Telugu News

వినాయక నిమజ్జనం ఎప్పుడు..?

శుక్రవారమా..? శనివారమా..?

0

వినాయక నిమజ్జనం ఎప్పుడు..?

== శుక్రవారమా..? శనివారమా..?

== ఆయోమయంలో భక్తులు

== ఎప్పుడు నిర్వహించాలో అర్థంగాక తలపట్టుకుంటున్న ఉత్సవ కమిటీ నిర్వహాకులు

== తికమక సమాధానం చెబుతున్న అర్చకులు

== ప్రభుత్వమే నిర్ణయిస్తే బాగుంటుందని చెబుతున్న విశ్లేషకులు

ఖమ్మం ప్రతినిధి, సెప్టెంబర్ 7(విజయంన్యూస్)

దేవదేవుళ్ల కంటే ముందే పూజలందుకునే గణనాథుడి నిమజ్జన వేడుకలు కొంత సమస్య మారాయి. శనివారం నిమజ్జనం చేయాలా..? శుక్రవారం చేయాలా..? అనేది ఎవరికి అర్థం కావడం లేదు. నిమజ్జనం చేసే విషయంలో అటు అర్చకులు, ఇటు భక్తులు ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రచారం చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

ఇది కూడా చదవండి:- ఖమ్మంకు వచ్చిన ‘ఇస్మాట్ శంకర్’

ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గణేష్ ప్రతిష్ట కార్యక్రమం వినాయక చవితి పండుగ సందర్భంగా అన్ని గ్రామాల్లో వినాయకుడ్ని ప్రతిష్టించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 9 నవ రాత్రుల పాటు పూజలు చేయాల్సి ఉంటుంది. నవ రాత్రుల అనంతరం మరసటి రోజు నిమజ్జనం చేయడం ఆచారంగా వస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం భక్తులకు భలే కష్టమొచ్చి పడింది. ఆగస్టు 31న వినాయక చవితి కార్యక్రమంను నిర్వహించగా, అదే రోజు గ్రామగ్రామాన, వీధివీధిన భక్తులు విగ్రహాలను ప్రతిష్టించారు. కాగా 9 నవరాత్రుల పాటు పూజలు చేయాల్సి ఉండగా మరసటి రోజున భక్తులందరు నిమజ్జనం చేస్తుండే పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఏడాద కూడా ఇదే అయోమయం  నెలకొంది. ప్రతి ఏడాది 9 రోజుల తరువాత ఒక రోజు వేచి చూసి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించే వారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే కచ్చితంగా భక్తులు ఆయోమయం చెందక తప్పదు.

== శుక్రవారం చేయోద్దనే సెంటిమెంట్ తో

ఆగస్టు 31న వినాయక చవితి సందర్భంగా గ్రామగ్రామాన, వాడవాడన వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే నవ రాత్రుల పాటు కచ్చితంగా పూజలు చేయాల్సి ఉంటుంది. అంటే ఆగస్టు 31 నుంచి జనవరి 8వరకు మొత్తం 9 నవరాత్రులు పూర్తి చేసుకుని, 8న  రాత్రి సమయంలో పూజలు అనంతరం అర్చకుడు ఆ విగ్రహాన్ని కదిలించి మరసటి రోజున నిమజ్జనం చేసే ఏర్పాట్లు చేస్తారు. అంటే 10వ రోజున నిమజ్జనంకు బయలు దేరి వెళ్లడం ఆచారంగా వస్తుంది. కాని ఇప్పుడు 9న నిమజ్జనం చేయాలని భావిస్తున్నప్పటికి ఆ రోజు శుక్రవారం అని చాలా మంది వెనకడు వెస్లున్నారు.

ఇది కూడా చదవండి:- ఆశయమా… ఆత్మరక్షణా..

దీంతో ఈనె10న అంటే 11వ రోజున నిమజ్జనం చేయాలని చాలా మంది భక్తులు డిసైడ్ అయ్యినట్లు తెలుస్తోంది. అయితే సమయం దగ్గరపడుతున్నప్పటికి ఏ రోజున నిమజ్జనం చేయాలో అర్థం కాక చాలా మంద భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఇబ్బుందులు పడుతున్నారు. ఆయోమయంలో పడిపోయారు. ఈ విషయంపై స్థానికంగా ఉన్న అర్చకులను కదిలిస్తే ఏ ఊరి అర్చకుడు ఆ ఊరికి తగినట్లుగా చెబుతున్నట్లు తెలుస్తోంది.  దీంతో భక్తులు ఆయోమయానికి గురవుతున్నాడు. కావునా ప్రభుత్వం స్పందించి వినాయక నిమజ్జనం విషయంలో సరైన నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నారు. అలా జరిగితే తప్ప కొందరు 9న, మరికొంత మంది 10 నిమజ్జనం చేసే అవకాశాలఉ కనిపిస్తున్నాయి.  అయితే ఎక్కువ మంది మాత్రం శనివారం జరిగే అవకాశం ఉందని భక్తులు చెబుతున్నారు.