Telugu News

ఖబర్దార్ గల్లా.. తప్పుడు ఆరోపణలు మానుకో

టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం, ఖమ్మం.

0

ఖబర్దార్ గల్లా.. తప్పుడు ఆరోపణలు మానుకో

టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం, ఖమ్మం.

(ఖమ్మం విజయం న్యూస్):-

ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేయడం తగదని టీ ఆర్ ఎస్ సోషల్ మీడియా విభాగం హితవు పలికింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఖమ్మం సమగ్రాభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన చరిత్ర బీజేపీ పార్టీది అని అందుకు ఉదాహరణ దేశంలోని ప్రముఖ పాత్రికేయురాలు స్వాతి చతుర్వేది పై బీజేపీ సోషల్ మీడియా చేసిన దాడి అని పేర్కొన్నారు.

also read :-ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

టీఆర్ఎస్ సోషల్ మీడియా గురించి విష, వికృత, విద్వేష దేశభక్తి ముసుగులో అత్యంత నీచమైన ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా ఖమ్మం చైతన్య వంతుల మదిలో నింపుతున్న బీజేపీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవాల్లో విషాన్ని నింపి వక్రీకరించి నిజాలను సమాధి చేసి అసత్యాలను సమాజంపైకి వెదజల్లుతున్న దుర్మార్గులను బీజేపీ నాయకులను అభివర్ణించారు. పలు వివాదాల్లో బీజేపీ నాయకుల తప్పు లేనప్పుడు టీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా లేవనెత్తితే గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భజాలు తడుముకున్నట్టు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు.