దేశం కోసం అబ్దుల్ కలాం చేసిన కృషి మరవలేనిది
== యువత కలాంను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి
== అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించిన ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు జావిద
ఖమ్మం, అక్టోబర్ 15:
ఏపీజే అబ్దుల్ కలాం ఒక మహానీయుడు, ఆయన దేశం కోసం ఎంతో చేశారు.. ఎన్నో ప్రయోగాలను దేశానికి అందించారు. ఆయన దేశం కోసం చేసిన సేవ మరవలేనిది. తన జీవితం దేశానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ పేర్కొన్నారు. శనివారం దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ జీ దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చారని కొనియాడారు.
allso read- అసరా పింఛన్లు పత్రాలిచ్చారు.. పైసలేప్పుడిస్తరు
దేశానికి అత్యున్నత పదవిని చేపట్టినప్పటికి, ప్రపంచంలోనే అద్భుతమైన ప్రయోగాలు చేసినప్పటికి, ఆయన చాలా అతి సామాన్యుడిగా జీవితం గడిపారని అన్నారు. ఆయన ప్రభుత్వ సొమ్మును ఉపయోగించేవాడు కాదని, స్వంత డబ్బులతో ప్రయాణాలు చేసేవారని అంతటి మహానీయుడు మనందరికి ఆదర్శమని అన్నారు. అందుకే యువతీ యువకలుందరు, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని జావిద్ సూచించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిరస్మరణీయుడని, దేశాన్ని సమర్థవంతంగా మార్చేందుకు కలాం కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఎంతోమంది ఆరాధించారని గుర్తుచేసుకుంటూ ఏపీజే అబ్దుల్ కలాంకు మరోసారి నివాళులు అర్పించారు.