Telugu News

ఖద్దర్ పాలన..ఖరీదైన రాజకీయాలు.. ఖతమైన బంధాలు

పొలిటికల్ ఎనాలిసిస్ విత్ పెండ్ర అంజయ్య 

0

ఖద్దర్ పాలన..ఖరీదైన రాజకీయాలు.. ఖతమైన బంధాలు

== పొలిటికల్ ఎనాలిసిస్ విత్ పెండ్ర అంజయ్య 

నాడు రాజకీయమంటే ఏంటో సమాజానికి తెలియదు.. సామాన్య ప్రజలకు అసలే తెలియదు.. అందుకే ఎన్నికలు, పోటీ చేయడం అంటే సామాన్యులకు తెలిసి ఉండేదే కాదు.. పైసలు లేని, బియ్యం దొరకని కాలంలో పేద ప్రజలు, మధ్య తరగతి సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు..నాటు సారకు ఓట్లేసే కాలంలో పనులు లేక,పైసలు లేక..చదువులు లేక సామాన్యులు రాజకీయాలకు దూరమైయ్యారు…

ఇది కూడా చదవండి:- పాలేరు కు పొంగులేటి

        నేడు రాజకీయమంటే ఏంటో అవగాహణ వచ్చింది.. ప్రభుత్వం..పరిపాలన అంటే ఏంటో సామాన్యుడికి కూడా తెలుసు..చట్టాలు తెలుసు..చట్టాల వెనక ఉన్న లోసుగులు తెలుసు.. అంతకంటే ఎక్కువ ప్రతి మనిషికి పైసలు విలువ తెలుసు.. చేతిలో కాస్తోకూస్తో పైసలు వచ్చినయ్ పర్వాలేదు పోటీ చేయోచ్చని అనుకుంటుండగానే కాలచక్రం సమాజాన్ని మార్చేసింది.. అంతా ఖద్దర్ పాలన..ఖరీదైన రాజకీయాలుగా మారిపోయాయి. సామాన్యులు పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది.. పోటీ చేయాలంటే పైసలు ఉండాలి.. కాదు..కాదు.. కోట్లు ఉండాలి..అప్పుడే రాజకీయం చేయడం సాధ్యం..

ఇది కూడా చదవండి:- మహిళల కోసం నా సీటు త్యాగం చేస్తా: మంత్రి 

       దేశ,రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి.. సామాన్యులకు రాజకీయాలపై అవగాహణ వచ్చింది.. రాజకీయాల వైపు మళ్లే ప్రయత్నం చేస్తున్నారు.. ఫలితంగా గ్రామీణ స్థాయి నుంచి పోటీతత్వం పెరిగిపోయింది.. పైసలు లేని నాటి సమాజంలో పోటీకే దూరంగా ఉన్న పేదవారు.. పైసల నుంచి రూపాయలకు వచ్చినప్పటికి పోటీ చేసే అవకాశం పోయింది..రాజకీయాల్లోకి రావాలంటే, పోటీ చేయాలంటే ఖద్దర్ బట్టా ఉండాలే.. ఖరీదైన రాజకీయాలు చేయాలే… అలా అయితేనే నేటి రాజకీయాల్లో రాణించగలం.

    భారత దేశం వెనుదిరిగి చూస్తే జాతీయ ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం,  రైతు ఉద్యమాలు, జాతి పోరాటాలు..  ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు… ఎందరో ప్రాణాలను అర్పించి దేశసేవకులుగా మిగిలిపోయారు.. ఒక్కో ఉద్యమం నుంచి  ఒక్కో పోరాటం నుండి ఎందరో రాజకీయ నాయకులు పుట్టారు.. దేశానికి ప్రధానులు, ముఖ్యమంత్రులైయ్యారు. పూరి గుడిసెలో ఉన్న వ్యక్తి, చదువు రాని వ్యక్తి దేశానికి ప్రధానిగా అయ్యారు. పొట్టపెంజర హుస్సెనయ్య లాంటి కూలీలు కూడా ఎమ్మెల్యేలు అయ్యిన చరిత్ర ఉంది.. మానవుల మధ్య సంబందాలు ఉండేవి.. ప్రజలతో నాయకులు మర్యాదను పాటించేవారు.. ప్రజలు కూడా అంతే మర్యాదగా ఉండేవారు..  ఇదంతా గతం…

ఇది కూడా చదవండి:-;తుమ్మల “ఖమ్మం” లో పోటీ..?

