Telugu News

ఖమ్మం 45 డిగ్రీలు

== మండుతున్న ఎండలు..

0

ఖమ్మం 45 డిగ్రీలు

== మండుతున్న ఎండలు..

== వడదెబ్బకు గురవుతున్న జనం

== జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

 

(అంజయ్య, ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-

మే ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి.. తెల్లారిందే మొదలుకొని సూర్యుడు తన ప్రతాపాన్ని జనం మీద చూపిస్తున్నాడు. ఉదయం 6గంటల నుంచే ఎండల తీవ్రత అధికమవుతుంది. మిట్ట మధ్యాహ్నం వచ్చే సరికి ఎండ తీవ్రత అధికమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పట్టుకున్న కాలిపోయే పరిస్థితి ఉంది. ఆ తరహాలో ఎండ తీవ్రత ఉంది. ప్రస్తుతం మంగళవారం సాయంత్రం నాటికి 45 డిగ్రీలకు ఎండతీవ్రత చేరుకుందంటే ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రజలు భయటకు రావాలంటే జంకుతున్నారు. ఉదయం 10గంటలకే పనులు పూర్తి చేసుకుని ఇండ్లకు చేరుకుంటున్నారు.

also read :-

కాగా అత్యవసర పనులపై బయటకు వెళ్తున్న జనం కచ్చితంగా వడదెబ్బ భారీన పడుతున్నారు. తద్వారా వాంతులు, విరోచనాలు, కండ్లు తిరగడం, బీపీ పడిపోవడం లాంటి పరిస్థితి ఏర్పడింది. వందలాధి మంది ఆసుపత్రి భారీపడుతున్నారు. ఇక ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10గంటల తరువాత వాహనాలు నడిపే పరిస్థితి లేదు. ఇక శితలపానియాలకు మస్తు గిరాకి ఉంది. ఎండతీవ్రతకు జ్యూస్, కొబ్బరిబొండాలు, మజ్జిగ, నిమ్మసోడా లాంటి వ్యాపారానికి మస్తు గిరాకి ఉంది. ఇక పుచ్చకాయలు, ముంజలకు భలే గిరాకీ ఉంది. అయితే ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజల కోసం విజయం పత్రిక వైద్యులు అందించే సలహాలను ప్రచురితం చేయడం జరుగుతుంది. కూసుమంచి మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఎండలకు తీవ్రతకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వారి చేసిన సూచనలు ఇవ్వే.

== వడ దెబ్బ తగిలకుండా జాగ్రత్తలు
== ఎండ వేడితోపాటు గాల్పుల తీవ్రత కూడా రోజు రోజుకు పెరుగుతుంది. పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా వేడి గాలులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వడ దెబ్బకు గురైతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. అప్పటివరకు బాధితుడు ప్రాణాలతో ఉండాలంటే మీరు తప్పకుండా ప్రథమ చికిత్స అందించాలి.

== హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ (వడ దెబ్బ) అంటే?: సూర్యుడి వేడి వల్ల వీచే వేడిగాలులే వడగాల్పులు. ఇవి మన కళ్లు, చెవుల ద్వారా శరీరంలోకి చేరుతాయి. శరీర ఉష్ణోగ్రతను ఈ గాలులు పెంచేస్తాయి. ఫలితంగా మెదడు, అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. దీంతో శరీరం అదుపుతప్పి కొన్ని లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, వాంతులు, మూర్ఛ, అలసట, తల తిరగడంతో పాటు స్పృహ కూడా కోల్పోవచ్చు. వడ దెబ్బ పిల్లలకు, పెద్దలకు హానికరం. ఆరోగ్యంగా ఉన్న క్రీడాకారులు సైతం వడ దెబ్బ ప్రభావం చూపుతుంది. కాబట్టి, వయస్సుతో పనిలేకుండా ప్రతి ఒక్కరు వడ గాల్పుల నుంచి జాగ్రత్తగా ఉండాలి.

also read :-టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో రంజాన్ విందు

== సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సేపు ఎండలో, వేడి గాలుల్లో తిరగకూడదు. ఎండ తీవ్రత వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ విఫలమవుతుంది. వడ దెబ్బకు గురైన వారి శరీర ఉష్ణోగ్రత 104 ఎఫ్ కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ప్రధాన నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే, వడ దెబ్బ తగిలిన వెంటనే వికారం, మూర్ఛ, గందరగోళం, అయోమయంగా ఉంటుంది. స్పృహ కోల్పోయి, కోమాలోకి వెళ్లిపోతారు.
== వడ దెబ్బ లక్షణాలివే:
☀ శరీర ఉష్ణోగ్రత 104 ఎఫ్ కంటే ఎక్కువగా ఉంటుంది.
☀ మూర్ఛపోయే ప్రమాదం ఉంది.
☀ తీవ్రమైన తలనొప్పి లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
☀ చెమట పట్టడం ఆగిపోతుంది.
శరీరం పొడిగా లేదా ఎర్రగా మారిపోతుంది.
☀ కండరాలు బలహీనమవుతాయి. తిమ్మిరి ఏర్పడుతుంది.
☀ వికారం, వాంతులు.
☀ గుండె వేగంగా కొట్టుకుంటుంది.
☀ శ్వాస పీల్చుకోడానికి ఇబ్బంది ఏర్పడుతుంది.
☀ గందరగోళం, అయోమయంగా ఉంటుంది. వింతగా ప్రవర్తిస్తారు.
☀ మూర్ఛలు ఏర్పడతాయి. అపస్మారక స్థితికి చేరుకుంటారు.

