Telugu News

కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం అభివద్ది: మంత్రి

గొంగళి పురుగులాంటి ఖమ్మంను సీతాకోక చిలుకలా మార్చుకున్న

0

కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం అభివద్ది: మంత్రి

== గొంగళి పురుగులాంటి ఖమ్మంను సీతాకోక చిలుకలా మార్చుకున్న

== కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం అభివద్ది

== ప్రజల సహాకారంతో మరింత అభవద్ది చేస్తాం

== రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ 

ఖమ్మంప్రతినిధి, మే 15(విజయంన్యూస్):

కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం నగరాన్న అభివద్ది చేశానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.  ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన అనేక పనులు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సైకిల్ పై ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మంత్రి సోమవారం పర్యటించారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం నగరంలో సైకిల్ పై  మంత్రి సవారి

వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ ఆధికారులతో కలిసి సైకిల్పై పర్యటించారు.   గొంగళి పురుగులా ఉన్న ఖమ్మంను గత తొమ్మిదేళ్లలో సీతాకోక చిలుకలా మార్చుకున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఖమ్మం నగరాభివద్ది గురించి చెప్పారు.    గత నాలుగు సంవత్సరాలలో ప్రజలకు సరైన రీతిలో మౌళిక వసతులు అందుతున్నాయని, అందుకు ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నామని వివరించారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నగరంలో త్రాగునీటి సమస్యను పూర్తిగా అధిగమించామని స్పష్టం చేశారు. నేడు చెత్త సేకరణ అద్భుతంగా జరుగుతుందని, గతంతో పోల్చితే నేడు రోడ్ల మీద చెత్త లేకుండా ట్రాక్టర్ లు, మిని వ్యాన్ ల ద్వారా నిర్విరామంగా చెత్త సేకరణ జరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండ: రైతులు ఆదైర్యపడోద్దు..? ప్రతి గింజను కొంటాం: మంత్రి

మురుగు సమస్యను సైతం పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతోనే డివిజన్ కు రూ.40 లక్షలు కేవలం డ్రైన్స్ నిర్మాణం కోసమే కేటాయించామని అన్నారు. ప్రస్తుతం నిర్మించిన గోళ్ళపాడు ఛానల్ అండర్ గ్రౌండ్ 13 కి.మి. ఎలా చేశామో,  త్వరలో 23 కిలో మీటర్ల మేర అండర్ డ్రైనేజ్ నిర్మాణ చేయాలని తలచామని, ఆయా పనులకు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ అతి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి సైకిల్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నామని మంత్రి తెలిపారు. స్వయంగా పరిశీలించడం ద్వారా ఇప్పటి వరకు చాలా సమస్యలు పరిష్కరించామని చెప్పారు. ప్రజాసమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పర్యటించడమే ఈ పర్యటన ఉద్దేశమని, ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి వివరించారు.   ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణాలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.