Telugu News

ఖమ్మం మార్కెట్ లో మాయాజాలం

రెండు లారీల మిర్చిని పట్టుకున్న అధికారులు

0

ఖమ్మం మార్కెట్ లో మాయాజాలం

== రైతుల పేరిట ట్రైడర్ల టోకర

==రూ.20వేల ధరకు 6వేల బిల్లులిస్తున్న వ్యాపారులు

== సర్కార్ ఆధాయానికి గండి

== మార్కెట్ కమిటీ.. అధికారుల కన్నుసన్నాల్లోనే వ్యాపారమంతా..?

== రెండు లారీల మిర్చిని పట్టుకున్న అధికారులు

== ఒక్కోక్క వ్యాపారికి రూ.1లక్ష చొప్పున జరిమాన..?

== జరిమాన విధించిన మరసటి రోజే ఆ వ్యాపారి అదేబాట

== మార్కెట్ లో వ్యాపారుల మధ్య గొడవ

== నిలిచిన కొనుగోలు.. పట్టించుకుని అధికారులు

ఖమ్మంప్రతినిధి,నవంబర్ 17(విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అక్రమాలకు నిలయంగా మారింది.. రైతుల పేరుతో కొందరు వ్యాపారులు(ట్రైడర్ల) టోకరా చేస్తున్నారు.. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులకు ఏకనామం పెడుతున్నారు..లక్షలాధి రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన పన్నుకు కుచ్చుటోపి పెట్టి వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు..పట్టపగలే అందరు చూస్తుండగానే ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు.. అమాయ రైతుల కష్టాన్ని అసరగా చేసుకుని ప్రభుత్వ సొమ్మును నొక్కేస్తున్నారు.. ఇదంతా వ్యవసాయ మార్కెట్ కమిటీ, అధికారుల కన్నుసన్నాల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది..

allso read- మార్కెట్ లో మోసం అనేదే లేదు :చిన్నిక్రిష్ణారావు

అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు తూతూ మంత్రపు దాడులు చేశారు.. ఓ వ్యాపారి అక్రమ వ్యాపారాన్ని బయటపెట్టడంతో అకస్మీకంగా తనిఖీలు చేసిన అధికారులు రెండు లారీలను నిలిపివేసి ఆ వ్యాపారులకు ఒక్కోక్కిరిక రూ.1లక్ష చొప్పున జరిమాన విధించినట్లు సమాచారం.. అంతలోనే కుక్క వక్రబుద్ది మాననట్లు ఒక వైపు వ్యాపారుల అక్రమాలు బయటపడుతుండగానే మరో వైపు అక్రమాలు ఆగడం లేదు. దీంతో విలేకర్లే స్వయంగా అక్రమాలను పట్టుకున్న పరిస్థితి ఏర్పడింది.. ఈ విషయంపై అధికారులకు జర్నలిస్టులు సమాచారం ఇచ్చిన పట్టించుకునే నాథుడే కరువైయ్యారు.. ఈజీగా తీసుకుంటూ ఇది కామన్ సార్ అంటూ సమాధానం ఇస్తున్నారు..ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో అక్రమ వ్యాపారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు భారీగా మిర్చి పంట తరలివస్తుంది. మిర్చి పంటకు మద్దతు ధర సుమారు రూ.20 వేలకు పైగా పలుకుతుండటంతో ఖమ్మం జిల్లా, ఇతర పక్క జిల్లా నలుమూలల నుంచి రైతులు ఎర్రబంగారం పంటను ఖమ్మం మార్కెట్ కు తీసుకోస్తున్నారు. మద్దతు ధర ఎక్కువగా ఉండటంతో ఏసీలో ఉన్న మిర్చిని, ఇప్పుడు తీసుకోస్తున్న మిర్చిని విక్రయాలు చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలో ఉన్న మిర్చి పంటను సైతం రైతులు విక్రయాలు చేస్తున్నారు. అయితే రైతుల అవసరాలను అసరగా చేసుకున్న వ్యాపారులు అడ్డి పేరుతో  అటు రైతులకు, ఇటు ప్రభుత్వాధాయానికి భారీగా గండికొడుతున్నారు. రైతులకు తెలియకుండా కొంత మంది, రైతులకు తెలిసి కొంత మంది వ్యాపారులు అక్రమ వ్యాపారం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన లక్షల రూపాయల పన్నును స్వాహా చేస్తున్నారు.

