ఆ ఇద్దరికి నో చాన్స్..?
== పదవి రేసులో లేని జిల్లా నేతలు..?
== ఖమ్మం జిల్లాకు మొండిచెయ్యి తప్పదా..?
== మరీ జిల్లాకు దక్కేనా… ఆ పదవి..?
ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ ఆగ్రస్థానంలో నిలుస్తుందని అంటే అది ఆ నేతలకే సాధ్యం.. ప్రజా ఆకర్షణ కల్గిన, ప్రజాభిమానం కల్గిన ఆ నలుగురు నేతల్లో ఇద్దరు నేతల అధికారిక పదవిలో ఉంటే.. మరో ఇద్దరు నేతలు ఏం పదవిలేకుండానే ఖాళీగా ఉన్నారు.. చెప్పుకోడానికి చాటడంతా చిట్టా ఉన్న.. ప్రస్తుతం మాత్రం వారు చాలా సామాన్యులే. పార్టీలో ఎలాంటి పదవి లేకపోగా, ప్రభుత్వంలో కూడా ఎలాంటి పదవిలేదు. కానీ వారీద్దరు మాత్రం జిల్లాను నడిపించే సమర్థులే. ఏ నాయకుడ్ని కదిలించిన సగం ఉమ్మడి జిల్లా వారి వెంట నడిచే అంత బలమున్న నాయకులు వారు.. అలాంటి నాయకులకు ప్రభుత్వంలో ప్రతి సారీ అవమానమే జరుగుతోంది.. గడిచిన మూడేళ్ల నుంచి మంత్రి పదవి ఊరిస్తున్నప్పటికి, కనీసం ఎమ్మెల్సీ రేసులో కూడా లేకపోవడం గమనర్హం. అయితే ప్రస్తుతం మరో పదవి ఆ ఇద్దర్ని ఊరిస్తోంది.. ఆపదవికి కచ్చితంగా వారిద్దరు సమర్థులే అయినప్పటికి ఆ పదవి వస్తుందా..? రాదా..? అనే సందేహాలేన్నో..? అసలు వారు రేసులో ఉన్నారా..? లేరా..? అనే ప్రశ్నలేన్నో..? కానీ ఆ పదవి వరించే రేసులో మాత్రం ఆ ఇద్దరు నేతలు లేరనే తెలుస్తోంది..? జిల్లాను నడిపించే సమర్థతున్న ఆ ఇద్దరు నాయకుల్లో ఏ ఒక్కరికి పదవి ఇచ్చిన పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని అధినేత భావిస్తున్నట్లు కనిపిస్తోంది.. అంతేకాదు ఆ పదవి విషయంలో ఆ ఇద్దరు నేతలు మక్కువ చూపడం లేదని విశ్వసనీయసమాచారం.. కాగా ఆ పదవి సినిగ్లామర్ సందడిలో మునిగిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది..? మరీ అధికార పదవి రేసులో ఖమ్మం జిల్లాకు అన్యాయం జరిగినట్లేనా..? ఆ ఇద్దరిలో ఒకర్ని ఆ పదవి వరిస్తుందా..? మరీ ఎవరా..?వీరుడు..విజయం సాధించే నాయకుడేవ్వరు..? ‘విజయం’ ప్రతినిధి అందిస్తున్న రాజకీయ విశ్లేషణాత్మక కథనం.. మీకోసం..
allso read- పిట్ట కొంచెం…. కూత ఘనం..,
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి 14ఏళ్ల పోరాట అనంతరం అనుకున్న ఫలితాన్ని సాధించింది.. ఉమ్మడి 10 జిల్లాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది.. 2014లో అత్యధిక సీట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికి ఎక్కడో ఒక లోపం కనిపిస్తూ ఉండేది. పది జిల్లాల్లోని 8 జిల్లాలో వన్ సైడ్ సీట్లు సాధించిన టీఆర్ఎస్ ఖమ్మం, నల్గొండ జిల్లాలో మాత్రం అనుకున్నంత స్థాయిలో టీఆర్ఎస్ కు సీట్లు రాలేదు. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకుని తెలంగాణ రాష్ట్ర సమితికి ఖమ్మం మైనస్ గా మారింది. దీంతో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాను కూడా టీఆర్ఎస్ మయం చేయాలని భావించారు. ఈ మేరకు తొలి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఓటమి పాలైన సీఎం కేసీఆర్ మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి పదవిని కూడా ఇచ్చారు. తరువాత జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చి రెండు సీట్లుగా మార్చుకున్నారు. ఆ తరువాత తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ చాణుక్యంతో ఖమ్మం జిల్లాను టీఆర్ఎస్ జిల్లాగా మార్చేశాడు. ఏ ఎన్నికలు వచ్చిన టీఆర్ఎస్ గెలుస్తూ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లానే సీట్లు సాధించే విషయంలో ఆగ్రస్థానంగా మారిపోయింది. ఆ స్థాయిలో తుమ్మల నాగేశ్వరరావును బలోపేతం చేశారు. అంతటి నాయకత్వ బలం ఉన్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. అలాగే స్వంతంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉమ్మడిఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ,ఒక ఎంపీ స్థానాన్ని గెలిపించుకున్న సత్తా కల్గిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన కాలక్రమేనా టీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆతరువాత ప్రజాబలం పెంచుకోవడం జరిగింది. ఈ ఇద్దరు నేతలు ఇప్పడు ఖమ్మం జిల్లాలోనే రాజకీయ సంచలన నేతలుగా మారారు. అత్యధిక జన బలం ఉన్న నేతలు ఈ ఇద్దరు.
