Telugu News

 ఖమ్మాని వదిలి పెట్టేది లేదు: మంత్రి పువ్వాడ

అభివృద్ధిని కూడా చివరిదాకా తీసుకపోతాం.

0

 ఖమ్మాని వదిలి పెట్టేది లేదు: మంత్రి పువ్వాడ

== అభివృద్ధిని కూడా చివరిదాకా తీసుకపోతాం.

== ఖమ్మం అభివృద్ధి లో ఐకానిక్

== ఖమ్మం నగరంలో ఇంకా మట్టి రోడ్డు అనేది కనపడదు

== ఖమ్మం ని ఒక మిలియన్ సిటీగా తయారు చేయాలి

== మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంమే వస్తాది

== ఆత్మీయ సమ్మేళనంలో  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం పూర్తి స్థాయిలో అభివృద్ధి అయ్యే వరకు ఖమ్మాన్ని అసలు వదిలేది లేదని, ఖమ్మం అభివృద్ధిని కూడా చివరిదాకా తీసుకపోతామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని అత్మీయ సమ్మెళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఏదో ఒక నెలలో వస్తారు కచ్చితంగా వచ్చిన ప్రతిసారి కనీసం ఒక 1000 కోట్ల రూపాయలు అభివృద్ధికి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన జరుగుతాయని అన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ సర్కార్ లోనే ‘పాలెం’ సమగ్రాభివృద్ధి: మంత్రి

ఈనెల 30న మంత్రి కేటీఆర్  ఖమ్మం పర్యటన ఉందని తెలిపారు. మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంమే వస్తుందని, మళ్ళీ కేటీఆర్ ఖమ్మం వస్తూనే ఉంటాడు, నేను ఇక్కడే ఉంటానని, ఈ ఖమ్మాని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.  అభివృద్ధిని కూడా చివరిదాకా తీసుకపోతానని అన్నారు.  రేపు వచ్చేటప్పుడు కూడా దాదాపు 1300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపకులు ఖమ్మం నగరంలో చేయడానికి మన కేటి రామారావు వస్తున్నారని ప్రకటించారు.  కవిరాజు నగర్ ఎదురుగా ఐటీ హబ్ వచ్చిందని, ఇక్కడ ఆ రోజున ఒక పాతబడిన కాడ బిల్లింగ్ ఉండేదని, కేటీఆర్ కి ఐటీ హబ్ ఈ సెంటర్లో ఇక్కడ పెడితే బాగుంటుంది ఇక్కడ రావటం వల్ల ఒక ఐకానిక్ బిల్డింగ్ వస్తాది మనకు డెవలప్మెంట్  సూటిగా కనపడుతుందని నా ఆలోచనను చేపానని అన్నారు.  కానీ మహానుభావులు ఆరోజు సరే ఈరోజు మాతో లేరు కానీ ఆ రోజు ఈఐటీ హబ్ ఇక్కడ రాకూడదని ఎట్లనైనా సరే బయటికి తీసుకుపోవాలని, లేకపోతే ఆపాలని చెప్పి విశ్వప్రయత్నం చేశారని మాజీ మంత్రిపై ఆరోపణలు చేశారు.  మీ ఎదురుగా కనపడే సర్దార్ పటేల్ స్టేడియం ఒకప్పుడు మా నాన్నపువ్వాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగిందని,  ఇవాళ నాకు దానిని మరింత అభివృద్ధి చేసే అవకాశం దక్కిందన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో అన్ని సీట్లు  గెలుస్తాం: మంత్రి పువ్వాడ