== మిర్చి పంటను తాలూ పంట అని చూపుతూ

రైతులు కొల్డ్ స్టోరేజీలో ఏర్పాటు చేసిన పంటకు భారీగా మద్దతు ధర పలుకుతోంది. సుమారు రూ.20,500 నుంచి రూ.21వేల వరకు ధర పలుకుతుంది. అయితే వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధర మొత్తానికి బిల్లులు ఇవ్వాల్సి ఉంది.. కానీ ఒక రైతుకు 100 క్వింటాల మిర్చి ఉంటే అందులో 60 క్వింటాల మిర్చికి ఒరిజనల ధరతో బిల్లును ఇస్తూ, మరో 40 క్వింటాల మిర్చికి రూ.5వేల నుంచి 6వేల వరకు ఆన్ లైన్ బిల్లు ఇస్తున్నారు. రూ.20వేలకు బిల్లును ఆన్ లైన్ బిల్లు ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.2వేల వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది..

allso read- పదికి పదే లక్ష్యంగా పనిచేద్దాం :మంత్రి పువ్వాడ

అదే రూ.6వేల వరకు ఆన్ లైన్ బిల్లు వేయడం వల్ల వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిల్లు రూ.600 మాత్రమే ఉంటుంది. సుమారు 50క్వింటాల మిర్చి పంటను రూ.20,500 చొప్పున రైతు నుంచి కొనుగోలు చేస్తే ఒరిజనల్ గా అదే రేటుకు బిల్లు తీస్తే రూ.10,25,000 చొప్పున రైతుకు చెల్లించాలి. అలాగే రూ.1లక్ష వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది..  అదే రూ.5 నుంచి 6వేల వరకు బిల్లు ఇస్తే  రైతుకు నష్టం లేకపోవచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వానికి పన్ను చెల్లించేది మాత్రం  మొత్తం నెట్ అమౌంట్ రూ.3,00,000 చూపించి రూ.30వేలను మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే సుమారు 50 క్వింటాల మిర్చి పంటకు సుమారు రూ.60 నుంచి రూ.70వేలను నిర్థాక్ష్యణంగా నొక్కేస్తున్నారు. ఇలా మార్కెట్ యార్డ్ లో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం రైతులకు తెలిసి కొంత, తెలియకుండా కొంత అక్రమాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రైతులకు నష్టం లేకపోవడంతో రైతులకు అవసరాల అసరాగా తప్పని సరి వ్యాపారి మాట వినాల్సి వస్తోందని పలువురు రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

== రైతులను పై పన్ను ఇలా

మార్కెట్ లో నిలువున మోసం చేయడంలో రైతులను కూడా వదిలిపెట్టడం లేదు. ఎప్పుడైనా..ఎక్కడైనా..మా మోసం ఆగదు..రైతైనా..రాజైనా..మా తీరు మారదు..సిని కవి రాసిన పాట మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది.. ఆరుగాలం కష్టపడి పండించి సాగు చేసిన పంటను మార్కెట్ కు తీసుకోస్తే అనేక పన్నులంటూ రైతులకు కుచ్చుటోపి పెడుతున్న పరిస్థిత ఏర్పడింది.రైతులకు రూ.21వేల మద్దతు ధర ఇస్తున్నట్లే ప్రచారం జరుగుతుండగా, అందులో కటింగ్ లను చూస్తే అశ్ఛర్యపోవాల్సిందే. మార్కెట్ లో పనిచేసే స్వీపర్ నుంచి వ్యాగిన్, హామాలి, సీఏ అంటూ సుమారు రూ.5వేలకు పైగా కటింగ్ లు పెడుతున్నారు. అయితే ఒక్క రైతుకే ఒక్క బిల్లుపైన రూ.5వేలను కట్ చేస్తే వందలాధి మంది రైతులు తీసుకోస్తున్న మిర్చి, పత్తి పంట ద్వారా మార్కెట్ కు ఎంత ఆధాయం వస్తుందో అర్థం చేసుకోవాల్సి ఉంది.. ఈ తరహాలో మార్కెట్ లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి అనడగానికి ఈ ఒక్క ఉదాహరణే సాక్ష్యం.

allso read- భావోద్వేగానికి గురైన భట్టి విక్రమార్క

== బయటపడింది ఇలా..?

ఖమ్మం మార్కెట్ కమిటీలో జరుగుతున్న అక్రమాలను కొందరు వ్యాపారుల, రైతులు బయటపెట్టారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన పంటకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు, తాలు మిర్చిని కొనుగోలు చేస్తున్నట్లు రూ.5వేల నుంచి రూ.6వేల మాత్రమే ధర కల్పిస్తున్ట్లు బిల్లులు ఇవ్వడంతో అసలు కథ బయటకు పొక్కింది. దీంతో కొందరు వ్యాపారులు ఆ అక్రమ వ్యాపారాన్ని బట్టబయలు చేశారు. నవీన్ ట్రైడర్స్, ధర్మశాస్త్ర ట్రైడర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్న కొందరు రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు రూ.6వేల చొప్పన ధర కల్పిస్తూ బిల్లులు ఇవ్వడంతో రైతులు అక్రమ వ్యాపారాన్ని అడ్డంగా అధికారులకు పట్టించారు. దీంతో రెండు కంపెనీల వ్యాపారులకు రూ.1లక్ష చొప్పున జరిమాన విధించారు. అంతలోనే గురువారం ఉదయం మార్కెట్ యార్డులో వ్యాపారులు అదే తరహాలో మోసానికి పాల్పడుతుండటంతో కొందరు రైతులు ఆ అక్రమ వ్యాపారాన్ని బట్టబయలు చేశారు. దీంతో వ్యాపారులకు, వ్యాపారులకు మధ్య పెద్ద గొడవ జరిగింది. వాహనాలను పట్టిస్తున్న వ్యాపారులపై కొందరు వ్యాపారులు దాడికి యత్నించినట్లు తెలుస్తోంది.  

