Telugu News

0

చిన్నారి చికిత్సకు చేయూత ఇవ్వరూ

◆◆ కిడ్నివ్యాధితో బాధపడుతున్న చిన్నారి

◆◆ దాతల సహాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

ఖమ్మం దానవాయిగూడెం, జూన్ 24(విజయం న్యూస్)

పేద కుటుంబం రెక్కాడితే కాని సాగని జీవనం… అయినా సాగిపోతున్న సంసారంలో చిన్నారి సోకిన మాయదారి జబ్బు కుటుంబాన్ని ఆర్ధికంగా చితికేలా చేసింది. స్తోమత ఉన్న వరకు చికిత్సకు ఖర్చు చేశారు. స్తోమత లేక చేతులు జోడించి దాతల సహాయాన్ని ఆర్జిస్తున్నారు.

Allso read:- కాంగ్రెస్ గూటికీ తాటి..నేడు చేరిక

ఖమ్మందానవాయిగూడెం 59 వ డివిజన్ చెందిన బచ్చలకూరి వెంకటేష్ రమాదేవి దంపతుల కమారుడు కౌశిక్ విష్ణు వివేక్, కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో రైయిన్ బో ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తుండగా తల్లిదండ్రులు రూ.6లక్షల వరకు వైద్యంకు ఖర్చు చేశారు. బచ్చలకూరి కౌశిక్ బ్లడ్ మార్పిడి చేస్తే తప్ప ప్రయోజనం లేదని దానికి ఒక ఇంజక్షన్ ఖర్చు 42వేల రూపాయలు అవుతుందని తెల్పటంతో బాలుడి తల్లిదండ్రు దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళారు. ఈక్రమంలో కార్పొరేటర్ బట్ట పోతు లలితా రాణి ద్వారా ప్రభుత్వం ద్వారా సహాయాన్ని ప్రయత్నిస్తున్నారు. అయినా అంత పైకం రావటం ఆషామాషి కాదు. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలంటూ వేడుకుంటున్నారు. దాతలు సహాయాన్ని ఫోన్ ఫే లేదా గూగుల్ పే 9985635202ద్వారా అందించాలని కోరుతున్నారు.