ఖమ్మం నగరంలో చాపల మార్కెట్ వద్ద ఉద్రిక్తత
== హైకోర్టు ఆదేశాల మేరకు.. మున్సిపల్ అధికారులు చేపల మార్కెట్ షాపుల తొలగింపు…
== జెసిబి ల సహాయంతో షాపులో ఉన్న సామానులు తరలిస్తున్న పోలీసులు మున్సిపల్ అధికారులు
== అడ్డుకున్న షాపు యాజమాన్యాలు. .
== షాప్ యాజమాన్యాలకు పోలీసులకు మధ్య తోపులాట
ఖమ్మంప్రతినిధి, అక్టోబర్ 10(విజయంన్యూస్)
ఖమ్మం నగరంలోని నడిబొడ్డున సోమవారం షాపుల యజమానులకు, పోలీసులకు మద్య తోపులాట జరిగింది. సుమారు నాలుగు గంటల పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.. పదుల సంఖ్యలో పోలీసులు, అధికారులు, వందల సంఖ్యలో షాపుల యజమానుల మధ్య జరిగిన ఈ తోపులాట టెన్షన్ వాతావరణాన్ని నేలకొల్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మంనగరంలోని వైరారోడ్డులోని చర్చీ సమీపంలో చేపల మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ ను తరలించేందుకు ఖమ్మం నగర కార్పోరేషన్ అధికారులు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మార్కెట్ వల్ల వైరా రోడ్డు కొంత అభివద్దికి ఇబ్బందిగా మారిందని భావిస్తున్న అధికారులు గతంలో కూల్చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానిక షాపుల యజమానులు అడ్డుకున్నారు. అప్పుడు ఇదే తరహాలో వాగ్వాదం, తోపులాట, టెన్షన్ వాతావరణం నేలకొంది.
ALLSO READ- మాజీ సీఎం ములాయం సింగ్ కన్నుమూత
అనంతరం షాపుల యజమానులు, మున్సిపల్ అధికారులు కోర్టును అశ్రయించారు. అక్టోబర్ 10 వరకు కోర్టు గడువునిచ్చింది. అయితే సోమవారంతో గడువు పూర్తి కావడంతో ఇదే అదునుగా భావించిన ఖమ్మం నగర మున్సిపల్ అధికారులు షాపులు ఖాళీ చేయించే పనిలో పడ్డారు. మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, ఖమ్మం అర్భన్ తహసీల్దార్ శైలజ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ సుభాస్ చంద్రబోస్ ఆధ్వర్యంలో జేసీబీల సహాయంతో షాపులను ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. దీంతో షాపుల యజమానులు, వారి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు,ఆందోళన కారులకు నడుమ వాగ్వాదం జరిగింది. సుమారు నాలుగు గంటల పాటు గొడవ జరిగింది. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీబందోబస్తును ఏర్పాటు చేశారు. ఏసీపీలు ఆంజనేయులు, బస్వారెడ్డి, నగరంలోని అందరు సీఐ, ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించి షాపులను ఖాళీ చేయించారు. మొత్తం 19 షాపులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. రెండవ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో పోలీసులు ముందుగానే మరింత బందోబస్తును ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా షాపుల యజమానులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటే మేము ఎక్కడ బతకాలని అన్నారు. మా కుటుంబాలు రోడ్డున పడతాయని, మాకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారని, ఈ ప్రాంతాన్ని అక్రమించుకునే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. అధికారులు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి చెబుతున్నామని తెలిపారు. వైరారోడ్డు అంటే అభివద్దికి చిరునామ అని, చేపల మార్కెట్ వల్ల అభివద్ది పనులు ఆగిపోతున్నాయని, అలాగే డ్రైనేజీని శుభ్రం చేసే పరిస్థితి కూడా లేకుండ పోయిందని, అందుకే తప్పని పరిస్థితుల్లో ఖాళీ చేయించాల్సి వస్తుందని, ఏ షాపువాళ్లపై మాకు కోపం లేదన్నారు. ప్రజల క్షేమమే మా లక్ష్యమన్నారు. ఇది మున్సిపల్ కాంప్లెక్స్ మాత్రమేనని, మున్సిపల్ కు అన్ని హక్కులు ఉంటాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
ALLSO READ- భర్తను హత్య చేసిన భార్య, అత్త