== అక్రమ వ్యాపారాన్ని పట్టుకున్న జర్నలిస్టులు

ఒక వైపు అక్రమ వ్యాపారం కొనసాగుతుంది, ప్రభుత్వానికి రావాల్సిన పన్నును ఎగవేస్తున్నారంటూ అధికారులు దాడులు చేస్తుండగా,  అధికారులు రూ.1లక్ష చొప్పున జరిమాన విధిస్తున్న పరిస్థితి ఉంది. మరో వైపు ఓ  వ్యాపారి ఓటమిని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్వయంగా వర్తక సంఘం బాధ్యులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం గమనర్హం. అయితే ఒక వైపు ప్రెస్ మీట్ నడుస్తుండగానే మరో వైపు ట్రైడర్లు వారి పనివారు కానిచ్చేస్తున్నారు. మార్కెట్ కు దగ్గరగా ఉన్న ఓ కోల్డ్ స్టోరేజీలో నవీద్ ట్రైడర్స్ వారు కు సంబంధించిన బోనగిరి నాగేశ్వరరావు పేరుతో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు వద్ద నుంచి 14 బస్తాల మిర్చిని రూ.20,500 చొప్పున కొనుగోలు చేశారు. కానీ బిల్లు మాత్రం క్వింటాకు రూ.6వేల చొప్పున రైతుకు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా నేరుగా అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన సూపరవైజర్ ఇవ్వన్ని కామనేగా సార్ అన్నట్లుగా మాట్లాడటం విలేకర్లను అశ్ఛర్యపరిచింది. పైగా అక్కడ ఓ వ్యాపారి పరిశీలించేందుకు రాగా ఆ వ్యాపారిపై కొందరు వ్యాపారులు దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. మీ సంగతి చూస్తామంటూ బెదిరిస్తుండగానే దిగుమతిశాఖ ప్ఱధాన కార్యదర్శి అక్కడకు వచ్చి సమస్యను తెలుసుకుని ఈ సమస్య మరోసారి జరగకుండా చూస్తామని విలేకర్లకు చెప్పి వెళ్లిపోయారు.allso read- కృష్ణ మృతితో  చిత్ర సీమలో ఒక శకం ముగిసింది : నామా

== రోజంతా నిలిచిన కొనుగోలు

మార్కెట్ యార్డ్ లో అక్రమాలు బయటపడుతుండటం, బయటపెడుతుండటంతో వ్యాపారులు అక్కడ నుంచి జారుకున్నారు. దీంతో గురువారం రోజంతా మిర్చి కొనుగోలు నిలిచినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మేము ఇలాగే చేస్తాం.. మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అన్నట్లుగా వ్యాపారులు మూకుమ్ముడిగా ఒకే మాటపై ఉండి, కొనుగోలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో చాలాగంటల పాటు కొనుగోలు నిలిచిపోయాయి. దీంతో రైతులు మార్కెట్ లో అలాగే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

== అధికారుల కన్నుసన్నాల్లోనే..?

ఖమ్మం మార్కెట్ లో వ్యాపారుల అక్రమ వ్యాపారం అధికారుల కన్నుసన్నాల్లోనే కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్కెట్ లో ఎక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది.. వ్యాపారులు చేసే బాగోతం అధికారులకు, మార్కెట్ వారికి తెలియదా..? అంటే వాళ్లకు తెలియకుండా జరుగుతుందా..? సార్ అంటూ రైతులు చెబుతున్న పరిస్థితి. అలా అక్రమ వ్యాపారానికి అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులే ప్రధాన సాక్ష్యంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక పాలక కమిటీకి ఈ విషయం కూడా తెలిసే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

== ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు : యర్రా అప్పారావు, వ్యాపారి

కొందరు వ్యాపారులు ప్రభుత్వాన్ని నిలువున మోసం చేస్తున్నారు. రైతులకు క్వింటాకు రూ.20,500 చెల్లిస్తూనే రూ.6వేలకు మాత్రమే బిల్లులు ఇస్తున్నారు. ఇదంతా అధికారులు, మార్కెట్ కమిటీకి తెలిసి జరుగుతుందేమో..?అర్థం కావడం లేదు. ఇప్పటికే రెండు లారీలను పట్టుకున్న అధికారులు, తిరిగి తనిఖీలు చేయడం లేదు. వ్యాపారులు అడ్డగోలుగా ప్రభుత్వాధాయానికి గండికొడుతున్నారు. మార్కెట్ లో ఇంకా అక్రమాలు ఉన్నాయి. వాటిని బయట పెట్టినందుకు మాపై దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలి. మార్కెట్ పై విజిలెన్సీ తనిఖీలు చేపట్టాలి.