Telugu News

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మరో రచ్చ

చైర్మన్ సీటు పక్కకు నెట్టి

0

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మరో రచ్చ

== చైర్మన్ సీటు పక్కకు నెట్టి

== చైర్మన్ కుర్చునే ప్రాంతంలో కార్యదర్శి మీటింగ్

== రాత్రి వ్యాపారులతో సమావేశమైన మార్కెట్ కార్యదర్శి

== సోషల్ మీడియాలో పోటో వైరల్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అది ఖమ్మం వ్యవసాయ మార్కెట్.. అక్రమాలు జరుగుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో  మార్కెట్ కార్యదర్శి అత్యవసర సమావేశం నిర్వహించారు.. అధికారులతో కాదండి బాబు..వ్యాపారులతో, కమిటీ పాలకవర్గంతో సమావేశం నిర్వహించారు.. అయితే ఆ సమావేశం చైర్మన్ చాంబర్ లో నిర్వహించగా, చైర్మన్ కూర్చుని పక్కకు నెట్టి, చైర్మన్ కుర్చునే ప్రాంతంలో మార్కెట్ కార్యదర్శి చైర్ వేసుకుని సమావేశం నిర్వహించారు.. అక్కడే వైస్ చైర్మన్ ఉన్నప్పటికి ఆయన్ను కాదని కార్యదర్శి చైర్మన్ చాంబర్ లో చైర్మన్ కుర్చునే సీటు వద్ద(ఆమె కుర్చికాదు.) కుర్చోవడంతో పాటు వైస్ చైర్మన్ కు ఆ ప్రాథాన్యత ఇవ్వకపోవడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..   ఆ చైర్మన్ చాంబర్ ని పక్కన పెట్టి ఆయన కుర్చిలో కుర్చోవడంతో సోషల్ మీడియాలో ఆ పోటో వైరల్ అవుతోంది.. నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.. ఎందుకు ఇలా జరిగిందో ఒక సారి పూర్తి వివరాలు చూద్దాం..

allso read- ఖమ్మం మార్కెట్ లో మాయాజాలం

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో రెండు రోజులుగా అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వాధాయానికి వ్యాపారులు గండికోడుతున్నారని, తప్పుడు బిల్లులతో మార్కెట్ ను మోసం చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు అక్రమ బిల్లులను అడ్డుకుని ఆందోళన చేశారు. తప్పుడు బిల్లులతో రవాణా అవుతున్న రెండు లారీలను కూడా అధికారులకు పట్టివ్వడంతో ఇద్దరు వ్యాపారులకు ఒక్కోక్క లక్ష రూపాయల చొప్పున జరిమాన విధించారు. మరసటి రోజు అదే పరిస్థితి మార్కెట్ లో జరుగుతుండటంతో రైతులు అడ్డుకున్నారు. దీంతో గొడవ జరిగింది. రోజంతా కొనుగోలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.. అయినప్పటికి వ్యాపారుల బుద్ది మారలేదు.. తిరిగి మళ్లీ అదే సీన్.. మధ్యాహ్నం సమయంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు వద్ద కొనుగోలు చేసిన 14 బస్తాలకు రూ.6వేల చొప్పున ధరను కేటాయిస్తూ బిల్లులు వేశారు.. దీంతో నేరుగా మీడియా పట్టుకుని ప్రశ్నించింది. దీనికి వ్యాపారులు బుకాయించే పరిస్థితికి వచ్చారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో అక్రమ బిల్లుల వ్యవహారం అటుఇటుగా పెద్దల వద్దకు చేరినట్లు సమాచారం. దీంతో స్పందించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ అత్యవసర విలేకర్ల సమావేశం నిర్వహించి ఖమ్మం మార్కెట్ లో ఎలాంటి అక్రమాలు జరగడం లేదు.. ఓ వ్యక్తి ఓడిపోయిన అసహానంతో ఖమ్మం మార్కెట్ పై ఆరోపణలు చేస్తున్నాడని ఖండించారు. వారి ప్రెస్ మీట్ కొనసాగుతుంటూనే ఓ కోల్డ్ స్టోరేజీ వద్ద మరో తప్పుడు బిల్లుతో మిర్చిని కొనుగోలు చేస్తుండగా మీడియా ప్రతినిధులు పట్టుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. అంతా సైలెంట్ అయ్యారు..

