Telugu News

కీచక రాఘవ ఎక్కడ: రేవంత్ రెడ్డి

ప్రగతి భవన్ లోనా..? ఫామ్ హౌస్ లోనా..?

0

కీచక రాఘవ ఎక్కడ: రేవంత్ రెడ్డి

** ప్రగతి భవన్ లోనా..? ఫామ్ హౌస్ లోనా..?
** పోలీసులకు అచూకి దొరకడం లేదా..?

హైదరాబాద్: ఆత్మహత్య కేసులో చిక్కుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అరెస్ట్ పై నెలకొన్న డ్రామాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కీచక రాఘవ ఎక్కడ..? ప్రగతి భవన్ లోనా… ఫామ్ హౌస్ లోనా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్ట్ చేసే పోలీసులు… మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేక పోవడం ఏమిటి ? అని నిలదీశారు. ఆ దుర్మార్గుడుని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు ? అని ప్రశ్నించారు. ఇంత దారుణ ఘటనపై టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేమిటి ..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.