Telugu News

కేశ్వాపురం సర్పంచ్ మృతి

హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

0

కేశ్వాపురం సర్పంచ్ మృతి

** హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

(కూసుమంచి-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా,కూసుమంచి మండలం కేశవాపురం గ్రామ పంచాయతీ సర్పంచి తాళ్లూరి వెంకటేశ్వర్లు(65) గురువారం మృతి చెందారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం తుది శ్వాస విడిచారు. గత రెండు రోజుల క్రితం తమ పోలం వద్దకు నీళ్ళు చూసేందుకు వెళ్ళిన వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డారు.

ఇది కూడా చదవండి:- ఉమ్మడి ఖమ్మం జిల్లా పీసీసీ మెంబర్లు వీరే..?

దీంతో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లను కుటుంబసభ్యులు ఖమ్మం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందంటంతో వైద్యులు హైదరాబాద్ కు రిపర్ చేశారు. దీంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించగా వైద్యసేవలు పొందుతున్న వెంకటేశ్వర్లు గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన కుమారుడు చేగొమ్మ సోసైటీ చైర్మన్ గా పనిచేసి, ప్రస్తుతం ఎడ్యుకేషన్ బోధనలో ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కూసుమంచి మండలం సర్పంచులు, అధికారులు, అధికార పార్టీకీ చెందిన నాయకులు సంతాపం ప్రకటించారు.

ఇది కూడా చదవండి:- ఏజెన్సీలో బినామీల దందా..?