Telugu News

పొద్దుపొద్దుగలే గ్రౌండ్లో మంత్రులు

సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు హరీష్ రావు, పువ్వాడ.

0

పొద్దుపొద్దుగలే గ్రౌండ్లో మంత్రులు

** సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు హరీష్ రావు, పువ్వాడ.

** సమీకృత కలెక్టరేట్ నిర్మాణ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.

** నూతన సమీకృత కలెక్టరేట్ పక్కనే అనువైన స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహణ.

** సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించిన మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్.

** సీఎం కేసీఆర్ పర్యట ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ తో కలిసి పరిశీలించిన మంత్రులు.

(ఖమ్మంప్రతినిధి- విజయం న్యూస్)

ఈ నెల 18న ఖమ్మంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్  పర్యటనను విజయవంతం చేయలని, అందుకు తగు ఏర్పాట్లు చేయాలని వైద్య అరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Allso read:- ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోవాలి : హరీశ్ రావు

తొలుత జిల్లా కలెక్టరేట్ భావాన్ని ప్రారంభిస్తారని అనంతరం కలెక్టరేట్ పక్కన గల 100ఎకరాల స్థలంలో BRS జాతీయ తోలి బహిరంగ సభ నిర్వహించనున్నారని పేర్కొన్నారు.

ఆయ సభా ప్రాంగణంలో కొనసాగుతున్న ఏర్పాట్ల పనులను మంత్రులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు DCP లు శబరిష్, సుభాష్ చంద్రబోస్, ACP లు బస్వా రెడ్డి, వెంకటేష్, రెహమాన్, రామోజీ రమేష్ లతో సమీక్షించారు.

Allso read:-బహిరంగ సభాస్థలాన్ని పరిశీలించిన డీఐజీ రంగనాథ్

సీఎం కేసీఆర్ పర్యటన, భారీ బహిరంగ సభ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.

సభ వద్ద వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో భద్రత పకడ్బందీగా ఉండే విధంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.

Allso read:- తుమ్మలతో దోస్తి..

సభకు వచ్చే వారికి త్రాగు నీరు, విద్యుత్ సరఫరా, కళా బృందాలు, స్టేజ్ ఏర్పాట్లు, ప్రెస్, ట్రాఫిక్ స్లాట్స్, వాలంటీర్స్, విఐపి, వివిఐపి సీటింగ్స్, వివిధ రకాల పాసులు, వేదిక నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

 

వారి వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు తాతా మధు, పాడి కౌషిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.