Telugu News

కీచక ప్రిన్సిపాల్.. ఆట పేరుతో బాలికలను అక్కడ పట్టుకొని.

ఆడపిల్లలకు బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు ఆలోచించాల్సి వస్తుంది.

0

కీచక ప్రిన్సిపాల్.. ఆట పేరుతో బాలికలను అక్కడ పట్టుకొని.

– సూర్యపేట జిల్లాలో ఘటన.

– ఆడపిల్లలకు బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు ఆలోచించాల్సి వస్తుంది.

(సూర్యపేట – విజయం న్యూస్) :-

ఉన్నత భావాలు కలిగి ఉండాల్సినఉపాధ్యాయులు వ్యక్తిత్వాన్ని కోల్పోయి నీచానికి ఒడిగడుతున్నారు.  తల్లి తండ్రి గురువు దైవం అని పెద్దలు అంటారు.. తల్లితండ్రులు తర్వాత దేవుడి కన్నా ఎక్కువగా గురువును నమ్ముతారు పిల్లలు. కానీ అలాంటి గురువులే నీచానికి ఒడిగడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు విద్యార్థులను ఉన్నత స్థాయికిఎదిగేలా చేయాల్సింది పోయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక ప్రిన్సిపాల్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆటల పేరుతో ఆడపిల్లలపై లైంగికదాడికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. చింతలపాలెం మండలం ఓ ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వరిస్తున్నాడు. గతేడాదే అతనికి వివాహం కూడా అయ్యింది. కరోనా తర్వాత స్కూల్స్ ఓపెన్ కావడంతో 1 నుంచి 5వ తరగతి పిల్లలు బడికి అలవాటు పడతారని సాయంత్రం ఆటలు ఆడించడం మొదలుపెట్టారు. సాయంత్రం దాగుడు మూతలు ఆడే బాలికల వద్దకు వచ్చిన అనిల్ తాను ఆడతానని చెప్పి వారిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ వేధించాడు. బాలికలు వదలమని చెప్పినా వినకుండా లైంగిక దాడి చేశాడు. 10రోజులుగా 3, 4 తరగతుల చిన్నారులపై లైంగిక దాడి చేస్తున్నట్లు బాలికలు ఆరోపిస్తున్నారు. స్కూల్ కి వెళ్లడానికి చిన్నారులు భయపడడంతో ఏమైంది అనిఅడుగగా ఈ విషయం తెలిపారని తల్లిదండ్రులు తెలిపారు.

ప్రిన్సిపాల్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ALSO READ :- పొలాల్లోకి దూసుకెళ్లిన కారు… ఎస్ఐ భార్య మృతి.