Telugu News

ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం

ముగ్గురు అధికారులపై వేటు

0

ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం

== ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్లు

== కూసుమంచిలో రెండు రోజుల్లోనే 300 రిజిస్ట్రేషన్లు..?

== అనుమానించిన అధికారులు

== బాగోతం బట్టబయలు..

== ముగ్గురు అధికారులపై వేటు

== ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల సస్పెన్షన్

== ఉత్తర్హులు జారీ చేసిన ఉన్నతాధికారులు

ఖమ్మం ప్రతినిధి, వైరా, జులై 9(విజయంన్యూస్)

అంతా మా ఇష్టం.. ఎడపేడా ఏం చేసిన అడిగేదేవడ్రా మా ఇష్టం.. అంతా మా ఇష్టం.. అన్నట్లు ఉంది ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో కొందరు అధికారులు, ఉద్యోగుల పరిస్థితి.. సందు దొరికిందంటే చాలు ఏదో చేస్తరన్నట్లుగా సబ్ రిజిస్ట్రార్ రెండు రోజులు సెలవులో వెళ్లగానే సంపాదనకు ఇదే సమయం అనుకున్న ఉద్యోగులు అవినీతికి, అక్రమాలకు తెరలేపారు. రియల్ మాయలకు సంపూర్ణ మద్దతు పలికారు.. ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక్క రోజులో 100 నుంచి 150 రిజిస్ట్రేషన్లు చేయడంతో అనుమానించిన ఉన్నతాధికారులు అందుకు సంబంధించిన చిట్టా మొత్తం బయటకు తీసి అయ్యవార్ల అవినీతి బండారం బయటపెట్టారు. అందుకు ఫలితంగా ముగ్గురు అధికారులు సస్పెండ్ కు గురైయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికి దొంగతనం ఎన్నటికి దాచిన దాగకుండ బట్టబయలవుతుందన్న చందంగా ఆ ముగ్గురి బాగోతం బట్టబయలైంది..  అవినీతి కోణం మరోసారి బట్టబయలైంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న రాము ఇటీవలే రెండు రోజుల పాటు వ్యక్తిగత పనులపై సెలవు పెట్టి వెళ్లిపోయారు.

allso read-తెగిపోయిన రోడ్డును పరిశీలించిన భట్టి విక్రమార్క

ఈ సమయంలో వైరా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పనిచేస్తున్న సీనియర్ అసెస్టెంట్ కిరణ్ ఖమ్మం కు వచ్చాడు. ఆ రెండు రోజుల పాటు ఇన్ చార్జ్ సబ్ రిజిస్ట్రార్ హోదాలో డాక్యూమెంట్లను రిజిస్ట్రేషన్ చేశారు.  అంటే అన్ని ఇన్ని కావు రెండు రోజుల్లోనే సుమారు 300కుపైగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రతి రోజు సీజన్ సమయంలో 30 నుంచి 40 వరకు, అన్ సీజన్ లో 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు మాత్రమే చేయగలరు. కానీ ఆ కిరణ్ సారూ రెండు రోజుల్లోనే 300కు పైగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు విచారణకు అదేశించారు. రెండు రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా రిజిస్ట్రార్ కు ఆదేశించడంతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. దీంతో అక్కడ అవినీతి జరిగిందని స్పష్టమైంది.దీంతో ఉన్నతాధికారులకు జిల్లా రిజిస్ట్రార్ నివేదికను అందించినట్లు సమాచారం. కాగా ఆ రికార్డును పరిశీలించిన రాష్ట్ర రిజిస్ట్రార్ వైరా సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ర్ట్రేషన్లపై విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో వైరాలో జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించగా అక్కడ కూడా అక్రమాలు జరిగినట్లు సమాచారం.అయితే  కిరణ్ కూసుమంచికి ఎప్ఏసీగా గతంలో అనేక సార్లు ఇలాగే ఆయన వచ్చి వెళ్తుండే వారు. ఆ సమయంలో ఎప్పుడు కూడా అక్రమాలు బయటకు రాలేదు.. దొరికనప్పుడే దొంగ అన్నట్లుగా ఇప్పుడు మాత్రం దర్జాగా సార్ ఉన్నతాధికారులకు దొరికేశాడు. దీంతో వైరా ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ సత్యానంద్, కూసుమంచి, వైరా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు ఖదీర్, కిరణ్ లను ఉన్నతాధికారులు  సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు.  ఈ విషయంపై స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ డీఐజీ సైదిరెడ్డిని వివరణ కోరగా ఆయన సస్పెన్స్ ను ధృవీకరించారు.

== నకిలీ డాక్యుమెంట్లతో అక్రమ సంపాధనకు

కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు ఇంచార్జ్ గా వచ్చిన సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన ఉద్యోగి అక్రమ సంపాధనకు తెరలేపారు. పదవి విరమణ సమయం అసన్నమవుతున్న సందర్భంలో అందినకాడికి దోచుకుందామనే ఆలోచనలో ఉన్న ఆయన ఒకే సారి కోటీశ్వరుడు అవ్వాలనే లక్ష్యంతో అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. నకిలీ డాక్యూమెంట్లను తయారు చేసి, మనిషి బ్రతికే ఉన్న చనిపోయినట్లుగా సర్టిఫికెట్స్ ను తయారు చేసి రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే రియల్ వ్యాపారులు అక్రమ వ్యాపారం చేస్తున్న కొందరు వ్యక్తుల సహాకారంతో అందినకాడికి దండుకుని భారీ ఆదాయంతో ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల వ్యవధిలో చేసిన 300కిపైగా రిజిస్ట్రేషన్లు చేసి సుమారు రూ.20లక్షల నుంచి రూ.35లక్షల వరకు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

allso read- రేగా కాంతారావు దద్దమ్మ ఎమ్మెల్యే: పాయం

== రియల్ మాయలో పడి

అక్రమసంపాధానే లక్ష్యంగా అడుగు ముందుకు వేసిన సీనియర్ అసిస్టెంట్ రియల్ మాయలో పడిపోయాడు. ఖమ్మంనగరం, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాలకు చెందిన రియల్ వ్యాపారులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకపోయినప్పటికి నకిలీ డాక్యూమెంట్లను తయారు చేసి క్రయవిక్రయదారులకు ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. రియల్ వ్యాపారుల నుంచి భారీగా వసూల్ చేసినట్లు సమాచారం. రియల్ వ్యాపారులు కూడా రెగ్యూలర్ గా పనిచేస్తున్న సబ్ రిజిస్ర్టార్ వారి పనులు చేయడం లేదని, కిందిస్థాయి సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని, వారికి చేతివాటం చూపించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ వ్యాపారులు, వారి స్వార్థం కోసం  పైసలకు కక్కుర్తి పడిన ముగ్గురు ఉద్యోగులను నిలువున బలిచేశారని పలువురు చెబుతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయో..?