🔶 పని చేసే ప్రభుత్వానికి పట్టం గట్టాలి

👉 సత్తుపల్లి సభలో మంత్రి కేటీఆర్ తో కలసి మాట్లాడిన ఎంపీ నామ నాగేశ్వరరావు

సత్తుపల్లి, సెప్టెంబర్ 30(విజయం న్యూస్):

దేశ చరిత్ర లో కేసిఆర్ ను మించిన రైతు నాయకుడు లేడని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో శనివారం సత్తుపల్లి లో ఏర్పాటు చేసిన పెద్ద బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ తో కలసి పాల్గొని, ఎంపీ నామ మాట్లాడారు. గతంలో దేశంలో చరణ్ సింగ్, దేవిలాల్ రైతు నాయకులుగా ఉన్నారని, కానీ నేడు దేశంలో ఎక్కడా లేనన్ని రైతు పధకాలు పెట్టి, దేశంలోనే ఏకైక రైతు నాయకుడిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

ఇది కూడా చదవండి:- ఎన్టీఆర్ స్పూర్తితో కేసీఆర్ అద్భుత ప్రగతి: నామ

వందేళ్లలో జరగని అభివృద్ధి నేడు తెలంగాణా లో జరిగిందన్నారు. రైతు బిడ్డగా క్షేత్ర స్థాయిలో రైతు కష్టాలు చూశానని, అందుకే తనను మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తే ,కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అడ్డుకున్నానని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తే పోరాడి, తిప్పికొట్టిన చరిత్ర అన్నారు. రాష్ట్రంలో రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో రూ.75 వేల కోట్లు జమ చేసిన చరిత్ర బీఆర్ ఎస్ ప్రభుత్వానిది అన్నారు. గతంలో రాష్ట్రం ఎలా ఉంది.. ఇప్పుడెలా మారిపోయిందో ఆలోచించాలన్నారు. బడుగు, బలహీన, పేద వర్గాల వారికి దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంద న్నారు. ఎక్కడా ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, భారీగా పరిశ్రమల స్థాపనతో లక్షలాదిగా ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

ఇది కూడా చదవండి:- చచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ: మంత్రి కేటీఆర్

గతంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన దుస్థితి… నేడు కేసీఆర్ వల్ల 12 రాష్ట్రాల నుంచి 25 లక్షల మంది తెలంగాణాకు వలస వచ్చి, బతుకుతున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుంద న్నారు.కేసీఆర్ చలువ వల్ల సత్తుపల్లి నియోజక వర్గంలో భారీగా అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్నికలొస్తుండడంతో వచ్చి మాయమాటలు చెబుతున్నారని, వాటిని తిప్పికొట్టి, సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలని నామ నాగేశ్వరరావు కోరారు.

ఇది కూడా చదవండి:- వారంటీ లేని కాంగ్రెస్ ను తరమికొట్టాలే: కేటీఆర్

ఇంకా ఈ సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీలు బండి పార్థసారథి రెడ్డి, వద్ధిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు,పార్టీ మండల అధ్యక్షులు , కౌన్సిలర్లు, జెట్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.