Telugu News

ఓట్ల కోసం కేసీఆర్ ది దొంగ కపట నాటకం: భట్టి విక్రమార్క

పదేళ్లలోఊసేలేని పనులు..పదిరోజుల్లో పూర్తి చేస్తరంటా..?

0

ఓట్ల కోసం కేసీఆర్ ది దొంగ కపట నాటకం: భట్టి విక్రమార్క

== పదేళ్లలోఊసేలేని పనులు..పదిరోజుల్లో పూర్తి చేస్తరంటా..?

== తెలంగాణ సంపదను కెసిఆర్ దోచుకున్నారు,దాచుకున్నారు

==  కేసీఆర్ నక్క వినయాలకు  ప్రజలు మోసపోరు

== ప్రజలంటే కేసీఆర్ కు గౌరవం ఉందా..?

== కాంగ్రెస్ పార్టీకి సీట్ల కంటే ప్రజలే ముఖ్యం

== కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు

== రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

== విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పదేళ్లలో పరిపాలన చేసిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, పది రోజుల్లోనే ప్రభుత్వ పథకాలన్నింటిని అమలు చేస్తున్నట్లుగా మాయమాటలు చెబుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు సీఎం కేసీఆర్, మంత్రి వర్గం కపట నాటకాలు అడుతున్నారని సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క విమ్మర్శించారు. ఖమ్మం జిల్లా, మధిర క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని పనులు పది రోజుల్లో చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఎన్నికలు జరగడానికి నెలరోజుల సమయం లేదు సీఎం ప్రకటించిన హామీలు ఎలా అమలు చేస్తారాని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రాబోయే ప్రభుత్వం మాదే: భట్టి విక్రమార్క

నక్క వినయాలతో మాయమాటలు చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కేసీఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు చిత్తశుద్ధితో పని చేసే సీఎం కావాలా? ఫామ్ హౌస్ లో పడుకునే సీఎం కావాలో? ప్రజలే ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. పది సంవత్సరాలుగా ఫామ్ హౌస్ లో పడుకొని రాష్ట్ర సంపదను దోచుకు తిన్న సీఎం కేసీఆర్, సమయపాలన పాటించడం సీఎం కేసీఆర్ కు తెలుసా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సీఎం క్యాంప్ ఆఫీసులో నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకునేవారని, మధ్యాహ్నం మూడు గంటల నుంచి 4 గంటల వరకు అన్ని రాజకీయ పక్షాల ఎమ్మెల్యేలను కలిసి వారి సమస్యలు వినేవారని అన్నారు. ఇందులో ఒకటైన కెసిఆర్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు.  ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ పెట్టాలన్న నిబంధన ఉన్నందున అసెంబ్లీ తూ.తూ మంత్రంగా మూడు రోజులు నడుపుతున్నారని ఆరోపించారు. సమస్యల కన్నా వాళ్ల గొప్పలు చెప్పుకోవడానికే అసెంబ్లీ నడుపుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీఎంల గురించి  కెసిఆర్ విమర్శలు చేయడం హాస్యస్పదంగా ఉందాని..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అయితే ఏంటి?   అని ప్రశ్నించారు. ప్రజలకు కావలసిన రాజీవ్  ఆరోగ్యశ్రీ, పేదలకు ఇండ్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు అవుతాయా? లేదా అన్నదే ముఖ్యం. సీఎం ఎవరైతే ఏంటనీ..? భట్టి సూటిగా ప్రశ్నించారు.  కెసిఆర్ అనవసరంగా సీఎం గోల ఎత్తుకున్నారని, అందులో పెయిలూర్ అవుతున్నారని దుయ్యబట్టారు.

ఉదాహరణకు ఒక రాష్ట్రంలో తార్ ఎడారి ఉంది, దానితో తెలంగాణను పోల్చితే ఎట్లా?  ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందన్నారు.  కృష్ణా గోదావరి నదులు ఉండి దక్కన్ పీఠభూమి కలిగిన తెలంగాణకు వనరులు ఉన్నాయన్నారు.