ఇప్పుడు  రాజకీయాల్లో మార్పులు వచ్చాయి.. డబ్బు లేనిదే రాజకీయం సాగదు. అదే లేకపోతే నాయకుడివి కాలేవు. ఎన్నికలో పోటీ చేయాలి అంటే ముందు పైసలడుగుతున్నరు.. సమాజ సేవా చేస్తాను, పేదలకు అండగా ఉంటాను , ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలతీస్తాను ,పోరాటాలు చేసి సాధిస్తాను అనే రోజులు పోయాయి.. ఓటు వేయ్యి ఇస్తాను,రెండువేలు ఇస్తాను.. పుల్ బాటిల్ ఇస్తాను.. చికిన్ పంచుతాను, మటన్ పంచుతాను, సెల్ పోన్లు ఇప్పిస్తాను అంటేనే ఓట్లు పడే పరిస్థితి ఉంది..   ఇప్పుడు  రాజకీయాల్లో ఉన్నదంతా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ వ్యక్తులు,వ్యాపార వేత్తలు. వీరికి ఉన్నది గల ఒకటే డబ్బు. వీరి రాజకీయ అర్హత డబ్బే. డబ్బుతో ఎదైన చేయొచ్చు.. అనే దానిపైనే నేటి రాజకీయాలు వెలుగుతున్నాయి.  రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సమయంలో అభ్యర్థలను తూకం వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. ఎవరు ఎంత డబ్బు ఖర్చు పెట్టగలరు. పార్టీకి ఎంత ఇవ్వగలరు అనే బేరీజు వేసుకుని  అభ్యర్థులకు బీ ఫామ్ ఇస్తున్నాయంటే అతిశయోక్తి ఏం కాదు. పైగా చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రశ్నించాలి  అంటూ రాజకీయ నాయకుల నుండి ఉదరా గొట్టే ప్రసంగాలే తప్ప ఒక్క పార్టీ కూడా సమాజ సేవా చేస్తూ, ప్రజా సమస్యలపై పోరాడే చదువుకున్న సామాన్యుడికి తమ పార్టీ నుండి బీ పామ్ ఇవ్వాలంటే మాత్రం మనసు రావడం లేదు. ఇదే ఇప్పుడున్న పార్టీల చిత్తశుద్ధి. ఒక్క పార్టీ కాదు.. రాజకీయ పార్టీలన్ని ఇలాగే ఆలోచిస్తున్నాయి..

