Telugu News

పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణి.

ఖమ్మం విజయం న్యూస్

0

పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణి.

(ఖమ్మం విజయం న్యూస్ ):-

పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా, పువ్వాడ ఫౌండేషన్ సమకూర్చిన సేమియా కిట్స్ ను నగరంలోని 18, 41, 32, 47, 38, డివిజన్లలోని మసీద్ల నందు పేద ముస్లింలకు ఆయా డివిజన్ కార్పొరేటర్ అధ్వర్యంలో పంపిణి చేశారు.

also read :-మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్….

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు పంపిణి కార్యక్రమాన్ని నగర మేయర్ పునుకొల్లు నీరజ  సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్  మంత్రి వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల రవికిరణ్  స్ధానిక కార్పొరేటర్లు కలిసి పేద ప్రజలకు రంజాన్ తోఫా, సెమియా కిట్స్ ను అందజేశారు.ముస్లిం సోదర, సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రత్యేకంగా రంజాన్ సేమియా ప్యాకెట్ కిట్స్ లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్(KMC), కార్పొరేటర్ కర్నాటి కృష్ణా, కార్పొరేటర్లు మందడపు లక్ష్మి మనోహర్, డోన్వన్ సరస్వతి, మాటేటి అరుణ నాగేశ్వరరావు, షౌకత్ఆలీ, దండా జ్యోతి రెడ్డి, మరియు పలు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.