ఇక్కడ ఉన్న క్రీడా సౌకర్యాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతావున్నారని అన్నారు. అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా ఖమ్మం అభివృద్ధి లో ఒక ఐకానిక్ గా తయారు చేశామని ధీమా వ్యక్తం చేశారు.  మంత్రిగా నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు తీసుకున్న సందర్భంగా వట్టి చేత్తో ఎల్లోద్దని చెప్పి 100 కోట్ల రూపాయలు నిధుల్ని మళ్ళీ ఖమ్మం కార్పొరేషన్ కు ఇచ్చారని, ఆయన రుణం తీర్చలేనిదన్నారు.  ఖమ్మం నగరంలో ఇంకా మట్టి రోడ్డు అనేది కనపడదు, మట్టి రోడ్డు గాని కాలువలు లేని ప్రాంతం కానీ కనబడకుండా చేస్తామని, దానితో పాటుగా ఇప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తరిస్తామని అన్నారు.  నిత్యజీవనంలో ఎప్పుడో ఒకసారైనా బస్టాండ్ కు  వెళ్లుతాం.. గతంలో ఈ రెండు సంవత్సరాలలో మీ మధ్యలో బస్టాండ్ ఎట్లుంది అంత ముందు బస్టాండ్ ఎట్లుండే ఒకసారి మీరు ఆలోచించాలని ప్రజలను కోరారు.  పేదవాళ్ళు నివసించే ప్రాంతాలు కూడా ఇప్పుడు అద్భుతంగా తయారు చేశారని, ఒక గొప్ప వాళ్ళు లేక మధ్యతరగతి ఫ్యామిలీస్ నివసించే ప్రాంతాలను కాదు పేదల నివసించే ప్రాంతాలను కూడా ఆత్మగౌరవంతో జీవించే విధంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలను దాదాపుగా ఈ నగరంలో ఐదు వేల మందికి ఇచ్చామని,  పేదవాళ్ళు నివసించే ప్రభుత్వ స్థలాన్ని వారు ఎక్కడ ఉంటే అక్కడ జీవో 58, 59 క్రింద రెగ్యులర్స్ చేశామన్నారు.  3000 మందికి ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద ఇల్లు ఇస్తున్నామని, ఇంకో 1000 మందికి కూడా ఇస్తామని అన్నారు.  నేను ఇక్కడ పుట్టిన ఇక్కడే పెరిగిన ఇక్కడే చదువుకున్న ఈ ఊరు గురించి నాకు తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు మా నాన్నకూడా ప్రాతినిధ్యం వహించారు.

ఇది కూడా చదవండి: సాదు కుంటారో.. సంపుకుంటారా: మంత్రి పువ్వాడ

ఇక్కడ ప్రజలతోని అవినాభావ సంబంధం నాకు ఉందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఈరోజు పెద్దలు మిత్రులు వచ్చారు. చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. నాకు ఈ ఖమ్మం కు  ఒక రిలేషన్షిప్ ఉంది‌. కాబట్టి నాకు నా మీద ఎక్కువ బాధ్యత ఉందనే ఉద్దేశంతోనే నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసి ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఇంకో పక్కన అవినీతి రహితంగా పరిపాలన అందిస్తున్నాము. ఇవాళ మా మేయర్ గాని లేదా మా పాలకవర్గంగాని ఎక్కడ ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా నిజాయితీగా పనిచేస్తున్నారని, వారిని అభినందిస్తున్నామని తెలిపారు.  మీలో ఉన్న ఎక్కువ మంది కోరుకునేంది ఏందంటే ఒక క్లీన్ పరిపాలన కావాలి ఒక గవర్నమెంట్ కావాలి మంచిగా అభివృద్ధి దూసుకుపోయేటట్లు ఉండాలి అది నేను తప్పకుండా ఆ రకంగా ప్రయాణం చేస్తా.. రాబోయే రోజుల్లో కూడా అట్లనే ఉంటాం అట్లనే ఖమ్మాని ముందుకు తీసుకుపోతామన్నారు. ఖమ్మం ని ఒక మిలియన్ సిటీగా తయారు చేయాలి మిలియం సిటీ అంటే మిలియన్ పాపులేషన్ 10 లక్షలు పాపులేషన్ అయితది ఇప్పటికే నాలుగు లక్షలు దాటిపోయింది. రాబోయే రోజుల్లో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక కాంప్రహెన్సీగా అన్ని వైపులా డెవలప్మెంట్  చేస్తున్నామన్నారు. ఖమ్మంలో ఒక ప్రణాళిక బద్ధంగా తెచ్చిన నిధులు ఖర్చు పెడతున్నామని,  మీరు ఊహించిన విధంగా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇంతకన్నా డబుల్ అభివృద్ధిని చేస్తానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు హాజరైయ్యారు.

ఇది కూడా చదవండి: అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే కేసీఆర్ ధ్యేయం: రవిచంద్ర