== చైర్మన్ ఛాంబర్ లో రాత్రి అత్యవసర సమావేశం

ఖమ్మం మార్కెట్ పై జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రుద్రాక్ష మల్లేశం అత్యవసర సమావేశం నిర్వహించారు. వాస్తవంగా అధికారులతో, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించి ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని ఆదేశించాల్సి ఉంటుంది.. అలాగే మార్కెట్ కార్యదర్శి నేరుగా మార్కెట్ లో తనిఖీలు చేయాల్సి ఉంటుంది..  కానీ వ్యాపారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం అవ్వడం చర్చాంశనీయంగా మారింది. అయితే ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ ఖమ్మం మార్కెట్ లో  అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఖమ్మం మార్కెట్ పై అక్రమాల వ్యవహారం సరైంది కాదని చెప్పారు. అయితే రెండు రోజులుగా వరస ఫిర్యాదులు చేస్తున్న యర్రా అప్పారావుతో చర్చిలు జరిగినట్లు సమాచారం.

allso read- మార్కెట్ లో మోసం అనేదే లేదు :చిన్నిక్రిష్ణారావు

అందరు వ్యాపారులంతా ఐక్యంగా ఉండాలని, వ్యాపారులకు సంబంధించిన విషయాలు బయటపెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పి యర్రా అప్పారావును ఒప్పించినట్లుగా తెలుస్తోంది.. అది అంతర్గత విషయమైనప్పటికి ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోటో చైర్మన్ సీటును పక్కకు పెట్టి ఆమె కుర్చోనే స్థానంలో కార్యదర్శి చైర్ వేసుకుని కుర్చోవడం అక్కడ తప్పుగా భావించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.. నేనే రాజు..నేనే మంత్రి అన్న ట్యాగ్ లైన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పోస్టు కాస్త చెక్కర్లు కొడుతోంది.. వాస్తవంగా చైర్మన్ ఛాంబర్ లో సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తే ఆ చైర్మన్ సీటును అక్కడే ఉంచి ఆ స్థానాన్ని ఖాళీగా వదిలి పక్క స్థానాల్లో కుర్చోవాల్సి ఉంటుంది.. ముఖ్యంగా చైర్మన్ ఛాంబర్ లో  చైర్మన్ తరువాత ఆ బాధ్యత తీసుకునే హక్కు వైస్ చైర్మన్ కు ఉంటుంది.. అధికారులకు అవకాశం ఉండదు.. కానీ మార్కెట్  కార్యదర్శి మల్లేషం ఆ బాధ్యతను విశ్మరించారనే ప్రచారం జరుగుతుంది.. వైస్ చైర్మన్ ఆ స్థానం పక్క స్థానాన్ని కల్పించి వైస్ చైర్మన్ పక్కన కార్యదర్శి కుర్చోవాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు..  అయితే ఈ విషయం పై ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మల్లేశంతో విజయం పత్రిక ప్రతినిధి మాట్లాడి వివరణ కోరగా చైర్మన్ ఛాంబర్ లోనే మీటింగ్ హాల్ ఉందని, ఆమె సీటును పక్కన పెట్టి నేను కుర్చున్నానని, ఆమె సీటులో కుర్చున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తున్నామని తెలిపారు. అధికారిగా చైర్మన్ సీటులో కుర్చుంటామా..? అంత తెలివితక్కువ వాళ్లమా..? యాడ్లు ఇవ్వలేదని మీడియా వాళ్లు నన్ను టార్గెట్ గా చేసుకుని వార్తలు రాస్తున్నారని ఆరోపించారు. వాస్తవంగా చైర్మన్ సీటు అలాగే ఉంచితే బాగుండదని ప్రజలు భావిస్తున్నారు. చూద్దాం ఖమ్మం మార్కెట్ వ్యవహారం ఇంకేంత దూరం పోతుందో..? చూడాలి..

ఇది కూడా చదవండి: పదికి పదే లక్ష్యంగా పనిచేద్దాం :మంత్రి పువ్వాడ