ఇది కూడా చదవండి:- కొందరి శిఖండి రాజకీయాలకు భయపడం: మంత్రి పువ్వాడ

        అసలు నేటి రాజకీయాలకు సేవకు అర్హత లేకుండా పోయింది.. డబ్బు మాత్రమే  అర్హత ప్రజలే తేల్చెస్తున్నారు..  డబ్బు మైకంలో పడి ఎన్నికల సమయంలో రాగానే ఏ నాయకుడు ఏ తాయిలాలిస్తాడు, ఓటుకి ఎంత డబ్బు ఇస్తాడు , దీని గురించే ఆలోచనలో వెలుగుతున్న ప్రజల్లో మార్పు రాకపోతే పరిపాలకుల స్వభావంలో మార్పు రాదు.. తద్వార నేడు కాంట్రాక్టర్లే పాలకులుగా మారిపోతున్నారు.. అసలు  ఓటర్లు ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు.. మనల్ని ఐదేళ్లు పరిపాలించే నాయకుడు నిజాయతీ పరుడు కావాలి, ప్రజలకు మేలు చేసేవారు కావాలి, పిలుస్తే పలికే వాళ్లు కావాలని ఆలోచిస్తున్నారా..?  మనం ఓటేస్తున్న వ్యక్తికి ఎంత వరకు  మన్నల్ని పాలించే అర్హత ఉందా..? లేదా..? అని ఆలోచిస్తున్నారా..? లేదు.. పైసలు ఎంత ఇస్తే అదే ఓటు..  ఇంతకంటే దురదృష్టం ఏముంటది. కోట్లకు , కోట్లు ఎన్నికలో విజయం కోసం ఖర్చు చేసిన వ్యక్తి( ఎమ్మెల్యే, ఎంపీ) గెలుపొందాకా తను ఖర్చు పెట్టిన డబ్బులను ఎలా సంపాదించాలో ఆలోచిస్తాడు.. ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఎందుకు ఆలోచిస్తారు..?   దానికోసం ఎన్నో అక్రమాలకు, అవినీతికి తెరలేపుతారు..? ఆ తరువాత అట్లా చేసిండు, ఇట్లా చేసిండని మనమే ప్రచారం చేస్తున్నాం.. కానీ నిజంగా అవినీతికి పాల్పడుతున్నదేవరు చెప్పగలరా…? అన్ని తెలిసి కూడా తన ఇంటి గురించి మాత్రమే సమయం కేటాయించిన ఓటరు ఇంత పెద్ద రాజకీయ చతురంగాన్ని అర్థం చేసుకోగలుగుతాడా..? అంటే కష్టమే.. ఒక వేళ అర్ధమైన నాకెందుకని ఓటు అమ్ముకొని మనసు చంపుకొని ఓటు వేస్తున్నాడు.  నేడు రాజకీయాలకు యువత రావాలంటే తన అర్హతను చెప్పినా పట్టించుకోవటం లేదు ఓటరు. నేను తెలంగాణ కోసం ఉద్యమం చేసిన, ప్రజా సమస్యలపై యుద్ధం చేసిన అని చెప్పిన ఎన్నికల సమయంలో డబ్బు ఇవ్వకపోతే కనీసం పట్టించుకోని పరిస్థితి కూడా కనిపించడం లేదు.. నిజమైన విద్యావేత్త, ఉద్యమకారుడు పోటీ చేసి డబ్బులు పంచకపోతే చేతకానీ వాడు ఎందుకు పోటీ చేయాలని ప్రజలే తిడుతున్న పరిస్థితి..  ఓటర్లు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి , ఓటుకి ఎంత ఇస్తారు.. నాకెంత వస్తాయి ఇదే ఆలోచన తప్ప…డబ్బులు ఇచ్చే నాయకుడు మన నుంచి ఎంత తిరిగి గుంజుతాడనే విషయాలను మాత్రం

ఇది కూడా చదవండి:- విజయభేరి సభలో జోస్యం చెప్పిన రాహుల్

 గమనించలేకపోతున్నాము.. రాజకీయ నాయకుడు.. కాదుకాదు.. కాంట్రాక్టర్ పోటీ చేసి ప్రజలకు పెట్టే ప్రతిపైసాకు పది రూపాయలు వసూళ్లు చేసే పరిస్థితి నేడు కనిపిస్తోంది..   గెలుపు కోసం రాజకీయ నాయకుడు పంచిన ప్రతి రూపాయి మననుండే ఏదో రూపంలో వసూలు చేస్తాడు. అలాగే నాయకుడీ దగ్గరికి వెళ్లి ప్రశ్నించే అర్హత కూడా కోల్పోతాము.

 చివరిగా ఒక మాట

 ఓటు నిజమైన సేవకుడికి వేసినప్పుడే మీ ఓటుకి విలువ.. మనల్ని పాలించే వారికి నిజాయతీగా డబ్బులు తీసుకోకుండా ఓటు వేసినప్పుడే మీ ఓటుకు విలు.. డబ్బులిచ్చేందుకు వస్తే తిట్టి వెనక్కి తిరిగి పంపించినప్పుడే మీ ఓటుకు అసలైన విలువ.. ఓటర్ మహాశయులారా..? మనం మారుదాం.. సమాజాన్ని మారుద్దాం.. మార్పు అందరితో కాదు.. ఒక్కరితోనే సాధ్యమవుతుంది.. పైసలు లేకుండా ఓటు వేసి తన ఓటు హక్కువిలువను కాపాడు.. ఖద్దరు పాలనకు..ఖరీదైన రాజకీయాలకు పుల్ స్టాఫ్ పెడదాం.. సామాన్యుడిని నాయకుడ్ని చేద్దాం..

పెండ్ర అంజయ్య

సీనియర్ జర్నలిస్ట్

9912963565