Telugu News

పేదల భూములపై కేసీఆర్ కన్ను పడింది: ఇందిరశోభన్.

** స్థలంలో దీక్ష చేపట్టిన రైతులు.

0

పేదల భూములపై కేసీఆర్ కన్ను పడింది: ఇందిరశోభన్
** స్థలంలో దీక్ష చేపట్టిన రైతులు
** ప్రాణాలు పోయిన దీక్షను విరమించబోమని స్పష్టం చేసిన రైతులు
** రైతుల దీక్షకు మద్దతు తెలిపిన సీనియర్ నాయకురాలు ఇందిర శోభన్
** జ్యూట్ పరిశ్రమ పేరుతో పేదల భూములను గుంజుకుంటే ఊరుకునేది లేదు
(జనగామ-విజయం న్యూస్)
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి, జనగామ, కరడ్ పల్లి, గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ భూములను జ్యూట్ పరిశ్రమ పేరుతో ఆక్రమించుకుంటున్నారు భూ రాకాసులు.. దాంతో ఆగ్రహించిన రైతులు ఆ స్థలం లోనే దీక్ష చేపట్టారు అధికారుల తీరుపై మండిపడ్డారు రైతులు ప్రాణాలు పోయినా దీక్ష విరమించేది లేదని పట్టుబట్టారు అయితే వారికి మద్దతు తెలపడానికి సీనియర్ రాజకీయ నాయకురాలు ఇంద్ర శోభన్ పర్యటించారు అనంతరం దీక్ష వద్దకు చేరుకుని వారికి మద్దతు పలికారు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు.

దళితులకు ప్రభుత్వ మూడెకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నారని రైతులు పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై సీనియర్ నాయకురాలు ఇందిర శోభన్ గారు సర్కారు తీరును ఖండించారు పూర్తి స్థాయిలో ఏడు వందల ఎకరాల భూములను ప్రేమించినందుకు ఆగ్రహించారు ఎలాంటి గ్రామసభలు నిర్వహించకుండా రైతులకు నోటీసులు పంపించకుండా ఈ అక్రమాలకు పాల్పడినందుకు అధికారులపై సీనియర్ నాయకురాలు అన్నారు దళితులకు ఇచ్చిన భూములు లాక్కోవటం పట్ల మండిపడ్డారు ఆర్టికల్ 2013 ప్రకారం రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా భూములు లాక్కోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా భూములను లే అవుట్ చేయడం అక్రమం అని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి దళితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎవరైనా మద్దతు తెలపడానికి వచ్చిన వారిపై సంపత్ గౌడ్, లింగారావు, భాస్కర్ లాంటి వారు మద్దతు పలికితే వారికి అధికార పార్టీ నేతలు పోలీసులు అండదండలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు దీనిపై కూడా అధికారులు చేస్తున్నా వైఖరిని సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ తీవ్రంగా ఖండించారు.

also read :- హై స్పీడ్ ఓవర్ లోడ్ తో వస్తున్న కంకర లారీలను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించిన సిర్పూర్ టీ గ్రామస్తుల