Telugu News

ఖమ్మం మార్కెట్ లో మిర్చికి రికార్డ్ ధర

తేజ రకం మిర్చికి రికార్డు స్థాయిల్లో ధరలు.

0

ఖమ్మం మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్  చేస్తాం..

*తేజ రకం మిర్చికి రికార్డు స్థాయిల్లో ధరలు..*

*▪️క్వింటాల్‌కు రూ.25,550.*

*▪️జెండా పాటలో పాల్గొన్న మంత్రి పువ్వాడ.

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కేట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్‌ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం.

ఇది కూడా చదవండి:- పంట క”న్నీళ్ళ”పాలు

ఖమ్మం మార్కేట్ ను అంతర్జాతీయ మార్కేట్ కు చిరునామాగా తీర్చిదిద్దుతామని చిల్లీస్ కు హబ్ గా చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

సోమవారం ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కేట్ నందు నిర్వహించిన జెండా పాటలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. తెలంగాణ ప్రభుత్వంలో ఖమ్మం మిర్చి మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికింది అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- కేసీఅర్ నీ గద్దె దింపే దమ్ము నీకుందా: మంత్రి పువ్వాడ

కొన్ని క్వింటాలే కాదు…రైతులు పండించిన ప్రతి బస్తాలను కొనుగోలు చేస్తారన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని, మనం పండించే మిర్చి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందన్నారు.

ఖమ్మంలో చైనా దేశం మిర్చి కంపెనీలు ఖమ్మంలో ఎర్పాటు చేసి చైనా కి క్వాలిటీ మిర్చి ఎగుమతి చేస్తున్నామన్నరు.

మిర్చి ఘట్ కంటే రైతుల మీద ప్రేమ ఎక్కువ అని, అందుకే రైతుల ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు.

ఇది కూడా చదవండి:- Go.no 58, 59 ను పొడిగిస్తూన్నాం:మంత్రి పువ్వాడ