Allso read-ప్రకాష్ రాజ్ కు సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్
అయితే 2018 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి పై ఓటమి చెందగా, 2019 ఎన్నికల్లో పార్లమెంట్ సిట్టింగ్ స్థానాన్ని పొంగులేటి కోల్పోవడం, టీడీపీ పార్టీకి చెందిన నామా నాగేశ్వరరావును పోటీ చేయించి గెలిపించి పార్లమెంటరీ పార్టీనేతగా చేయడం చకచక జరిగిపోయాయి. అయితే మంత్రివర్గంలో మరోసారి స్థానం దక్కుతుందని తుమ్మల నాగేశ్వరరావు భావించగా, నాకు మంత్రివర్గంలో కచ్చితంగా అవకాశం ఉంటుందని పొంగులేటి భావించారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ఏ ఎన్నికలు వచ్చిన టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు.
== అడుగడుగున అవమానాలే
రాష్ట్రంలోనే అత్యధిక నాయకత్వబలమున్న, అభిమాన బలమున్న నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వారిద్దరిలో ఏ ఒక్కరు పార్టీని వీడిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ పటాపంచల్ కావడం ఖాయం. అంతటి బలమున్న నాయకులు గత రెండేళ్ల నుంచి అడుగడుగున అవమానాలే ఎదుర్కుంటున్నారు. స్వంత నియోజకవర్గంలో నేతల మధ్య ఫైటింగ్, వర్గపోరు, వారి వర్గాలకు చెందిన నేతలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు కేసులు పెట్టడం, వారి ప్లెక్సిలను అధికారులతో చెప్పి తొలగించడం, వాళ్లను నమ్మిన కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి జైళ్లకు పంపించడంలాంటి పనులు చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ పథకాల ప్రారంభం, పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి లేదంటా..? ఇక పదవుల విషయంలో వారిద్దరు చాలా అవమానాలే ఎదుర్కున్నారంటే నమ్మాల్సిందే. నామినేటేడ్ ఎమ్మెల్సీ, నామినేటేడ్ రాజ్యసభ స్థానాలకు అవకాశం కల్పిస్తారేమోనని ఆ నేతలు భావించారు. కానీ వారి ఇద్దరికి ఇవ్వకుండా వేరే వారికి అవకాశం కల్పించారు. స్థానిక సంస్థలు, గ్రాడియోట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక వారికి సంబంధం లేకుండా ఎన్నిక జరిగిందని తెలుస్తోంది. ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ వారికి సమప్రాథాన్యత లేదు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసే ప్లేక్సిల్లో వారిద్దరి పోటోలు లేకుండా అవమానించిన పరిస్థితి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
== రాజ్యసభ వరించేనా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గుండెకాయలైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో అనేక పదవులను ఆశించినప్పటికి ఏ ఒక్క పదవి వారి చెంతకు రాలేదు. అంతేకాకుండా అవమానాలు ఎదురైయ్యాయి. అయితే ప్రస్తుతం మరో పదవి రేసులోకివచ్చింది. రాజ్యసభ ఉప ఎన్నిక అతి త్వరలోనే జరగబోతుంది. ఆ రాజ్యసభకు ఈ ఇద్దరు నేతల పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ విషయంపై అనేక కథనాలు మీడియాలో, పత్రికల్లో ప్రచురితమవుతూనే ఉన్నాయి.. ఎవరికో ఒకరికి కచ్చితంగా రాజ్యసభ పదవి వస్తుందని తుమ్మల వర్గీయులు, పొంగులేటి వర్గీయులు, అభిమానులు భావిస్తున్నారు. నాయకులు, వారి వర్గీయులు కూడా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ దాడుల ఫలితంగా మా నేతకు రాజ్యసభ వస్తే బాగుండు, ప్రోటోకాల్ కు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఇదే విషయం రాజకీయ విశ్లేషకులు కూడా బల్లా గుద్దినట్లుగా చెబుతున్నారు. రాజ్యసభ స్థానం ఖమ్మం జిల్లాకే దక్కుతుందని విశ్లేషిస్తున్నారు. కానీ ‘విజయం’ తెలుగు పత్రిక ప్రతినిధి బృదం సర్వే చేసింది. వారు అందించే రాజకీయ విశ్లేషణలో మాత్రం అందుకు బిన్నంగా కనిపిస్తోంది. రాజ్యసభ పదవి రేసులో ఖమ్మం జిల్లాకు