ఇది కూడా చదవండి: హరీష్ రావు ఇది సిద్దిపేట కాదు ఖమ్మం: భట్టి విక్రమార్క

మిగతా రాష్ట్రాలతో పోల్చితే అద్భుతమైన క్యాపిటల్ సిటీ నిర్మాణం జరిగి హైదరాబాద్ కు ఆదాయం ఉందన్నారు.  అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నెలకొల్పడం ద్వారా వచ్చే ఆదాయం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ చుట్టూ రింగ్రోడ్, సాఫ్ట్వేర్ అభివృద్ధి తదితర వనరులు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉందన్నారు. ఇక్కడి వనరులు, సంపద ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ లోతైన ఆలోచన చేసి గ్యారెంటీ హామీలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. అభివృద్ధి పేరిట అప్పులు తెచ్చిన కెసిఆర్ దోచుకున్నారు. దాచుకున్నారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరిట 50వేల కోట్ల అప్పు తెచ్చి కమిషన్లు దండుకున్నారాని, సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డులను ఎలా అమలు చేస్తారని సీఎం కేసీఆర్ అవివేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దోపిడి, కమిషన్లు లేకుండా ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలుకు నిధుల సమస్య కారణమే కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర రాబడి, ప్రజల అవసరాల కోసం బడ్జెట్ పై లోతుగా ఆలోచన చేసిన తర్వాతే ఆరు గ్యారెంటీ స్కీములు కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ హరీష్ రావులకు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ హామీల ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుపడటం సమానంగా బతకడం ఇష్టం లేదని,  కాబట్టే తప్పుడు ప్రచారం చేస్తున్నారని,  చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.

ఇది కూడా చదవండి: విజయభేరి సభలో జోస్యం చెప్పిన రాహుల్

ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన అపారమైన అనుభవం, బడ్జెట్ పై అవగాహన, ఆలోచన, మేధో సంపత్తి కలిగిన కాంగ్రెస్ నాయకత్వానికి తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలు అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తెలుసు. ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి, లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే గ్యారెంటీ కార్డులు ప్రకటన చేసామని తెలిపారు. బిఆర్ఎస్ పాలకులు ఇంటికో ఉద్యోగం,  దళిత ముఖ్యమంత్రి, కేజీ టు పీజీ, లక్ష ఎకరాలకు సాగునీరు, మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు. మీలాగా మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు హామీలను కచ్చితంగా అమలు చేస్తామని హామినిచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామని, రూ.500 కు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఎకరానికి 15వేల  రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని, మద్దతు ధరపై అదనంగా క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామినిచ్చారు. ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సాయం చేస్తామని, మీలాగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మాత్రం ప్రజలను మోసం చేయమని పేర్కొన్నారు. అద్భుతమైన సమాజ నిర్మాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ లోతైన ఆలోచన చేసి విద్యార్థులకు 5 లక్షల రూపాయల వరకు గ్యారెంటీ ఇస్తున్నామని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరని తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. యువ వికాసంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. ప్రపంచీకరణ యుగంలో ప్రపంచంతో పోటీపడే విధంగా 15 ఎకరాలకు తగ్గకుండా ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ: రాహుల్

చేయూత పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు 4000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సౌకర్యం కల్పిస్తామని, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వచ్చి ఇచ్చేటువంటి గ్యారెంటీ కార్డులను ప్రతి ఒక్కరూ ఈ కార్డును జాగ్రత్తగా మూడు నెలలు దాచుకోండాని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మీకు ఇచ్చిన గ్యారెంటీ కార్డు తీసుకొచ్చి చూపిస్తే వాటిని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ప్రకటన నోటిఫికేషన్ తర్వాత జరిగే ప్రక్రియ కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నదన్నారు. అభ్యర్థుల ఎంపిక అనేది పార్టీపరంగా నిర్ణయం ఉంటుంది వ్యక్తిగత నిర్ణయాలు కాంగ్రెస్లో ఉండవన్నారు. గెలుపు గుర్రాలు పార్టీ పట్ల నిబద్ధత సిన్సియారిటీ సీనియారిటీ తదితర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాతే అధిష్టానం అభ్యర్థుల ప్రకటన చేస్తుంది. ఇప్పటివరకు ఎవరిని అధిష్టానం అభ్యర్థులుగా ప్రకటించలేదని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీకి సీట్ల కంటే ప్రజలే ముఖ్యమని తెల్చి చెప్పారు.  భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో కలిసి పని చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదన్నారు. బీఎస్పి పార్టీతో పొత్తుల గురించి మాట్లాడగా ఆ పార్టీ అధినేత మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాట్లాడతామని రాష్ట్ర నాయకత్వం చెప్పిందన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు పదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. రాష్ట్రంలో 78 స్థానాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసి అధికారంలోకి రాబోతున్నదన్నారు.

ఇది కూడా చదవండి: నరేంద్రమోడీని ప్రశ్నిస్తే కేసులే: రాహుల్