Telugu News

కిష్టాపురంలో సీసీ కెమోరాలను పునరుద్ధరణ చేయించిన సీఐ సతీష్

కూసుమంచి –విజయంన్యూస్

0

కిష్టాపురంలో సీసీ కెమోరాలను పునరుద్ధరణ చేయించిన సీఐ సతీష్
(కూసుమంచి –విజయంన్యూస్);-
కూసుమంచి మండలంలోని కిష్టాపురం గ్రామంలో సీసీ కెమోరాలను కూసుమంచి సీఐ సతీస్ పునరుద్దరించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ముదిరెడ్డి మహేందర్ రెడ్డి స్వయంగా ఏర్పాటు చేయించిన సీసీ కెమోరాలు పనిచేయడం లేదని ఇటీవలే పలు మీడియాల్లో కథనాలు రావడంతో స్పందించిన కూసుమంచి సీఐ స్వయంగా తానే గ్రామంలో పర్యటించి సీసీ కెమోరాల వివరాలను సర్పంచ్ పందిరి పద్మసత్యనారాయణరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

also read :-కిరాయి కట్టలేదని ఓ మాజీ ప్రధాని సామాన్లేనంటా..? ఆయనేవరంటే..?

ఎన్ని సీసీకెమోరాలు ఉన్నాయో తెలుసుకుని తక్షణమే హార్డ్ వైర్ ను పిలిపించి ఒక్క రోజు వ్యవధిలోనే సీసీ కెమోరాలను పూర్తి స్థాయిలో పునరుద్దరించేలా చేశారు, ప్రస్తుతం సీసీ కెమోరాలన్ని పనిచేసే విధంగా సీఐ సతీష్ రోజంతా ఆ గ్రామంలోనే ఉండి మరమ్మత్తులు చేయించారు. కాగా కూసుమంచి సీఐ సతీష్ క్రుషికి కిష్టాపురం గ్రామస్థులు అభినందించారు. ఆయన సేవలను కొనియాడారు.