Telugu News

పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించిన వీఆర్ఏలు

మల్లెపల్లిలో తమ్మినేని ని కలిసి వినతిపత్రం సమర్పణ

0

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించిన వీఆర్ఏలు

⭐ మల్లెపల్లిలో తమ్మినేని ని కలిసి వినతిపత్రం సమర్పణ

కూసుమంచి, సెప్టెంబర్ 4(విజయంన్యూస్)

పాలేరు  నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచిలో వీఆర్ఏలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేశారు. నియోజకవర్గ నాలుగు మండలాల నుంచి వీఆర్ఏలు హాజరై ఎమ్మెల్యే  క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దాదాపు గంటపాటు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే ఆఫీస్ సిబ్బందికి వినతి పత్రం అందించారు. కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్ఏల సమస్యలను ప్రస్తావించి పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు. అంతకుముందు కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామానికి విచ్చేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంని కలిసి సీఎంతో తమ సమస్యల గురించి చర్చించి వినతిపత్రం ఇచ్చినందుకు ధన్యవాదములు తెలిపారు.

allso read- తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

భవిష్యత్తులో వీఆర్ఏలు చేయబోయే ప్రత్యక్ష పోరాటాలకు మద్దతు ఇవ్వవలసిందిగా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని గారు మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన సమస్యలపై సిఎం గారితో మాట్లాడానని త్వరలోనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారని తెలియజేశారు. సమ్మె 42 రోజులకు చేరినా ప్రభుత్వం స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై హన్మకొండ జిల్లాలో గుండెపోటుతో మరణించిన  వీఆర్ఏ వీరస్వామి,కామారెడ్డి జిల్లాల్లో నిన్న ఆత్మహత్య చేసుకొని మరణించిన వీఆర్ఏల అశోక్ లకు సంతాపంగా కూసుమంచి సమ్మె శిబిరం వద్ద మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ షేక్ అజీజ్ మాట్లాడుతూ.. నిన్న జరిగిన క్యాబినెట్లో మాకు సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించి భంగపడ్డామని తెలిపారు. రేపు రాష్ట్ర జేఏసీ సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తుందని, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు ఉంటాయని, అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు. న్యాయమైన డిమాండ్లైన పే స్కేల్,అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల అధ్యక్షులు దారా శ్రీనివాసరావు, తిరుమలయపాలెం మండల అధ్యక్షులు మెంటం శ్రీను, నేలకొండపల్లి మండల అధ్యక్షులు పసుపులేటి సైదులు, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు చాంద్ మియా మరియు నాలుగు మండలాల నుంచి సుమారు 100 మంది వీఆర్ఏలు పాల్గొన్నారు.

allso read- బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం: తమ్మినేని