అన్యాయం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు రాజ్యసభ రేసులో లేరని విశ్వసనీయ సమాచారం. రాజ్యసభ స్థానం ఒక్కటే ఉండటం, ఖమ్మం జిల్లాలో ఇద్దరు బలమైన నేతలు ఉండటంతో ఏ ఒక్కరికి పదవి ఇచ్చిన మరోకరు పార్టీని డిస్టబ్ చేసే అవకాశం ఉందని, అందుకే కొంత సమయం తీసుకుంటేనే బెటర్ అనే అప్షన్ ను సీఎం కేసీఆర్ ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయ విశ్లేషకులు కొందరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజ్యసభ స్థానం కోసం ఆ ఇద్దరు నేతలు ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. రెండేళ్ల సమయం పాటు ఉన్న ఈ పదవి అవసరం లేదని, ఐదేళ్ల పాటు ఉండే ప్రజల ఆశీస్సులతో, వారేసే వచ్చే ఓట్లతో గెలిచే పదవికావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నిలబెట్టుకోవాలనే నినాదాన్ని నమ్మిన తుమ్మల నాగేశ్వరరావు రాజ్యసభకు మక్కువ చూపడం లేదని తెలుస్తోంది. అలాగే మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి గెలిచి రావాలనే తపనతో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని ప్రకటించిన నిరాకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాజ్యసభ స్థానం విషయంలో ఈ ఇద్దరు నేతలకు వచ్చే అవకాశం లేకపోవచ్చు.దీంతో పదవి ఇచ్చే విషయంలో ఈ ఇద్దరికి అలాగే ఖమ్మం జిల్లాకు మొండిచెయ్యి తప్పదేమో..?
== రాజ్యసభ సినిగ్లామర్ వైపు…?
రాజ్యసభ ఉప ఎన్నిక అతిత్వరలో జరిగే అవకాశం ఉంది. ఈ స్థానానికి పోటీ పడే అంత ఓటింగ్ టీఆర్ఎస్ పార్టీకే ఉంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. అందుకే రాజ్యసభ పదవిపై రాష్ట్ర వ్యాప్తంగా అధికారపార్టీకి చెందిన నేతలు కన్నేస్తున్నారు. ఆ పదవిని దక్కించుకోవాలని ఆశపడుతున్నారు. అయితే ఈ రేసులో ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాజ్యసభ స్థానం కచ్చితంగా సినిగ్లామర్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. జాతీయ రాజకీయాలపై మక్కువ చూపుతున్న సీఎం కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో నాయకత్వ పటిమ, పరిషయాలు ఉండే నాయకుడ్ని పక్కన పెట్టుకుంటే రాబోయే జాతీయ రాజకీయ ముందడుగుకు ఉపయోగపడతారనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సినిగ్లామర్ ఓటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజ్యసభ స్థానాన్ని జాతీయ రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్న సినినటుడు ప్రకాష్ రాజ్ కు అవకాశం కల్పిస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కచ్చితంగా ప్రకాష్ రాజ్ కే రాజ్యసభ దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తున్నారు. అలాగే సినిమా వాళ్లకు ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు.
గతంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానానికి ఒక సినినటుడ్ని ప్రతిపాదించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కు పదవి ఇచ్చి ఆలోటును పూడ్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒక్క తూటాకు రెండు పిట్టలు అన్నచందంగా ప్రకాష్ రాజ్ కు రాజ్యసభ పదవి ఇవ్వడం వల్ల సినిమావాళ్లను అకట్టుకోవడంతో పాటు జాతీయ రాజకీయాల్లోకి ప్రకాష్ రాజును వాడుకునే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనతో తిరగాలంటే కచ్చితంగా ప్రోటోకాల్ అవసరమయ్యే అవకాశం ఉంది. అందుకే అన్ని రాష్ట్రాల్లో పర్యటించాలంటే కచ్చితంగా రాజ్యసభ సభ్యుడైతే బాగుంటుందనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం.. రాబోయే రోజుల్లో రాజ్యసభ స్థానం ఎవరికి దక్కుతుందో..? సీఎం కేసీఆర్ ఆలోచనలో ఏ నాయకుడు ఉన్నాడో..? ఆ వరం ఎవరిని వరిస్తుందో..? వేచి చూడాల్సిందే.