Telugu News

ఎన్టీఆర్ స్పూర్తితో కేసీఆర్ అద్భుత ప్రగతి: నామ

తెలుగు ప్రజల గుండెల్లో ఎన్ఠీఆర్ స్థానం పదిలం

0

ఎన్టీఆర్ స్పూర్తితో కేసీఆర్ అద్భుత ప్రగతి: నామ

🔶 తెలుగు ప్రజల గుండెల్లో ఎన్ఠీఆర్ స్థానం పదిలం

🔶 ఖమ్మంలో ఎన్టీఆర్ పార్క్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ తో కలసి పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు 

ఖమ్మం, సెప్టెంబర్ 30(విజయం న్యూస్):

ఆనాడు ఎన్ఠీఆర్ ఎలా అయితే తెలుగు ప్రజలకు ఏవిధంగా నైతే అండగా ఉన్నారో అలాగే ఈనాడు సీఎం కేసీఆర్ కూడా తెలంగాణా ప్రజలకు అన్ని విధాలా కొండంత అండగా ఉండి అభివృద్ధి లో ముందుకు దూసుకుపోతున్నామని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్ఠీఆర్ పార్క్ ను మంత్రి కేటీఆర్ తో కలసి ఎంపీ నామ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి:- జోస్యం చెప్పిన నామ..ఏమన్నరంటే..?

ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్ఠీఆర్ స్పూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణాను బ్రహ్మoడoగా అభివృద్ధి చేశారని అన్నారు. ఆ మహనీయుని స్పూర్తితో ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేసిందని, ఇంకా చేస్తుందన్నారు. తెలుగు జాతి గుండెల్లో ఎన్ఠీఆర్ ఎప్పుడూ ఉంటారని పేర్కొన్నారు. ఆ మహనీయుని పేరును పార్క్ కు పెట్టడం సంతోషమన్నారు. యువ కిశోరం, యువ నాయకుడు కేటీఆర్ చేతుల మీదుగా పార్కు ను ప్రారంభించుకోవడం సంతోషమన్నారు. ఎన్ఠీఆర్ స్పూర్తితో అభివృద్ధి లో ముందుకుపోతున్న సీఎం కేసీఆర్ కు రానున్న ఎన్నికల్లో అండగా ఉండి, గెలిపించుకోవాలని నామ నాగేశ్వరరావు అన్నారు.

ఇది కూడా చదవండి:- నామ అంటే భరోసా !

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీలు పార్థసారధి రెడ్డి, రవిచంద్ర, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మేయర్ నీరజ, తదితరులు పాల్గొన్నారు.

👉 ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో నామ నాగేశ్వరరావు

లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్ టీఆర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు , రాజ్యసభ ఎంపీలు పార్థసారథి రెడ్డి, వద్ధిరాజు రవిచంద్ర , రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- చచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ: మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా నగరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ నామ నాగేశ్వరరావు మంత్రి కేటీఆర్ తో కలసి పాల్గొన్నారు. మున్నేరుకు ఇరు వైపులా రక్షణ గోడ, తీగల వంతెన, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు.