Telugu News

అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే కేసీఆర్ ధ్యేయం: రవిచంద్ర

కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు సముచిత ప్రాధాన్యతనిస్తున్నది

0

అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే కేసీఆర్ ధ్యేయం: రవిచంద్ర

== కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు సముచిత ప్రాధాన్యతనిస్తున్నది

== మహిళల పేరిటే పథకాలు,పట్టాల పంపిణీ

== రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ధ్యేయమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.అందులో భాగంగానే  గృహాల క్రమబద్ధీకరణ,డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, గృహలక్ష్మీ పథకానికి రూపకల్పన చేశారన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి రవిచంద్ర 58,59 జీవోల ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు, గృహలక్ష్మీ పథకం ప్రొసీడింగ్స్ అందజేశారు.ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యత లభిస్తున్నదని,వారిని దృష్టిలో పెట్టుకునే పలు సంక్షేమం,సముద్ధరణనుపెట్టుకునే పలు పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని వివరించారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో నేడు వినాయక నిమజ్జనం

గృహలక్మీ మరో మంచి పథకమని,సొంత స్థలం కలిగిన కుటుంబాలకు మహిళల పేరిట 3లక్షల రూపాయలు ఉచితంగా అందిస్తున్నామని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ప్రభుత్వాసుపత్రుల్లో కేసీఆర్ కిట్ తో పాటుగా మెరుగైన వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయని వివరించారు.కార్యక్రమంలో నగర మేయర్ నీరజ, స్థంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్ నాయకుడు శీలంశెట్టి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

==  ఎంపీ రవిచంద్ర ఖమ్మంలో పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నగరంలో సోమవారం ఉదయం పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.బొమ్మనా సెంటర్ లో స్థానిక వ్యాపారులు ఏర్పాటు చేసిన మండపాన్ని సందర్శించడానికి విచ్చేసిన సందర్భంగా టపాకాయలు కాల్చుతూ, పూలు జల్లుతూ ఎంపీ రవిచంద్రకు ఘన స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో అన్ని సీట్లు  గెలుస్తాం: మంత్రి పువ్వాడ

అక్కడ ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తన చేతులతో స్వయంగా వడ్డించారు.ఆ పక్కనే ఉన్న తన చిరకాల అభిమాని సుంకర చిరంజీవికి చెందిన శ్రీనివాస బ్యాంగిల్ స్టోరును ఆయన దర్శించారు.అటుతర్వాత బ్రాహ్మణ బజారు శివాలయం వద్ద నెలకొల్పిన బొజ్జ గణపయ్య విగ్రహాన్ని దర్శించుకుని తన కుటుంబ గోత్రనామంతో ప్రత్యేక పూజలు జరిపించి,హోమ గుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలు అందించారు.అనంతరం భారీ వర్షం కురుస్తుండగా కూడా ఎంపీ వద్దిరాజు టేకులపల్లిలో రెండు,బల్లేపల్లి,పాండురంగాపురం వినాయక నగర్ లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి కొబ్బరికాయలు కొట్టారు.