== వడ దెబ్బ తగిలిన వెంటనే ఇలా చేస్తే ప్రాణాలు దక్కుతాయి:
రోడ్డు పక్కన ఎవరైనా వడ దెబ్బతో పడిపోయినా, లేదా మీకే వడ దెబ్బ తగిలినట్లుగా సందేహం కలిగిన తప్పకుండా ప్రథమ చికిత్స అవసరం. వీలైతే ఇతరుల సాయం తీసుకునైనా ఇక్కడ చెప్పినట్లు చేయండి.
☀ ఎవరైనా వడదెబ్బకు గురై పడిపోయినట్లయితే అంబులెన్స్‌కు కాల్ చేయాలి.
☀ అంబులెన్స్ వచ్చేలోపు మీరు బాధితుడిని చల్లగా ఉండే ప్రదేశం లేదా చెట్టు నీడలోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయాలి.
☀ అవసరమైతే బాధితుడిపై అదనగా ఏమైనా దుస్తులు ఉంటే వాటిని తొలగించి గాలి తగిలేలా చూడండి.
☀ ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత తగ్గించడం కోసం క్లాత్‌ను చల్లని నీటితో తడిపి శరీరాన్ని తుడవండి.
☀ వడదెబ్బ వల్ల బాధితుడి శరీర ఉష్ణోగ్రత 104 ఎఫ్ కు చేరుకొనే అవకాశం ఉంటుంది. దాన్ని 101 ఎఫ్ నుంచి 102 ఎఫ్ వరకు తగ్గించాలి.
☀ థర్మామీటర్లు అందుబాటులో లేకపోయినా ప్రథమ చికిత్స చేయడానికి వెనకాడకండి.
☀ వీలైతే బాధితుడిని సమీపంలోని ఏదైనా ఆఫీస్, షాప్, ఇంట్లోకి తీసుకెళ్లి చల్లని వాతావరణంలో ఉంచండి.
☀ ఐస్ ప్యాక్‌లు అందుబాటులో ఉంటే బాధితుడి చంకలు, గజ్జలు, మెడ, వీపు భాగాల్లో పెట్టండి.
☀ పైన చెప్పిన శరీర భాగాల్లో రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి. అవి చల్లబడితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
☀ బాధితుడి షవర్ కిందకు తీసుకెళ్లి స్నానం చేయించినా పర్వాలేదు. లేదా చల్లని నీటి టబ్‌లోనైనా ముంచవచ్చు.
☀ ఆరోగ్యం, యవ్వనంగా ఉండే వ్యక్తి తీవ్ర వ్యాయామం వల్ల వడ దెబ్బకు గురైతే.. ‘ఎక్సర్షనల్ హీట్ స్ట్రోక్’ అని అంటారు. వీరికి ఐస్ బాత్‌ చేయించాలి.

also read :-టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో రంజాన్ విందు

☀ వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు లేదా వ్యాయామం చేయని వ్యక్తులు, మద్యం తాగేవాళ్లు వడదెబ్బకు గురైనట్లయితే ఐస్ లేదా మంచును అస్సలు ఉపయోగించవద్దు. అలా చేస్తే చేయడం చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు సాధారణ నీటితోనే వారి శరీర ఉష్ణోగ్రత తగ్గించే ప్రయత్నం చేయాలి.
== వడ దెబ్బకు గురికాకుడదంటే ఈ జాగ్రత్తలు పాటించాలి?:

☀ వేసవిలో బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా మీ వెంట నీటి బాటిల్ ఉండాలి. వీలైతే ఓఆర్ఎస్ లేదా ఎలక్ట్రోలైట్‌, గ్లూకోజ్ వాటర్ మీ వెంట తీసుకెళ్లండి.
☀ శరీరానికి గాలి తగిలే కాటన్, వదులైన దుస్తులు ధరించాలి.
☀ మీరు వేసుకొనే దుస్తులు మీ చెమటను పీల్చగలగాలి. అలా ఉండటం వల్ల మీ దుస్తులు తడిగా ఉండి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.
☀ ఆల్కహాల్, మత్తు పదార్థాలు తీసుకొనరాదు.

(డాక్టర్ శ్రీనివాస్, జనరల్ మెడిసిన్, కూసుమంచి మండల వైద్యాధికారి)