Telugu News

 పాతనేరస్థులు, రౌడీషీటర్ల కార్యకలాపాలపై నిఘా వుంచండి

-వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

0

 పాతనేరస్థులు, రౌడీషీటర్ల కార్యకలాపాలపై నిఘా వుంచండి

-వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

గతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నేరాలకు పాల్పడిన పాత నేరస్థులతో పాటు, రౌడీ షీటర్ల ప్రస్తుత కార్యకలాపాలపై నిఘా పెట్టాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను అదేశించారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సెంట్రల్ జోన్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించారు.

డిసిపి, ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో సెంట్రల్ బోన్ పరిధిలో నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్ , కేసుల దర్యాప్తు , రికవరీ, కోర్టులో పెండింగ్ వున్న కేసులు వాటి స్థితి గతులపై పోలీస్ కమిషనర్ కేసుల వారీగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మత్తు పదార్థాల విక్రయాలను కట్టడి చేసేందుకుగాను ప్రతి పోలీస్ అధికారి మరింత శ్రమించాల్సి వుంటుందని. గంజాయి రహిత పోలీస్ స్టేషన్‌గా గుర్తింపు వచ్చే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి తమ పరిధిలో గంజాయి అమ్మకాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పిడియాక్ట్ క్రింద కేసులను నమోదు చేయాలని, ముఖ్యంగా గంజాయి విక్రయాలు, వినియోగించే హడ్పాటు అధికారులు గుర్తించి వాటిపై నిరంతరం నిఘా పెట్టాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. అదే విధంగా నేరాల నియంత్రణకై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజుబుల్ పోలీసింగ్ లో భాగం నిరంతరం పోలీసుల గస్తీ నిర్వహించాల్సిన అవసరం వుందని కమిషనర్ తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకై తగు ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, అధికారులు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి రోడ్డు ప్రమాదాల కట్టడికి తగు రీతిలో చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు స్టేషన్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించాలి. అలాగే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి.పెండింగ్ లో వున్న మిస్సింగ్ కేసులకు పరిష్కరించేందుకుగాను అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సి వుంటుందని..మిస్సింగ్ కేసుల్లోని వ్యక్తుల అచూకీ కనుగోని వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలని, పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించి. సంబంధిత నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, ముఖ్యంగా కేసులు దర్యాప్తు చేసే సమయంలో అధికారులు ఎస్.ఓ.పిని అనుసరించాలని. నేరస్థుల నేరాలను కోర్టులో నిరూపించే విధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టు సమర్పించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబర్చాలని, నేరాలను కట్టడి చేయడంతో పాటు నేరస్తులను గుర్తించడంలో కీలకంగా నిలుస్తున్న సిసి కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలియజేశారు.
ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా రెడ్డి, ఎసిపిలు జితేందర్ రెడ్డి, శ్రీనివాస్, గిరికుమార్, బాబురావుతో పాటు పాటు ఇన్ స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గొన్నారు.

also read ;- విద్యాసంస్థలు బంద్ అబద్దం.. వాట్సఫ్ లో వచ్చేది నమ్మోద్దు : సబిత ఇంద్రారెడ్డి